• తాజా వార్తలు

నెటిజ‌న్స్‌.. సివిక్‌సెన్స్‌

దేశంలో సిటిజ‌న్ల‌కు సామాజిక స్పృహ త‌గ్గిపోతోందని చాలా మంది ఆవేద‌న వ్యక్తం చేస్తుంటారు. రాజ‌కీయ నేతలు, పెద్ద పెద్ద ఆఫీస‌ర్లు కూడా ఇదే మాట అంటారు. కానీ మ‌న‌వాళ్ల‌కు సివిక్ సెన్స్ ఎక్క‌వేన‌ని నిరూపించిన సంఘ‌ట‌న ఇది. టెక్నాల‌జీ వాడ‌కంద్వారా త‌మ సామాజిక స్పృహ‌ను వేల మంది నిరూపించుకున్నారు. ఇండియాకు అతి పెద్ద ప్రాబ్లం బ్లాక్‌మ‌నీయేన‌ని, దీన్ని కంట్రోల్ చేయ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త ఏడాది నవంబ‌ర్ 8న స‌డెన్ గా 500, 1000 రూపాయ‌ల నోట్లు ర‌ద్దు చేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించి బ్లాక్‌మనీ పోగేసిన‌వాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు. ఇదే స‌మ‌యంలో బ్లాక్‌మ‌నీ గురించి స‌మాచారం ఇమ్మ‌ని అడిగితే చాలా మంది స్పందించారు. దీనిపై సెంట్ర‌ల్ ఫైనాన్షియ‌ల్ డిపార్ట్‌మెంట్ ఒక ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి బ్లాక్ మనీ గురించి ఇన్ఫ‌ర్మేష‌న్ ఉంటే మెయిల్ చేయ‌మ‌ని కోరింది.
38 వేల మెయిల్స్‌ దీనికి చాలా మంది పౌరులు స్పందించారు. ఏకంగా బ్లాక్ మ‌నీ గురించి ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తూ 38 వేల ఈ మెయిల్స్ .. ఈ మెయిల్ ఐడీకి అందాయ‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) ప్ర‌క‌టించింది. అయితే వీటిలో 6,050 మెయిల్స్‌లోని స‌మాచారాన్ని మాత్ర‌మే ఎంక్వ‌యిరీ కోసం ఇన్‌కంటాక్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌కు పంపించారు. మిగిలిన‌వి స‌రైన ఇన్ఫ‌ర్మేష‌న్ లేనివి. అయితే ఈ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే మ‌న వాళ్ల‌కు సివిక్‌సెన్స్ త‌క్కువేమీ లేద‌ని నిరూప‌ణ‌యిందంటున్నారు ఐటీ అధికారులు.

జన రంజకమైన వార్తలు