లండన్ బేస్డ్ స్టార్టప్ వోలాంట్ సౌండ్ అద్భుతమైన హెడ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3 ఇన్ 1 హెడ్ ఫోన్ ను పరిచయం చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వైర్డ్ హెడ్ సెట్ లా, వైర్ లెస్ హెడ్ సెట్ లా, ఇయర్ ఫోన్లా కూడా పనిచేస్తుంది. అంతేకాదు, క్షణాల్లో ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.
అదిరిపోయే ఫీచర్
ఇందులోని పాసివ్ నోయిస్ క్యాన్సలింగ్ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు... అద్భుతమైన సామర్థ్యం ఉన్న బిల్ట్ ఇన్ బ్లూటూత్ దీని ప్రత్యేకత. 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్ల వల్ల ఇందులో సౌండ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది.
3.5 ఆడియో జాక్ తో
ఆడియో ప్లే చేసే డివైస్ కు దీన్ని 3.5 ఎంఎం జాక్ తో కనెక్ట్ చేయాలి. దీని ధర రూ.16 వేలు వరకు ఉంది.