• తాజా వార్తలు
  •  

‘ల‌క్కీ’గా.. కోటీశ్వ‌రుడ‌య్యాడు..

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. 1,590 రూపాయ‌ల మొత్తానికి రూపే డెబిట్ కార్డుతో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ చేసిన ఓ వ్య‌క్తి ఏకంగా కోటి రూపాయ‌ల ప్రైజ్‌మ‌నీ గెలుచుకున్నారు. దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటోంది. రూపే కార్డులు, భీమ్‌/ యూపీఐ/ యూఎస్‌ఎస్‌డీ/ ఆధార్ బేస్డ్ సిస్ట‌మ్స్ ద్వారా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేసే క‌స్ల‌మ‌ర్లను ప్రోత్స‌హించేందుకు ‘లక్కీ గ్రాహక్‌ యోజన’, వాటిని యాక్సెప్ట్ చేసే వ్యాపారుల‌కు ‘డిజిధన్‌ వ్యాపార్‌ యోజన’ అనే రెండు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌తో జ‌రిగిన చెల్లింపుల నుంచి ఒక్కో విభాగంలో ముగ్గురు లెక్క‌న ఆరుగురు విజేత‌ల‌ను రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గురువారం లాట‌రీ ద్వారా సెలెక్ట్ చేశారు. డిజిటల్‌ లావాదేవీలు చేసిన వినియోగదారుల్లో ముగ్గుకి విజేతల్ని (రూ.కోటి, రూ.50 లక్షలు, రూ.25 లక్షలు), వ్యాపారుల‌ను (రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.12 లక్షలు) కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేశారు.
సెంట్ర‌ల్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్‌కు ల‌క్కీ ఛాన్స్ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఒక వినియోగదారుడు రూ.1590 లావాదేవీని పూర్తి చేసి, రూ.కోటి భారీ బహుమతి దక్కించుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క‌స్ట‌మ‌ర్‌ రూ.50 లక్షలను, మూడో ప్రైజ్‌గా రూ.25 లక్షలను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అకౌంట్ హోల్డ‌ర్ పొందారు. వీరు ముగ్గురూ రూపే డెబిట్‌ కార్డుల్నే వినియోగించారు. వారి ట్రాన్సాక్ష‌న్ల నెంబ‌ర్లు మాత్రమే లాటరీకి లెక్క‌లోకి తీసుకోవ‌డంతో విన్న‌ర్స్ పేర్లేమిటో ప్ర‌స్తుతానికి తెలియ‌లేదు కార్డు వివ‌రాల‌తో విజేతల్ని గుర్తిస్తారు. ఈ నెల 14న నాగ‌పూర్‌లో ప్రైమ్‌మినిస్ట‌ర్ మోడీ విజేత‌ల‌కు ఈ న‌గదు బ‌హుమ‌తులు అంద‌జేస్తారు.

జన రంజకమైన వార్తలు