• తాజా వార్తలు

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ రీ వెరిఫికేష‌న్ ఇక సూప‌ర్ ఈజీ 

మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో రీవెరిఫికేష‌న్ చేసుకోండ‌ని మెసేజ్‌లు, కాల్స్ ఇప్ప‌డు అంద‌రికీ వ‌స్తున్నాయి.    సెల్ కంపెనీల ఆథ‌రైజ్డ్ స్టోర్‌ల‌కు వెళ్లి రీ వెరిఫికేష‌న్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్‌లో సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ భావిస్తోంది. అందుకే వృద్ధుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఓటీపీబేస్డ్ రీ వెరిఫికేష‌న్తో ఈ ప్రాసెస్‌ను ఈజీ చేయ‌బోతోంది.  
ఎస్ఎంఎస్‌, ఐవీఆర్ఎస్‌తో..
2018లో తొలి రెండు, మూడు నెల‌ల్లోనే ఆధార్‌తో మొబైల్ నెంబ‌ర్ రీవెరిఫికేష‌న్ పూర్తి చేయాల‌న్న‌ది టెలికం డిపార్ట్‌మెంట్ టార్గెట్‌. దీనిలో ప్రాక్టిక‌ల్‌గా ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను తీర్చ‌డంపై దృష్టి పెట్టింది.  ఫింగ‌ర్ ప్రింట్ వేసి ఆధార్ అథెంటికేష‌న్ చేసుకుని  మొబైల్ నెంబ‌ర్ రీ వెరిఫై చేయాల‌న్న‌ది రూల్‌. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్లు వేలిముద్ర‌లు వేయ‌లేక‌పోతున్నార‌ని, వేసినా అవి స‌రిగా రాక‌పోవ‌డంతో అథెంటికేష‌న్ పూర్త‌వ‌డం లేద‌ని కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో టెలికం కంపెనీలు ఇలాంటి వారికి ఓటీపీ బేస్డ్ రీ వెరిఫికేష‌న్ అందుబాటులోకి తేవాల‌ని టెలికం డిపార్ట్‌మెంట్ సూచించింది. ఎస్ఎంఎస్‌, ఐవీఆర్ ఎస్ ద్వారా ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని చెప్పింది. అయితే దీనికంటే ముందు ఈ ఓటీపీ బేస్డ్ రీవెరిఫికేష‌న్‌కు ఆధార్ ఆథ‌రైజ్డ్ ఏజెన్సీ అయిన  UIDAI అప్రూవ‌ల్ తీసుకోవాల‌ని కూడా చెప్పింది.  
ఆధార్ డేటా బేస్‌లో 50 కోట్ల నంబ‌ర్లు
మీడియా  రిపోర్టుల ప్ర‌కారం 50 కోట్ల మంది మొబైల్ నెంబ‌ర్లు ఆధార్ డేటా బేస్ లో ఫీడ‌యి ఉన్నాయి.  వ‌న్‌టైమ్ పాస్‌వ‌ర్డ్ పంపిస్తే రీ వెరిఫికేష‌న్ చేసుకోగ‌లిగే అవ‌కాశం   క‌ల్పిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్లు, ఏదైనా ప్ర‌మాద‌వశాత్తూ వేలిముద్ర‌లు ఇవ్వ‌లేనివాళ్ల‌కు రీ వెరిఫికేష‌న్ ఈజీ అవుతుంది.  

జన రంజకమైన వార్తలు