• తాజా వార్తలు
  •  

ఇండియా.. 60 శాతం క్యాష్ లెస్

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా క్యాష్‌లెస్‌ ఎకానమీ వేగం పుంజుకుంది. గత ఏడాది నవంబర్‌ నుంచి ప్రజలు క్యాష్‌లెస్‌ ఎకానమీ, డిజిటల్‌ పేమెంట్స్‌ లావాదేవీలు అత్యధికంగా జరుపుతున్నట్లు ప్రభుత్వం రీసెంటుగా ప్రకటించింది. నల్లధనాన్ని తగ్గించే క్రమంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం నియంత్రణ పెట్టడంతో డిజిటల్‌ పేమెంట్స్‌, క్యాష్‌లెస్‌ లావాదేవీలు అధికమయినట్లు బ్యాంకులు ప్రకటించాయి. దేశం మొత్తం మీద జనవరి నెలలో క్రెడిట్‌ కార్డు లావాదేవీలకన్నా.. డెబిట్‌ కార్డు, డిజిటల్‌ చెల్లింపులు చాలా ఎక్కువగా జరిగాయని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో 60 శాతం మంది క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డులున్నవారంతా గరిష్ఠంగా ఆన్ లైన్ లావాదేవీలు జరుపుతుతన్నట్లు చెబుతున్నారు. ఈ
ఏడాది జనవరి నెలలో మొత్తం ప్రయివేట్‌ బ్యాంకుల లావాదేవీల మొత్తం రూ. 29.339 కోట్లు. అందులో కార్డు, డిజిటల్‌ పేమెంట్స్‌ లావాదేవీలు 19,664 కోట్ల రూపాయలని బ్యాంకులు చెబుతున్నాయి. ఇదే గత అక్టోబర్‌ నెల నాటికి.. ఒక వ్యక్తి 100 లావాదేవీలు జరిపితే.. అందులో కేవలం 19 మాత్రమే కార్డు లావాదేవీలు జరిగేవి. అదే ప్రస్తుతం 100కు 90 శాతం కార్డుతోనే లావాదేవీలు జరుపుతున్నారని బ్యాంకులు అంటున్నాయి.
గత డిసెంబర్‌లో..
పెద్ద నోట్ల రద్దు తరువాత అంటే డిసెంబర్‌ నెలలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఊపందుకున్నాయి. ముఖ్యంగా 104.05 లక్షల కోట్ల రూపా యల డిజిటల్‌ చెల్లింపులు జరిగాయి. ఇవన్నీ కూడా క్రెడిట్‌, డెబిట్‌, యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఇదే జనవరి నెలలో… రూ. 8,704 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 7,630 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలను ప్రజలు నిర్వహించారని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

జన రంజకమైన వార్తలు