• తాజా వార్తలు
  •  

2021 నాటికి ఇంగ్లీష్ కంటే హిందీలో ఇంటర్నెట్ వాడేవారే ఎక్కువ..


ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరణ యమ స్పీడుగా ఉంది. మారుమూల ప్రాంతాలకూ శరవేగంగా పెనెట్రేట్ అవుతోంది. 2021 నాటికి ఇండియాలో ఏకంగా 53.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగించబోతున్నారని ప్రముఖ అధ్యయన సంస్థ కేపీఎంజీ, గూగుల్ లు సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలింది. గొప్ప విషయం ఏంటంటే.... ఆ 53.6 కోట్ల మందిలో ఇంగ్లీష్ భాషలో నెట్ వినియోగించేవారు 19.9 కోట్ల మంది ఉంటే... హిందీ భాషలో నెట్ వినియోగించేవారి సంఖ్య 20.1 కోట్లకు చేరబోతుందట.
మూడో వంతు వారే..
ఇంగ్లీష్ కంటే కూడా ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ వాడకమనేది ఇండియాలో పెరుగుతోంది. ఈ ట్రెండులో భాగంగానే ఇంగ్లీష్ కంటే హిందీ డామినేట్ చేయబోతుందని సర్వే తేల్చింది. మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగులో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య మొత్తం యూజర్లలో మూడో వంతు ఉంటుంది.

ప్రతి సేవా మాతృభాషలో
ఈ మార్పునకు ప్రధాన కారణం.. ఇండియాలో దాదాపు అన్ని ఇంటర్నెట్ సేవలనూ రీజనల్ లాంగ్వేజెస్ లో అందిస్తుండడమే. గవర్నమెంటు వెబ్ సైట్లు, అందులో సేవలు... అలాగే తాజాగా పేమెంట్ సర్వీసెస్ కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో అందుబాటులోకి వచ్చేశాయి. చివరకు ఈకామర్స్ వెబ్ సైట్లు కూడా ప్రాంతీయ భాషల్లో సేవలందిస్తున్నాయి. కొత్తగా వస్తున్న మొబైల్స్ అన్ని ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ ఆప్షన్లను ఇస్తున్నాయి. ఇవి కాకుండా రీజనల్ లాంగ్వేజెస్ లో వార్తా వెబ్ సైట్లు, యాప్స్ పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఇండియాలో ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ వాడకాన్ని పెంచుతున్నాయి.

జన రంజకమైన వార్తలు