• తాజా వార్తలు
  •  

తొలిసారిగా ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌కు నిబంధ‌న‌లు విధించిన ప్ర‌భుత్వం 


 ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ అనేది ఇటీవ‌ల కాలంలో ఇండియాలో బాగా కామ‌న్ అయిపోయింది.  సోష‌ల్ మీడియా, మెసెంజ‌ర్ యాప్స్ వ‌చ్చాక స‌మాచారం ఒక‌రి నుంచి ఒక‌రికి సెక‌న్ల‌లోనే కొన్ని ల‌క్ష‌ల మందికి చేరిపోతోంది.  అందుకే హింస‌, అశాంతి వంటి సిట్యుయేష‌న్స్‌లో నెగిటివ్ న్యూస్‌లు వైర‌ల్ కాకుండా ఇంట‌ర్నెట్ ఆపేస్తున్నారు. గ‌త ఏడాదిలో కాశ్మీర్‌లో చాలా సార్లు, ప్ర‌స్తుతం డేరాబాబా అల్ల‌ర్ల నేప‌థ్యంలో పంజాబ్‌, హ‌ర్యానాల్లోనూ ఇంట‌ర్నెట్‌ను రోజుల త‌ర‌బ‌డి ష‌ట్ డౌన్ చేసేశారు. ఇక ముందు అలా ఇష్టానుసారం షట్‌డౌన్ చేయ‌డానికి అవ‌కాశం లేదు. ఇందుకోసం గ‌వ‌ర్న‌మెంట్ కొన్ని రూల్స్‌ను తీసుకొచ్చింది. 

ఇవీ రూల్స్‌
మినిస్ట్రీ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ ఇండియాలో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ను కంట్రోల్ చేయ‌డానికి కొన్ని డైరెక్ట‌వ్స్‌, ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ రిలీజ్ చేసింది. ‘Temporary Suspension of Telecom Services (Public Emergency or Public Safety) Rules, 2017’ కింద  క‌మ్యూనికేష‌న్ మిన‌స్ట్రీ ఈ రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  
* దీని ప్ర‌కారం  జిల్లా క‌లెక్ట‌ర్లు, మేయ‌ర్లు వంటి  లోక‌ల్ ఎడ్మినిస్ట్రేట‌ర్స్‌కు ఇంట‌ర్నెట్ ష‌ట్ డౌన్ చేసే ఆర్డ‌ర్స్ ఇవ్వ‌డానికి అవ‌కాశం లేదు.  
* సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ నుంచి హోం మినిస్ట్రీ సెక్ర‌ట‌రీ మాత్ర‌మే ఫ‌లానా స్టేట్‌లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ చేయాల‌ని ఆర్డ‌ర్స్ ఇవ్వాలి.
* ఎమ‌ర్జెన్సీ అయితే యూనియ‌న్ హోం సెక్ర‌ట‌రీ అనుమ‌తి పొందిన జాయింట్ సెక్ర‌ట‌రీ ఆ పై స్థాయి అధికారి మాత్ర‌మే ఈ ఆర్డ‌ర్స్ ఇవ్వ‌గ‌ల‌రు. వీటిని 24 గంట‌ల్లోపు హోం సెక్ర‌ట‌రీ రివ్యూ చేయాలి. 
* స్టేట్ లెవెల్‌లో అయితే సెక్ర‌ట‌రీ టు ది  స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ది హోం డిపార్ట్‌మెట్  ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ ఆర్డ‌ర్స్ ఇవ్వాలి. ఎమ‌ర్జెన్సీ అయితే స్టేట్ హోం సెక్ర‌ట‌రీ అనుమ‌తి పొందిన జాయింట్ సెక్ర‌ట‌రీ ఆ పై స్థాయి అధికారి మాత్ర‌మే ఈ ఆర్డ‌ర్స్ ఇవ్వ‌గ‌ల‌రు. వీటిని 24 గంట‌ల్లోపు హోం సెక్ర‌ట‌రీ రివ్యూ చేయాలి. 
* ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ ఆర్డ‌ర్స్ ఎస్పీ స్థాయి పోలీసు అధికారికి మాత్ర‌మే ఇవ్వాలి.   

ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ చాలా ఖ‌రీదు  
సాఫ్ట్‌వేర్ ఫ్రీడ‌మ్ లా సెంట‌ర్ అనే సంస్థ రిపోర్ట్ ప్ర‌కారం 2012 నుంచి 2017 వర‌కు ఇండియాలో 62 సార్లు ఇంట‌ర్నెట్ ష‌ట్ డౌన్ చేశారు.  దీనివ‌ల్ల 9వేల కోట్ల రూపాయ‌ల  న‌ష్టం జ‌రిగింది.   

జన రంజకమైన వార్తలు