• తాజా వార్తలు
  •  

మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

ఆధార్ కార్డు.. ప్ర‌జ‌ల బ‌హుళ ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వానికి జ‌వాబుదారిగా ఉండాల‌ని, వారి లెక్క‌లు ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉండాలనే ఉద్దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్ కార్డుల‌ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించాల‌ని కోరింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే చాలామంది త‌మ అకౌంట్‌తో ఆధార్ కార్డుకు లింక్ చేశారు కూడా. అయితే చాలామందిని తొలిచేస్తున్న‌ప్ర‌శ్న క‌చ్చితంగా మ‌న బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానించాలా అని? అయితే న‌ల్ల‌ధ‌నాన్ని దేశం నుంచి నిర్మూలించే ప‌నిలో ఉన్న ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌లు ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేయాల‌నే చెబుతోంది. గ‌త రెండు నెల‌ల నుంచి క‌స్ట‌మ‌ర్ల‌పై ఈ ఒత్తిడి మ‌రింత ఎక్కువైంది. వెంట‌నే ఆధార్ కార్డు వివ‌రాలు అందించాల‌ని అన్ని బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు సందేశాలు పంపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు కాల్స్ చేస్తున్నాయి. చాలామందికి ప్ర‌తి రోజూ ఈ మెసేజ్‌లు వ‌స్తున్నాయి.

మాండేట‌రి కాదా..
బ్యాంకులు ఒత్తిడి చేస్తున్న‌ట్లు, ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా మ‌న బ్యాంకు అకౌంట్‌తో ఆధార్‌ను అనుసంధానించ‌డం త‌ప్ప‌ని స‌రి కాదు. బ్యాంకులు ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేసేట‌ప్పుడు రిజ‌ర్వ్ బ్యాంకు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఇలా ఆధార్‌ను లింక్ చేయ‌డం త‌ప్ప‌ని స‌రి అని రిజ‌ర్వ్ బ్యాంకు బ్యాంకుల‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌న‌ట్లు స‌మాచారం. దీని ప్ర‌కారం మ‌నం క‌చ్చితంగా మ‌న అకౌంట్‌తో ఆధార్‌ను అనుసంధానించాల్సిన అవ‌స‌రం లే దు. చాలామందికి త‌మ బ్యాంకు వివ‌రాలు బ‌య‌ట‌కు వెళ్లాల‌ని కోరుకోరు. ఇలా ఆధార్‌తో అనుసంధానించడం వ‌ల్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతామ‌యేమోన‌ని క‌స్ట‌మ‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు.

ఆధార్‌తో లింక్ ఎందుకు?
ప్ర‌స్తుతం ఏ బ్యాంకుకు వెళ్లినా ఆధార్‌తో లింక్ చేసుకోమ‌ని చెప్పి ప్ర‌త్యేకంగా కౌంట‌ర్లు పెడ‌తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ల‌ను పెట్టి మోటివేట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌కి వెళ్లినా అక్క‌డ కూడా సైట్ ఓపెన్ చేయ‌గానే ఆధార్ లింక్ మన‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. లింక్ చేసుకోమ‌ని ప్రొవొక్ చేస్తోంది. ఏటీఎంలు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఉప‌యోగించుకుని లింక్ చేసుకోమ‌ని ప్ర‌భుత్వం కూడా ప్రోత్స‌హిస్తోంది. నిజానికి జులై 2014, ఆగ‌స్టు 2015 మ‌ధ్య ఓపెన్ అయిన ఎన్ఆర్ఐ అకౌంట్లు మాత్ర‌మే ఆధార్‌కు లింక్ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం అప్ప‌ట్లో కోరింది. ఫారిన్ అకౌంట్స్ టాక్స్ కాంప్లెన్స్ యాక్ట్ ప్ర‌కారం పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆధార్ లింక్ ఛేయాల‌ని చెప్పింది. కానీ ఇప్పుడు ఇదే అదే చ‌ట్టాన్ని భార‌త పౌరుల‌కు కూడా అమలు చేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు