• తాజా వార్తలు
  •  

రైట్ టు ప్రైవ‌సీపై సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌.. మ‌నంద‌రం గుర్తించాల్సిన విష‌యాలివీ

రైట్ టు ప్రైవ‌సీ (గోప్య‌త హ‌క్కు)  దేశంలోని ప్ర‌తి పౌరుడి ప్రాథ‌మిక హ‌క్కు అని సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్‌తోస‌ఙా 9 మంది జ‌డ్జిల బెంచ్ ఈ కేసులో వాదోప‌వాదాలు విని రైట్ టు ప్రైవ‌సీ అననేది ప్ర‌తి సిటిజ‌న్‌కు ప్రాథ‌మిక హ‌క్కు అని తేల్చిచెప్పింది. ఇది  స్వ‌తంత్ర్య భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే ఒక కీల‌క‌మైన జ‌డ్జిమెంట్ అని అంద‌రూ చెబుతున్నారు.

ఆధార్‌పై వెన‌క‌డుగు వేస్తుందా?

ఇప్ప‌టికే ఆధార్ డేటా  సేఫ్టీ మీద ఎన్నో అనుమానాలు. డేటా లీక‌యిందంటూ వార్త‌లు. కొన్ని వెబ్‌సైట్ల‌లో ఆధార్ డేటా లీక‌యిన ఆన‌వాళ్లు. మ‌రోవైపు గవ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్కీమ్‌కు ఆధార్ కంపల్స‌రీ అంటుంది. గ్యాస్ స‌బ్సిడీ నుంచి డెత్ స‌ర్టిఫికెట్ ఇష్యూ వ‌ర‌కు ప్ర‌తి ప‌నికీ ఆధార్‌తో లింక్ పెడుతుంది. కాబ‌ట్టి ప‌ని జ‌ర‌గాలంటే ఆధార్ నెంబ‌ర్ ఇవ్వ‌క తప్ప‌దు. ఇస్తే త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఎక్క‌డ వేరేవాళ్ల చేతికి చేర‌తాయోన‌ని కోట్ల మంది ప్ర‌జ‌ల్లో సందేహాలున్నాయి.  రైట్ టు ప్రైవ‌సీపై సుప్రీంకోర్టు ఇంత స్ప‌ష్ట‌మైన జ‌డ్జిమెంట్ ఇచ్చాక ఇప్పుడు ఆధార్‌పై గ‌వ‌ర్న‌మెంట్ ఏం చేస్తుంద‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్‌గా మారింది.

లిమిట్ చేయొచ్చు

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆధార్‌పై వెన‌క‌డుగు వేయడం చాలా క‌ష్టం. ఎందుకంటే అన్నింటికీ అదే ఆధారంగా మారింది. కానీ ఆధార్ ఉండాల‌న్న రూల్స్‌ను మాత్రం కొన్ని విష‌యాల‌కే లిమిట్ చేసే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే ఆధార్ డేటా లీకేజి క‌నుక అయితే అది రైట్ టు ప్రైవ‌సీని వయొలేట్ చేసిన‌ట్లే. కాబట్టి ప్ర‌భుత్వం ఆధార్ విష‌యంలో కొంత దూకుడు త‌గ్గించే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఆధార్ రిలేటెడ్ ఇష్యూస్‌పైనా చాలా మంది వేసిన పిటిష‌న్ల‌పై విచార‌ణ దాదాపు పూర్త‌యింది. ఐదుగురు సుప్రీం కోర్టు జ‌డ్జిల బెంచ్ దీనిపై ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి.

జన రంజకమైన వార్తలు