ఫిట్‌బిట్ లాంటి వేరబుల్ యాక్టివిటీ ట్రాకర్స్ టీనేజర్లను ఎక్సర్సైజ్ చేసేలా ఎంకరేజ్ చేయడంలో మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తున్నాయట. లండన్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీ, యూకేలోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ కలిసి ఓ స్టడీ చేసి ఈ విషయాన్ని తేల్చాయి. American Journal of Health Educationలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
13 నుంచి 14 సంవత్సరాల వయసుగల పిల్లల్లో ఫిట్‌బిట్‌కు ధరింపజేసి వారిపై 8 వారాలు స్టడీ చేశారు. ఫిట్‌బిట్ లాంటి ట్రాకర్లు ఉన్నప్పుడు పిల్లలు వాటిలో తామెంత ఎక్సర్సైజ్ చేశామో వంటి వివరాలన్నీ చూసి మరింత ఉత్సాహంగా ఎక్సర్సైజ్ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం పిల్లలు డీమోటివేట్ అయిపోయి మొత్తానికి ఎక్సర్సైజ్ అంటేనే నెగిటివ్ ధోరణికి వచ్చేశారని గుర్తించారు.
ఫన్ లేదన్న పిల్లలు
ఈ సర్వే చేయడానికి ముందు, తర్వాత పిల్లలతో మాట్లాడారు. ఫిట్ బిట్ పిల్లల్లో యాక్టివిటీపై ఆసక్తి పెంచడానికి కమ్యూనిటీని కూడా రన్ చేస్తోంది. ఇక్కడ స్టడీ చేసిన పిల్లలకు ఫిట్‌బిట్ రిస్ట్ బాండ్ పెట్టి యాప్ తో కనెక్ట్ చేశారు. అయితే చివరికి పార్టిసిపెంట్లు కాన్ఫిడెన్స్ తగ్గినట్లు ఫీలవడం, లేదా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మిగిలినవాళ్లతో పోటీపడలేమన్న ఆత్మన్యూనత వంటివి ఏర్పడినట్లు .. దానివల్ల వారికి ఫిజికల్ యాక్టివిటీపైనే ఆసక్తి పోయిందని గుర్తించారు. ఫిట్‌బిట్ యాప్‌లో పార్టిసిపెంట్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అయితే మొదటి నెల ఉత్సాహంగా కాంపిటీషన్ కోసం ఫిజికల్ యాక్టివిటీ చేసినవారికి కూడా తర్వాత నెలలో ఆసక్తి తగ్గిపోయింది. చాలామంది ఈ యాక్టివిటీలో ఫన్ లేదని చెప్పారు. మొత్తంగా చూస్తే ఫిట్‌బిట్ తరహా ఫిట్నెస్ ట్రాకర్స్.. గేమ్స్, స్పోర్ట్స్‌లో మాదిరిగా మాదిరిగా పిల్లల్లో యాక్టివిటీని పెంచలేదని, పైగా ఫిజికల్ యాక్టివిటీ అంటే బోర్ ఫీలవుతున్నారని సర్వే తేల్చింది.