• తాజా వార్తలు
  •  

తోలి ఐ.ఓ.టి ఎనేబుల్డ్ రోడ్ గా బెంగ‌ళూరు లోని బ్రిగేడ్ రోడ్ .

స్మార్ట్ సిటీలు.. చాలా రోజులుగా ప్ర‌భుత్వాలు వ‌ల్లిస్తున్న మంత్రమిది. దీని కోసం ప్ర‌త్యేకంగా కొన్ని సిటీల‌ను ఎంపిక చేసి వాటి జాబితాను కూడా త‌యారు చేశారు అధికారులు. అయితే సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో ముందుండే ఎల‌క్ట్రానిక్ న‌గ‌రం బెంగ‌ళూరు రోజు రోజుకు స్మార్ట్ అవుతోంది. ఇప్పుడు ఆ న‌గరంలోని రోడ్ల‌ను కూడా టెక్నాల‌జీతో అనుసంధానం చేస్తున్నారు. రూ.2090 కోట్ల భారీ నిధుల‌తో బెంగ‌ళూరు మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నారు అధికారులు. 

సర్వం టెక్నాల‌జీ మ‌యం
బెంగ‌ళూరులోని ప్ర‌ధాన రోడ్లైన ఎంజీ రోడ్‌, బ్రిడ్జ్ రోడ్‌లు త్వ‌ర‌లోనే టెక్నాల‌జీతో అల‌రార‌నున్నాయి.  సెంట్ర‌ల్ బిజినెస్ డిస్ట్రిక్స్ ఏరియాలో ఏడు కిలోమీట‌ర్ల ప‌రిథిలో స్మార్ట్ షూర్ రోడ్ల‌కు రంగం సిద్ధం అయింది. విధాన స‌భ ద‌గ్గ‌ర‌లోని అన్ని ప్రాంతాలు క‌వ‌ర్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ఈ రోడ్ల‌లో ఎక్క‌డ చూసినా మీకు టెక్నాల‌జీ ద‌ర్శ‌నం ఇవ్వ‌నుంది. 50 స్మార్ట్ కార్డు ఎనేబేల్డ్ ప‌బ్లిక్ బైసైకిల్ షేరింగ్ పాయింట్లు, 30 ఇ-రిక్షా స్టాండ్లు, 35 ఇ-టాయిలెట్లు, వాట‌ర్ ఏటీఏంలు, 420 సెన్సార్ బేస్డ్ స్మార్ట్ డ‌స్ట్‌బిన్స్‌, 50 డిజిగినేటెడ్ వెండింగ్ కియోస్క్‌లను అధికారులు ఏర్పాటు చేయ‌నున్నారు. 

స్మార్టు టెలికాం ట‌వ‌ర్లు
బెంగ‌ళూరు న‌గ‌రంలో 1250 స్మార్టు టెలికాం ట‌వ‌ర్లు కూడా రానున్నాయి. అంటే స్ట్రీట్ లైట్ పోల్స్ కంటే ఇవి రెట్టింపు సంఖ్య‌లో ఉంటాయి. ఇక వైఫై క‌నెక్టివీటి గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రోడ్ల‌లో ఎక్క‌డ చూసినా వైఫై హాట్ స్పాట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రోడ్ల‌న్నిటికి టెక్నాల‌జీ సొగ‌సులు అద్ద‌డానికి రూ.2090 కోట్ల నిధుల అవ‌స‌రం ఉంద‌ని అధికారులు చెప్పారు. స్మార్ట్ మార్కెట్‌, స్మార్ట్ రోడ్ల నిర్మాణానికి అధికారులు 21.8 స్కే.కి.మీ ప‌రిథిలో కొన్ని ప్రాంతాల‌ను వారు ఎంపిక చేశారు. ఐఓటీ బేస్డ్ సొల్యుష‌న్స్‌ను నియంత్రించ‌డానికి స్మార్ట్ టెలికాం ట‌వ‌ర్ల ఉప‌యోగ‌ప‌డున్నాయి. అంటే స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ డ‌స్ట్‌బిన్ల‌ను ప‌ని చేసేలా చేయాలంటే ఐఓటీ సొల్యుష‌న్స్ అవ‌స‌రం ఉంది. ప్ర‌స్తుతానికి స్టేట్ మ‌రియు కేంద్ర ప్ర‌భుత్వాల నుంచి న‌గ‌ర పాల‌క సంస్థ‌కు విడివిడిగా రూ.500 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా బెంగ‌ళూరును భార‌త్‌లోనే అద్భుత‌మైన స్మార్ట్ సిటీగా త‌యారు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు