• తాజా వార్తలు

ఐటీతోనే స‌మ‌స్య‌ల‌కు సొల్యూష‌న్‌

టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో భాగ‌మైపోయింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గానో, ఇన్ఫ‌ర్మేష‌న్ రిలేటెడ్‌గానో మాత్ర‌మే టెక్నాల‌జీని చూసే ప‌రిస్థితి లేదిప్పుడు. మొబైల్ ఫోన్ రాక‌తో స‌మాచార విప్ల‌వానికి టెక్నాల‌జీ తెర‌తీస్తే.. స్మార్ట్‌ఫోన్ల సంఖ్య పెర‌గ‌డం ప్ర‌జ‌ల్నిడిజిట‌ల్ వైపు ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దానికి త‌గ్గ‌ట్టే అడ్మినిస్ట్రేష‌న్‌లో టెక్నాల‌జీకి చాలా వాల్యూ ఇస్తున్నాయి. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అయితే డిజిట‌ల్ ఇండియా అనే ప్రోగ్రాంనే ప్రారంభించింది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా గ‌వ‌ర్న‌మెంట్ ఎడ్మినిస్ట్రేష‌న్లో అవ‌కాశ‌మున్న ప్ర‌తిచోటా టెక్నాల‌జీని వినియోగిండ‌చం ఈ ప్రోగ్రాం మెయిన్ థీమ్‌. టెక్నాల‌జీలో మ‌న‌కు కావ‌ల్సిన‌వన్నీ మ‌న‌మే త‌యారు చేసుకునేలా దేశాన్ని తీర్చిదిద్దాల‌న్న‌ది ప్ర‌ధాని మోడీ సంక‌ల్పం. ఇందుకోసం మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌న్నీ చేప‌డుతున్నారు. సెల్‌ఫోన్లు, చిప్‌సెట్ల త‌యారీ వంటి యూనిట్ల‌ను దేశంలోనే ఏర్పాట‌వుతున్నాయి.
స్మార్ట్‌ఇండియా హ్యాకథాన్‌-2017 డిజిటల్‌ ఇండియాలో భాగంగా ‘స్మార్ట్‌ఇండియా హ్యాకథాన్‌-2017’ అనే భారీ ప్రోగ్రాంను శ‌నివారం సెంట్ర‌ల్ హ్యూమ‌న్ రిసోర్స్ మినిస్ట్రీ ప్రారంభించింది. ఇన్నోవేష‌న్స్ ప్రోత్స‌హించ‌డ‌మే టార్గెట్‌గా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని 26చోట్ల 10 వేల మంది ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్ పాల్గొన్నారు. వీరికి పీఎం మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ప్ర‌స్తుతం స‌మాజం ఎదుదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలనీ, ఇన్నోవేటివ్ సొల్యూష‌న్స్‌తో ముందుకు రావాల‌ని యూత్‌ను ఆయ‌న కోరారు.
స్మార్ట్ ఇండియా, స్మార్ట్ సిటీస్‌, క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్స్.. ఇలా గ‌వ‌ర్న‌మెంట్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌న్నింటిలోనూ టెక్నాల‌జీతోనే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. దేశంలోని యూత్‌కు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని, దీన్ని వినియోగించుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ఇన్నోవేష‌న్స్ చేయాల‌ని ఆకాంక్షించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) , 3డీ టెక్నాల‌జీల‌తో ప్ర‌పంచ రూపురేఖ‌లే మారిపోతాయ‌న్నారు. ఇది ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ యుగమని వ‌ర్ణించారు. టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్స్ స‌మాజంలో ఎన్నో మార్పుల‌ను తీసుకొస్తాయ‌ని చెప్పారు. అయితే ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నా క్వాలిటీని మ‌రిచిపోతే ఆ ఆవిష్క‌ర‌ణ‌కు విలువ ఉండ‌ద‌న్నారు. క్వాలిటీ ప్రొడ‌క్ట్స్ ప్ర‌జ‌ల లైఫ్‌ను మారుస్తాయ‌ని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకథాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకథాన్‌గా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 26 చోట్ల నిర్వహిస్తున్నారు. భారత్ యూత్‌ప‌వ‌ర్ ఉన్న దేశ‌మ‌ని, టెక్నాల‌జీలో, ఇన్నోవేటివ్ థాట్స్‌లో వారి మేథ‌స్సు దేశానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మోడీ చెప్పారు. మనం టెక్నాల‌జీ యుగంలో ఉన్నామనీ, టెక్నాల‌జీని మ‌రిం త ఇన్నోవేటివ్‌గా వినియోగించుకునేలా యూత్ ఆలోచించాల‌ని కోరారు. ప్రభుత్వ‌మే అన్ని సమస్యలను సాల్వ్ చేస్తుంద‌ని భ్ర‌మ‌ప‌డ‌కుండా.. అంద‌రూ క‌లిసి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

జన రంజకమైన వార్తలు