• తాజా వార్తలు
  •  

యాపిల్ సాయంతో గంట‌కు 600 కి.మీ వేగంతో ప‌రుగెత్త‌నున్న భార‌త రైళ్లు

భార‌త్‌లో వేగంగా న‌డిచే ఎక్స్‌ప్రెస్ ఏంటి? అదెంత వేగంతో న‌డుస్తుంది అంటే చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే భార‌త్‌లో వేగంగా న‌డిచే రైళ్లు చాలా త‌క్కువ‌. శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ లాంటి వచ్చినా అవి కొన్ని లైన్ల‌కే ప‌రిమితం. మ‌రి చైనా, జ‌పాన్‌లోలా బుల్లెట్ వేగంతో న‌డిచే బుల్లెట్ ట్ర‌యిన్స్‌ను మ‌నం భ‌విష్య‌త్ చూడ‌గ‌ల‌మా! అయితే టెక్నాల‌జీ సాయంతో ఆ దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. భార‌త్‌లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు టెక్ దిగ్గ‌జం యాపిల్ సాయం తీసుకుంటోంది రైల్వే శాఖ‌.  

రూ.18 వేల కోట్ల బ‌డ్జెట్‌తో
భార‌త్‌లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ 18 వేల కోట్ల రూపాయిల పెట్టుబ‌డి పెడుతోంది. ఈ విష‌యాన్ని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భు ఇటీవ‌లే వెల్ల‌డించారు. అధునాత సాంకేతిక‌త‌తో రైల్వేను అనుసంధానించ‌డం వ‌ల్ల వేగంలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.  ముంబ‌యి, దిల్లీ మ‌ధ్య న‌డిచే గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్‌తో స‌హా ప‌లు రైళ్ల‌ను ఈ ప్రాజెక్ట్ కింద చేర్చామ‌ని.. వాటి వేగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  తాజా ప్రాజెక్టుతో గంట‌కు 200 కి.మీ వేగంతో రైళ్ల‌ను న‌డిపించాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. దిల్లీ-ముంబ‌యి, దిల్లీ-కోల్‌కాతా మ‌ధ్య గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్ గంట‌కు 200 కి.మీ వేగంతో ప‌రుగులు తీస్తుంద‌ని దీనికి యాపిల్ సాంకేతిక సాయం అందిస్తుంద‌ని అధికారులు చెప్పారు. ఇత‌ర ట్ర‌యిన్స్ గంట‌కు 600 కి.మీ వేగంతో న‌డిచేలా యాపిల్ కొత్త టెక్నాల‌జీని రూపొందిస్తుంద‌ని వారి మాట‌.

ఎలా సాధ్య‌మైందంటే..
భార‌త్‌తో బుల్లెట్ వేగంతో న‌డిచే ట్ర‌యిన్స్‌! ఒక‌ప్ప‌టి క‌ల‌.. కానీ త్వ‌ర‌లోనే మ‌నం చూడ‌బోతున్నాం.  గంట‌ల జ‌ర్నీని కుదించేసి.. మ‌నల్ని వేగంగా, సుర‌క్షితంగా ఇంటికి చేర్చే ట్ర‌యిన్స్ త్వ‌ర‌లోనే రాబోతున్నాయి. కేవ‌లం వేగం మాత్ర‌మే కాదు ఎన్నో ఆధునిక హంగులుఈ ట్ర‌య‌న్ల సొంతం కానున్నాయి. యాపిల్ ఎర్త్ ష‌ట్ట‌రింగ్ టెక్నాల‌జీ కాన్సెప్ట్‌తో  భార‌త రైళ్ల వేగంగా మ‌నం ఊహించ‌నంత‌గా పెరిగిపోనుంది. ఎంత‌గా అంటే మామూలు స్థాయి కంటే ఆరు రెట్ల వేగం ఈ కొత్త టెక్నాల‌జీ వ‌ల్ల రానుంది. ఇటీవ‌ల భార‌త్‌కు వ‌చ్చిన యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో భార‌త అధికారులు ఒప్పందం చేసుకున్నారు.  అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ప‌ట్టాలు ఎక్క‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంది.

జన రంజకమైన వార్తలు