• తాజా వార్తలు
  •  

2017లో భారత్ ఇప్పటివరకు 29 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది ఎందుకు?

ఇంటర్నెట్ మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం, డబ్బు ఎలా అవసరమో ఇంటర్నెట్ కూడా అలాగే తప్పనిసరి అవసరంలా మారిపోతోంది. అయితే... ఇండియాలో మాత్రం ప్రభుత్వాలు ఒక్కోసారి ఇంటర్నెట్ సేవలను ఆపేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగేటప్పుడు, కొన్ని సార్లు పరీక్షల సమయాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నాయి. కశ్మీర్‌లో అశాంతి నెలకొనడంతో ప్రభుత్వం మూడు నెలలుగా పలుమార్లు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. అల్లర్లను మరింత పెంచేలా సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు.  
    ఇలా ఇంటర్నెట్ ఆపేయడం వల్ల చాలా రకాల నష్టాలు కలుగుతున్నాయి. గత మూడేళ్లలో  కేవలం ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల రూ.6458 కోట్ల నష్టమేర్పడినట్లు బ్రూకింగ్ ఇనిష్టిట్యూషన్ నివేదికతో తేలింది. ఈ ఏడాది ఇప్పటివరకు 29 సార్లు వేర్వేరు రాష్ర్టాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరిగాయి.

2017లో ఇప్పటివరకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇలా..
* జమ్మూకాశ్మీర్
 ఈ ఏడాది ఇప్పటివరకు 10 సార్లు ఇక్కడ ఆపేశారు. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత ఏకంగా 17 రోజుల పాటు నెట్ లేదు. 2011 నుంచి మొత్తం 40 సార్లు ఆపారు.
* రాజస్థాన్
ఈ ఏడాది 3 సార్లు ఆపేశారు.
* హర్యానా
2017లో 5 సార్లు ఇంటర్నెట్ సేవలు ఆపేశారు.
* ఉత్తర్ ప్రదేశ్
ఈ ఏడాది ఇప్పటివరకు రెండుసార్లు ఆపారు.
* మధ్యప్రదేశ్ లో ఒకసారి, పశ్చిమబెంగాల్ లో మూడుసార్లు... నాగాలాండ్ లో మూడు సార్లు, మహారాష్ర్టలో ఒకసారి, ఒడిశాలో రెండు సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ఎక్కువగా మత కల్లోలాలు, ఇతర భారీ ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నప్పుడు ఇలా ఇంటర్నెట్ ను ఆపివేస్తున్నారు.  కశ్మీర్‌ ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత కారణంగా 2016లో అక్కడ ఐటీ రంగానికి విఘాతమేర్పడింది. పలు సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి.  సుమారు 7 వేల మంది ఉద్యోగాలకు కోత పడింది. 
 

జన రంజకమైన వార్తలు