మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు సుమారుగా మూడు సంవత్సరాల క్రితం అంటే 2013 అ మధ్య కాలం లో భారతీయ ఫోన్ లకు మంచి రోజులు వచ్చినట్లే కనిపించింది. నోకియా అప్పుడే అవసాన దశలో ఉంది, సామ్ సంగ్ కూడా ఒడి దుడుకుల మధ్య ఉంది, మోటోరోలా అమ్మకానికి సిద్దం అయి పోయింది, బ్లాకు బెర్రీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది, LG మరియు సోనీ ల పరిస్థితి సందిగ్దం లో ఉన్నది. స్మార్ట్ ఫోన్ లలో హై ఎండ్ అంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్ ల సామ్రాజ్యాన్ని మాత్రం ఇవే శాసిస్తున్నాయి, కానీ రూ 10,000/- కంటే తక్కువ ధర లో స్మార్ట్ ఫోన్ లు కావాలంటే మాత్రం భారతీయ బ్రాండ్ లే దిక్కుగా కనిపించాయి. మైక్రో మాక్స్, లావా, ఇంటెక్స్, కార్బన్ లాంటి భారతీయ బ్రాండ్ ల స్మార్ట్ ఫోన్ లకు ఇది ఒక వరం గా మారింది. అవి అప్పుడే ఫీచర్ ఫోన్ ల మార్కెట్ నుండి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోనికి అడుగు పెడుతున్నాయి. వెంటనే తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోనికి దించాయి. 2014 లో మోటో జి మరియు కొన్ని చైనీస్ కంపెనీ లు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోనికి అడుగు పెట్టిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కేవలం భారతీయ బ్రాండ్ లే కాక మార్కెట్ లో ఉన్న అన్ని బ్రాండ్ లూ అతి తక్కువ ధరలకే హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లను అందించడం మొదలు పెట్టాయి. ఇలా చైనా కంపెనీ ల దాడినుండి తట్టుకుని కొన్ని ఇండియన్ కంపెనీ లు నిలబడ్డాయి మరికొన్ని అడ్రస్ లేకుండా పోయాయి. భారతీయ స్మార్ట్ ఫోన్ లు అంటే తక్కువ ధరకు లభించేవి అనేది ఒక బ్రాండ్ గా నిలబడింది. ఒక వేళ ఏదైనా భారతీయ కంపెనీ ఎక్కువ ధరలో మంచి ఫోన్ ను లాంచ్ చేసినా ఇది ఇండియా కంపెనీ యే కదా! అని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్నీ సేఫ్ జోన్ లో ఉండే విధంగా తక్కువ ధర లోనే స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నాయి. అయితే మూడు ఫోన్ లు మాత్రం ఏ మాత్రం రాజీ పడకుండా ఆ కంఫర్ట్ జోన్ లో నుండి బయటకు వచ్చి ఫోన్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ 70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ ఫోన్ లను మా పాఠకుల ముందుకు తీసుకు రావాలని భావించాము. ఇవి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను పునర్ నిర్వచిస్తాయని కానీ, అమ్మకాలలో కొత్త రికార్డు లను సృష్టిస్తాయని కానీ మేము చెప్పడం లేదు. కానీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ల పట్ల నేటి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న దృక్పథాన్ని మాత్రం మార్చగలవని మేము గట్టిగా చెప్పగలము. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటిని ఒకసారి చూద్దాం. 1. క్రియో మార్క్ 1, (ది ఇన్నోవేటర్) భారతీయ ఫోన్ లన్నిటిలో అత్యంత ఇన్నోవేటివ్ ఫోన్ ఏది అని చెప్పాల్సి వస్తే అది ఇదే. బెంగుళూరు కి చెందిన క్రియో సంస్థ ఈ మార్క్ 1 అనే స్మర్ ఫోన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని వివరాలు చూద్దాం ... పేరు మార్క్ 1 కంపెనీ క్రియో సాఫ్ట్ వేర్ ఫ్యూయల్ OS ఆండ్రాయిడ్ డిస్ప్లే 5.5 అంగుళాల HD RAM 3 GB ROM 32 GB కెమెరా 21.0 మెగా పిక్సెల్ ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో X 10 ధర రూ 19,999/- ( కొంత కాలం పాటు రూ 13,999/- లకే లభిస్తుంది) ఇతర ప్రత్యేకతలు ఇది ముందు వెనుక ఆకర్షణీయమైన గ్లాస్ తో లభిస్తుంది. ఇది ఇన్ బిల్ట్ అన్సరింగ్ మెషిన్ ను, సెర్చ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది. ఒక వేళ ఫోన్ పోయినట్లయితే అది దొంగిలించిన వ్యక్తి దానిని రీ సెట్ చేసినా సరే మీకు వెంటనే తెలిసి పోతుంది. ప్రతీ నెల వన్ టైం పాస్ వర్డ్ ద్వారా ఫోన్ కు కొత్త కొత్త ఫీచర్ లను ఇది అందిస్తుంది. కెమెరా మరియు బాటరీ లు ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటాయి. ఇది మిగతా ఫోన్ లతో పోల్చి చూసినపుడు కొంచెం ధర అయినప్పటికీ మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ లకు భిన్నంగా నిలబడిన భారతీయ బ్రాండ్ అని గర్వంగా చెప్పగలము. 2. స్మార్ట్ రాన్ టి . ఫోన్ : ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడం ద్వారా తన కత్తి కి రెండు వైపులా పదును ఉందని ఈ కంపెనీ చాటి చెప్పింది. అవును హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ రాన్ కంపెనీ సచిన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా కలిగి ఉండడం ద్వారానూ మరియు మంచి స్మార్ట్ ఫోన్ లను అందించడం లోనూ తనకు తానె సాటి అని నిరూపించుకుంటుంది. తన లేటెస్ట్ ఉత్పాదన అయిన టి.ఫోన్ తో అది మరొక సారి వార్తల్లో నిలిచింది. పేరు టి.ఫోన్ కంపెనీ స్మార్ట్ రాన్ డిస్ ప్లే 5.5 ఇంచ్ ఫుల్ HD AMOLED ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్ RAM 4 జిబి ROM 64 GB కెమెరా 13 మెగా పిక్సెల్ , 4.0 మెగా పిక్సెల్ ఫ్రంట్ సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్ మార్ష్ మాలో బాటరీ 3000 mAh ధర రూ 22,999/-
3. YU YUNICORN పేరు యుని కార్న్ కంపెనీ YU సాఫ్ట్ వేర్ YU స్టెరాయిడ్ ( ఆండ్రాయిడ్ YU ) డిస్ ప్లే 5.5 HD RAM 4 GB ROM 32 GB బాటరీ 4000mAh ప్రాసెసర్ మీడియా టెక్ P 10 ప్రాసెసర్ కెమెరా 13 మెగా పిక్సెల్ ధర రూ 13,999/- ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని మరొక ప్రత్యేకత |