• తాజా వార్తలు
  •  

దుర్వినియోగానికి చోటే లేని భీమ్ ఆధార్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న ఆరంభం అయిన నాటి నుంచి వినిపిస్తున్న‌పేరు డిజిట‌ల్ ఇండియా. భార‌త్‌ను అన్ని రంగాల్లో డిజిట‌లైజేష‌న్ చేసి ప్ర‌పంచంలోకెల్లా సాంకేతికంగా శ‌క్తివంతంగా త‌యారు చేయాల‌నేది ప్ర‌దాని సంక‌ల్పం. ఆ దిశ‌గానే కొన్నేళ్లుగా కేంద్ర‌ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశపెట్టింది. అలా రంగంలోకి వ‌చ్చిందే భీమ్ ఆధార్ పేమెంట్ విధానం. న‌గ‌దు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జ‌రిగే విధంగా ప్రోత్స‌హించ‌డానికి కేంద్రం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ భీమ్ ఆధార్ పేమెంట్ యాప్‌తో సెక‌న్ల‌లో మ‌నం చెల్లింపులు చేయ‌చ్చ‌ని.. దీని వ‌ల్ల త‌మ ఆశించిన డిజిట‌ల్ ఇండియా క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి అడుగులు ప‌డ‌తాయ‌ని కేంద్రం భావిస్తోంది. ప‌ల్లెటూరి వాళ్లు కూడి డిజిట‌ల్ పేమెంట్ చేసేలా ప్రోత్స‌హించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని కేంద్రం చెప్పింది. ఆధార్ కార్డుని బ్యాంక్‌తో లింక్ చేసుకుంటే చాల‌ని.. భీమ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ట‌. ఇది డేబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు కంటే సుర‌క్షిత‌మ‌ని చెబుతోంది.
12 అంకెల నంబ‌ర్
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు దుర్వినియోగం జ‌ర‌గ‌డం చాలా సాధార‌ణం విష‌యం. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఈ డిజిట‌ల్ కార్డుల ద్వారా డ‌బ్బులు పోగొట్టుకున్న‌వాళ్లు ఎంద‌రో! కానీ భీమ్ ఆధార్ పే వాడ‌డం వ‌ల్ల అలాంటి దుర్వినియోగానికి, మోసానికి వీలు ఉండ‌ద‌ట‌. ఎలాంటి మోసాల‌కు తావు లేకుండా ఈ యాప్‌ను రూపొందించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ వాడే వినియోగ‌దారుల‌కు 12 అంకెల ఐడింటిఫికేష‌న్ నంబ‌ర్ జారీ చేస్తారు.. భీమ్ ద్వారా పేమెంట్ చేయాలంటే మ‌న‌కు స్మార్ట్‌ఫోన్ ఉండ‌క్క‌ర్లేదు. మ‌న ఆధార్ బ్యాంక్‌కు లింక్ అయి ఉంటే చాలు. ఆధార్ నంబ‌ర్ చెబితే పేమెంట్ అయిపోతుంది. అలాగే మన బ్యాంకులో న‌గ‌దు నిల్వ‌లు ఉండ‌డం కూడా త‌ప్ప‌ని స‌రి. లోక‌ల్ కిరాణా, మెడిక‌ల్‌, హాస్పిట‌ల్స్ త‌దిత‌ర చోట్ల మనం సుల‌భంగా పేమెంట్ చేసే అవ‌కాశం ఉంది.
20 ల‌క్ష‌ల మంది ఎన్‌రోల్ చేసుకున్నారు
భీమ్ ఆధార్ యాప్ వాడ‌టానికి వ్యాపారులు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. దాదాపు 20 లక్ష‌ల మంది వ్యాపారులు ఈ యాప్ వాడేందుకు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. ప‌బ్లిక్ డిస్టిబ్యూష‌న్ సిస్ట‌మ్‌, షాప్ ఓన‌ర్లు, ఫెర్టిలైజ‌ర్ షాప్స్ భీమ్ ఆధార్ యాప్‌ను ఉప‌యోగించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు మ‌ర్కెంట్‌కు 0.25 శాతం క‌మిష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేయ‌డం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ఎలాంటి చార్జీలు ఉండ‌వు. నేష‌న‌ల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా టెస్టు చేయ‌బ‌డి.. సేఫ్ అండ్ సెక్యూర్‌గా తేలిన త‌ర్వాతే భీమ్‌ను దేశ‌వ్యాప్తంగా అన్ని చోట్లా వాడుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

జన రంజకమైన వార్తలు