• తాజా వార్తలు
  •  

నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్సఫర్ మరింత వేగంగా..

ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ సంగతి తెలిసినవారంతా కాస్త రుసుములు ఎక్కువైనా కూడా ఐఎంపీఎస్ విధానంలో నగదు బదిలీకే మొగ్గు చూపుతారు. నేషనల్ ఎలక్ర్టానిక్ ఫండ్ ట్రాన్సఫర్(ఎన్ ఈఎఫ్టీ-నెఫ్ట్) కంటే ఇది వేగవంతంగా నగదు బదిలీ చేస్తుంది కాబట్టి సత్వర బదిలీకి ఈ విధానం వాడుతారు. అయితే.. ఇకపై నెఫ్ట్ విధానంలోనూ వేగవంతంగా నగదు బదిలీ అయ్యేలా ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికవరకు గంటకు ఒకసారి క్లియర్ చేసే ఈ మెథడ్ లో ఇక నుంచి ప్రతి నిమిషానికి ఫండ్స్ క్లియరెన్సు చేసేలా మార్పులు చేశారు.
అరగంటలోనే..
ఇకపై నెఫ్ట్ ట్రాంజాక్షన్ కూడా 30 నిమిషాల్లోనే నగదు అవతలి వ్యక్తి ఖాతాలో పడేలా చేస్తుందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ విధానంలో ట్రాన్సఫర్ కు వీలుండేది. ఆ గడువులో ప్రతి గంటలకు క్లియరెన్సు ఉండేది. శనివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పనిచేసేది. ప్రస్తుతం ఈ వేళలు ఫీజులు మార్చకపోయినా క్లియరెన్సులో వేగం మార్చారు. ఇకపై అరగంటలో డబ్బు పడుతుంది. కొద్దిరోజుల్లో ఇది అమలు లోకి రానుంది.
త్వరలో అందుబాటులోకి..
బ్యాంకులు ఏటీఎంలపై దృష్టి తగ్గించడం... క్యాష్ కొరత.. డిజిటల్ ట్రాంజాక్షన్ల వైపు జనాలను మళ్లించడం వంటి చర్యల నేపథ్యంలోనే ఈ మార్పునూ తీసుకొస్తున్నారు. సెంట్రల్ బ్యాంకు విజన్ 2018 డాక్యుమెంటులో చేసిన ఈ ప్రతిపాదన ఆమోద ముద్ర వేసుకుని కార్యరూపం దాల్చుతోంది.

జన రంజకమైన వార్తలు