• తాజా వార్తలు
  •  

ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

ఆధార్‌... మ‌న‌కు నిత్య జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంగా క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డే డాక్యుమెంట్. ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఆధార్‌ను దాదాపు అన్ని రంగాల్లో త‌ప్ప‌ని స‌రి చేసిందో దీని విలువ పెరిగిపోయింది.  ఆధార్ లేకుండా ఏ ప‌నులు అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బ్యాంకు అకౌంట్లు, పాన్‌కార్డులు, ఇన్‌కంటాక్స్ ఇలా ఏదైనా ఆధార్‌తో ముడిప‌డి ఉన్న‌వే. అయితే అంతా బాగానే ఉన్నా.. మ‌న డేటా ఇలా బ‌హిర్గ‌తం కావ‌డం ఎంత వ‌ర‌కు సేఫ్‌! మ‌న ఆధార్ కార్డులు తీసుకునే జియో వాళ్లు సిమ్‌లు ఇస్తున్నారు. ఆధార్ మీద ఒక‌టికి మించి సిమ్‌లు ఇచ్చేశారు. అయితే ఇటీవ‌లే జియో డేటా ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసింది. అంటే అంతా పెద్ద కంపెనీ ద‌గ్గ‌ర ఉన్నడేటాకే ర‌క్ష‌ణ లేదు. మ‌రి చిన్న చిన్న సంస్థ‌ల ప‌రిస్థితి ఏంటే.. ఈ విష‌యంపైనే అవిశ్రాంతంగా పోరాడుతున్నారు న్యాయ‌వాది శ్యామ్ దివాన్‌.

ఆధార్ ఎందుకు త‌ప్ప‌నిస‌రి?
ఒక‌ప్పుడు ఆధార్ కేవ‌లం ఒక యునిక్ గుర్తింపు మాత్ర‌మే. కానీ ఇపుడు మోదీ ప్ర‌భుత్వం దాన్ని ఒక త‌ప్ప‌నిస‌రి డాక్యుమెంట్‌గా చేసేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ ఆధార్ త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. మ‌రి ఆధార్‌ను ఎందుకు త‌ప్ప‌నిస‌రి చేయాల్సి వ‌చ్చింది.  పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్, గ్యాస్‌, ఇన్‌కంటాక్స్ ఇలా అన్నిటితో ఎందుకు ఆధార్‌ను ముడిపెడుతున్నారు. ఆధార్ అనుసంధానం చేయ‌డం ఎందుకు త‌ప్ప‌నిస‌రి చేశారు.. ఈ ప్ర‌శ్న‌లనే అడుగుతూ ప్ర‌జ‌ల త‌ర‌ఫున సుప్రీం కోర్టులో పోరాడుతున్నారు శ్యామ్ దివాన్‌. ఆధార్ ప్ర‌జ‌ల‌కు ఒక ఆయుధంగా మారాలి తప్ప‌..వారికి సంబంధించిన విలువైన స‌మాచారాన్ని రాబ‌ట్టి బ‌య‌ట‌పెట్టేదిగా ఉండ‌కూడ‌ద‌నేది ఆయ‌న వాదన‌. ప్ర‌తి అవ‌స‌రానికి ఆధార్ మీద డిపెండ్ కావ‌డం స‌రి కాద‌ని.. సిమ్ కార్డులు ఇవ్వ‌డానికి ఆధార్‌కు ఏంటి సంబంధం అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. వినియోగ‌దారుల‌కు సంబంధించిన విలువైన డేటా మిస్ యూజ్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌నేది ఆయన మాట‌. పాన్ కార్డు రావాలంటే ఆధార్ ఉండాల‌న‌డం కూడా స‌రైన ప‌ద్ధ‌తి కాద‌నేది ఆయన ఆర్గ్యుమెంట్‌.

ఇదేనా రాజ్యాధికారం..
ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డానికి, వారి అవ‌స‌రాలు తీర్చి.. మంచి పాల‌న అందించ‌డానికి ఉన్న‌దే ప్ర‌భుత్వం.. కానీ ఆధార్ అనుసంధానం పేరిట ప్ర‌స్తుతం ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని.. వారిని ప‌దే ప‌దే ప‌రుగులు పెట్టిస్తున్నార‌నేది దివాన్ ఆరోప‌ణ‌.  అధికారం ఉన్నంత మాత్ర‌న ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని ఆయ‌న వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఆధార్ అనుసంధానం, ప్రైవ‌సీపై ఒక ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం న‌డుస్తోంది. దీన్ని శ్యామ్ దివానే డీల్ చేస్తున్నారు. ఆధార్ గురించి మాత్ర‌మే కాదు గ‌తంలో ఆయ‌న ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల దుర్వినియోగంపై ప్ర‌భుత్వంతో కోర్టులో పోరాడారు. 

జన రంజకమైన వార్తలు