• తాజా వార్తలు
  •  

పేద‌పిల్ల ప్రాణం తీసిన ఆధార్ లింకేజి

ఆధార్ కార్డ్ లేక‌పోతే ఇండియాలో బ‌త‌క‌లేమో అన్న‌ట్లు త‌యార‌వుతోంది ప‌రిస్థితి. స‌మాచారం కోసం వాడుకునే సెల్‌ఫోన్ నుంచి  పేదోడికి కూడు పెట్టే రేష‌న్ కార్డ్ వ‌ర‌కు అన్నింటిలోనూ ఆధార్‌కు అల‌విమాలిన ప్రాధాన్యం ఇస్తోంది ప్ర‌భుత్వం.  సిమ్ కార్డ్‌ను ఆధార్‌తో లింకేజి చేయాల‌ని బెద‌ర‌గొట్టి ఇటీవ‌లే బెంగ‌ళూరులో ఓ వ్య‌క్తి అకౌంట్‌లో నుంచి హ్యాక‌ర్లు ల‌క్షా ముప్పైవేలు కొట్టేశారు. పిల్ల‌ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్మును కూడా వాళ్లు దోచేశారు. ఇప్పుడు ఆధార్ కార్డ్‌ను రేష‌న్ కార్డుకు లింక్ చేయ‌ని పాపానికి జార్ఖండ రాష్ట్రంలో ఓ ప‌ద‌కొండేళ్ల అమ్మాయి ఆక‌లిచావు చ‌చ్చిపోయింది. 
ఏం జ‌రిగింది? 
దేశంలో ప్ర‌తి రాష్ట్రంలోనూ రేష‌న్ షాపుల ద్వారా పేద‌ల‌కు బియ్యం, పంచ‌దార‌, గోధుమ‌లు వంటి స‌ర‌కులు స‌బ్సిడీ మీద ఇస్తారు.  ఈ స‌బ్సిడీని స్టేట్‌, సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్లు క‌లిసి భ‌రిస్తాయి.  రేష‌న్ స‌ర‌కుల‌ను  పేద‌వాళ్ల‌కు ఇవ్వ‌కుండా డీల‌ర్లు కొట్టేయ‌కుండా ప్ర‌తి కార్డు వివ‌రాల‌ను ఆధార్‌తో లింక్ చేయాల‌ని గ‌వ‌ర్నమెంట్ ఆర్డ‌ర్స్ ఇచ్చింది. ఆధార్‌తో లింక్ చేయ‌క‌పోతే వాళ్ల‌కు స‌ర‌కులివ్వ‌రు. కానీ జార్ఖండ్‌లో ఓ పేద కుటుంబం త‌మ కుటుంబం ఆధార్ కార్డును రేష‌న్ కార్డుకు లింక్ చేయ‌లేదు. దీంతో వాళ్ల‌కు స‌ర‌కులివ్వ‌లేద‌ని రైట్ టు ఫుడ్ అనే స్వ‌చ్ఛంద సంస్థ కార్య‌క‌ర్త‌లు చెప్పారు. నిజంగా ఆ కుటుంబాన్ని  చూస్తే అస‌లు వాళ్ల‌కు ఆధార్ కార్డ్ ఉందో లేదో కూడా తెలియ‌నంత పేద‌రికంతో ఉన్నారు. ఆధార్ తో లింక్ చేయ‌లేద‌ని స‌ర‌కులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ కుటుంబంలోని తారామ‌ణి సాహు అనే ప‌ద‌కొండేళ్ల  అమ్మాయి ఆక‌లితో చ‌నిపోయింది. ఒక‌వైపు ఉన్న‌వారికి యాప్‌లో ఆర్డ‌ర్ చేస్తే కోరుకున్న ఫుడ్ క్ష‌ణాల్లో క‌ళ్ల ముందు ఉండే స్థాయికి టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయిపోయింది. మ‌రోవైపు అదే టెక్నాల‌జీని వాడుకోలేని నిర‌క్ష‌రాస్య‌త‌, పేద‌రికం ఓ పేద బిడ్డ ఉసురు తీసేశాయి.  

జన రంజకమైన వార్తలు