• తాజా వార్తలు
  •  

ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

నేడు మన భారత దేశం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే ఇలా ప్రతీదానికీ ఆధార్ ను లింక్ చేయడం లో ఉన్న నిబద్దత నూ, విశ్వసనీయత నూ మరియు సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకుని ఆధార్ యొక్క వ్యాలిడిటీ ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. భారత చీఫ్ జస్టిస్ అయిన దీపక్ మిశ్రా నేతృత్వం లోని సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ ఆధార్ కేసు కు సంబందించిన  వాదనలను ఈ రోజు విననున్న నేపథ్యం లో ఆధార్ తన చరిత్ర లోనే అతిపెద్ద పరీక్షను ఈ రోజు ఎదుర్కొనుందా? అని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఆగష్టు లో 9 మంది సభ్యులతో కూడిన అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి అయిన JS ఖేకర్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం ప్రైవసీ అనేది ఒక ప్రాథమిక హక్కు గా తీర్పు చెప్పిన నేపథ్యం లో ఈ రోజు జరిగే హియరింగ్ కు మరింత ప్రాధాన్యత చేకూరింది.

ప్రభుత్వ సేవలకు ఆధార్ ను తప్పనిసరి చేయడం , ప్రజల వద్దనుండి బలవంతంగా తమ వేలిముద్రలు, ఐరిస్ లు తీసుకోవడం అనేవి వారి ప్రైవసీ కి ఏ మాత్రం భంగం కలిగించవు అని ప్రభుత్వం ఇప్పుడు వాదించవలసి ఉంటుంది. ఇది దేశ సార్వభౌమత్వానికీ, సెక్యూరిటీ కి, పబ్లిక్ ఆర్డర్ కూ ఇలా రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ( 2 ) ప్రకారమే ప్రభుత్వం వాదించవలసి ఉంటుంది. అయితే ఆధార్ ద్వారా సేకరించిన బయో మెట్రిక్ లు మొదలైన సమాచారాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయని పిటిషన్ దారులు వాదిస్తున్నారు. కేవలం రూ 500/- లు చెల్లిస్తే ఎవరి ఆధార్ కైనా ఎంత సులభంగా ఇంటర్ నెట్ లో యాక్సెస్ ను పొందవచ్చో రీసెంట్ సర్వే లలో వెల్లడైంది.

ఈ నేపథ్యం లో ఆధార్ యొక్క ప్రైవసీ ని, సెక్యూరిటీ ను పెంచడానికి ప్రభుత్వం ఒక రెండంచెల సెక్యూరిటీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 12 అంకెల ఆధార్ నెంబర్ కు బదులుగా ఒక వర్చ్యువల్ ఐడి ని క్రియేట్ చేసుకునే వెసులుబటును UIDAI కల్పించింది. ప్రజల్లో దీనిపట్ల ఉన్న గందరగోళాన్ని నివారించేందుకు వేలిముద్రల స్థానం లో ముఖ గుర్తింపును కూడా UIDAI ప్రవేశపెట్టనుంది.. అంటే వేలిముద్రలు, ఐరిస్, OTP లాంటి వాటికి బదులుగా ముఖ గుర్తింపు సరిపోతుంది అన్నమాట. జూన్ నుండి ఇది అందుబాటులోనికి రానుండడంతో వెరిఫికేషన్ కు ఇది మరొక అంచ లాగా ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తుంది.

ఇప్పటికే ప్రతీ ప్రభుత్వ సర్వీస్ కూ ఆధార్ ను తప్పనిసరి చేసింది. దీనికి మార్చ్ 31 ను డెడ్ లైన్ గా కూడా విధించింది. ఈ పరిస్థితులలో ఈ రోజు ఈ పిటిషన్ సుప్రీంకోర్టు లో విచారణకు రానుండడం తో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

జన రంజకమైన వార్తలు