• తాజా వార్తలు
  •  

మొబైల్ నెంబ‌ర్ పోర్టబులిటీలా అతి త్వ‌ర‌లో ప‌వ‌ర్ స‌ప్లై పోర్టబులిటీ.. నిజ‌మేనా? 

మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ వ‌చ్చాక టెలికం కంపెనీల మోనోప‌లీకి చాలావ‌ర‌కు త‌గ్గింది.  యూజ‌ర్లు త‌మ నెంబ‌ర్ మార్చ‌కుండానే నెట్‌వ‌ర్క్ మార్చుకోవ‌డ‌మే మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ. దీన్ని ప్ర‌జ‌లు పెద్దగా వినియోగించుకోక‌పోయినా కంపెనీల‌యితే కొంత కంట్రోల్‌లోకి వ‌చ్చాయ‌న్న‌ది కాద‌న‌లేద‌ని స‌త్యం. ఇప్పుడు ఇదే ప‌ద్ధ‌తిలో ప‌వ‌ర్ స‌ప్లైకి పోర్టబులిటీ రాబోతుందా?  సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్లానింగ్ చూస్తుంటే ఇది నిజ‌మని తేలుతోంది. 
పార్ల‌మెంట్‌లో బిల్ పెట్టే ప్లాన్ 
ఎలక్ట్రిసిటీ వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన స‌ప్ల‌యర్ నుంచి ప‌వ‌ర్ తీసుకునేందుకు వీలుగా మొబైల్ నెంబ‌ర్ పోర్టబులిటీని తీసుకురావ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ యాక్ష‌న్ ప్లాన్ ర‌డీ చేస్తోంది.  న‌వంబ‌ర్లో జ‌రిగే  పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లోనే దీనిమీద ఒక బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది.  ఈ బిల్లు పాస‌యితే విద్యుత్ వినియోగ‌దారులు త‌మ క‌నెక్ష‌న్ మార్చ‌కోకుండానే   అందుబాటులో ఉన్న ప‌వ‌ర్ స‌ప్లై కంపెనీల్లో బెస్ట్ అనుకున్న‌దానికి మారిపోవ‌చ్చు. కంపెనీలు కాద‌న‌డానికి వీల్లేదు. 
క‌స్ట‌మ‌ర్‌కు బెనిఫిట్టే 
ఇండియాలో 25 కోట్ల విద్యుత్ క‌నెక్ష‌న్లున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ సంస్థ‌లే విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసి యూజ‌ర్ల నుంచి బిల్ వ‌సూలు చేస్తాయి. అయితే ఢిల్లీ, మ‌హారాష్ట్ర, హ‌ర్యాణా త‌దిత‌ర రాష్ట్రాల్లో రిల‌య‌న్స్‌, అదానీ లాంటి పెద్ద కంపెనీలు ప‌వ‌ర్ స‌ప్లై సెక్టార్‌లో ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఈ పోర్ట‌బులిటీతో క‌స్ట‌మ‌ర్‌కు ఎక్కువ లాభం ఉంటుంది. కంపెనీలు పోటీప‌డి ధ‌ర‌లు త‌గ్గిస్తాయి. ప‌వ‌ర్‌క‌ట్స్‌, అంత‌రాయాలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాయి. ఏపీ, తెలంగాణ‌ల్లో ట్రాన్స్‌కో ద్వారా ప‌వ‌ర్ స‌ప్లై చేస్తున్నారు. ఇక్క‌డ కూడా ప్రైవేట్ కంపెనీలు వ‌స్తే యూజ‌ర్‌కు మేలు జరుగుతుంది. మూడు నుంచి ఐదేళ్ల‌లో పోర్ట‌బులిటీని ఇంప్లిమెంట్ చేయాల‌న్న‌ది సెంట్ర‌ల్ ఆలోచ‌న‌.   అయితే ఈ బిల్లును రాష్ట్రాలు వ్య‌తిరేకించే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌డంతో టైం ఫ్రేమ్ పెట్ట‌కుండా ముందు పోర్ట‌బులిటీకి ఒప్పించేందుకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.  బిల్లు పాస‌యితే దీని ఇంప్లిమెంటేష‌న్ మీద రాష్ట్రాల‌ను వెంట‌ప‌డ‌డం ఖాయం.  

జన రంజకమైన వార్తలు