• తాజా వార్తలు

ల‌క్ష ప‌ల్లెల‌కు.. బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్

డిజిట‌ల్ ఇండియా కాన్సెప్ట్‌ను బ‌లంగా న‌మ్ముతున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆ టార్గెట్‌ను చేరుకోవ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ ట్రాన్సాక్ష్ల‌న్లు, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు న‌గ‌రాల‌ను దాటి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు తీసుకురాగ‌లిగింది. డీమానిటైజేష‌న్ ప్ర‌భావం, మొబైల్ ఇంట‌ర్నెట్ జ‌నంలోకి బాగా చొచ్చుకుని రావ‌డంతో వీటికి మార్గం తేలికైంది. ఇక ఇప్ప‌డు పల్లెల వంతు.
గ్రామాల‌ను కూడా ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ చేయ‌డానికి భార‌త్ నెట్ ప్రోగ్రాంను ఇప్ప‌టికే ప్రారంభించింది. మొత్తం రెండున్న‌ర ల‌క్ష‌ల గ్రామ పంచాయ‌తీల‌కు బ్రాడ్‌బ్యాండ్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం దీని టార్గెట్‌. ప్రోగ్రాం ఫ‌స్ట్ ఫేజ్‌లో ల‌క్ష పంచాయ‌తీలకు బ్రాడ్ బ్యాండ్ సౌక‌ర్యం క‌ల్పించి ఇంట‌ర్నెట్ ను ప‌ల్లె ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెల నాటికి 80 వేల గ్రామ పంచాయ‌తీల‌కు బ్రాడ్ బ్యాండ్ సౌక‌ర్యం క‌ల్పించింది. త‌మ ల‌క్ష్యం ల‌క్ష‌లో మిగిలిన 20 వేల గ్రామాల‌కు కూడా ఏప్రిల్ నెలాఖరు నాటికి బ్రాడ్ బ్యాండ్ అందిస్తామ‌ని సెంట్ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ మినిస్ట‌ర్ మ‌నోజ్ సిన్హా రాజ్య‌సభ‌లో ఎనౌన్స్ చేశారు.
25 వేల ప‌బ్లిక్‌ వై ఫై హాట్‌స్పాట్లు రూర‌ల్ ఏరియాలోని ప్ర‌జ‌ల‌కు ఇంట‌ర్నెట్ ఆధారిత సేవ‌లందించేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇందుకోసం అన్ని పంచాయ‌తీల్లో వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేస్తారు. భార‌త్ నెట్ ప్రోగ్రాంలో సెకండ్ ఫేజ్‌ను 2018 డిసెంబ‌ర్‌క‌ల్లా పూర్తి చేయాల‌న్న‌ది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ల‌క్ష్యం. కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, హ‌ర్యాణా రాష్ట్రాల‌తోపాటు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల్లో బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు కోసం కేబుల్ వేస్తున్నారు. రానున్న రోజుల్లో 1127 వైఫై హాట్‌స్పాట్ల‌ను గ్రామాల్లో నెల‌కొల్పుతామ‌ని, 25వేల ప‌బ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌ల‌ను రూర‌ల్ టెలిఫోన్ ఎక్స్చేంజిల్లో సెట‌ప్ చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ముఖ్యంగా వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప‌శ్చిమ‌బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప‌ల్లె ప్ర‌జ‌ల‌ను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ చేసి వారిలో చైత‌న్యం తేవాల‌న్న‌ది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆలోచ‌న.

జన రంజకమైన వార్తలు