• తాజా వార్తలు

ఈ నాలుగు అల‌వాట్లు కంట్రోల్ చేయ‌గ‌లిగితే స్మార్ట్‌ఫోన్ అడిక్ష‌న్ వ‌దిలిన‌ట్లే

ఆఫీస్‌కెళ్లినా, కాలేజ్ క్యాంప‌స్‌లో ఉన్నా స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క‌సారి త‌ల‌దూర్చారంటే గంట‌ల కొద్దీ స‌మయం అందులోనే మునిగిపోతున్నారా?  ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లాంటి వాటితోపాటు ఏ సైట్‌లోకి వెళ్లినా గంట‌ల స‌మ‌యం అలా స్క్రోల్ చేస్తూ చూస్తూనే ఉండిపోతున్నారా? ఇలా జ‌రిగితే మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవుతున్న‌ట్లే. స్మార్ట్‌ఫోన్ అడిక్ష‌న్‌కు లోనుకాకుండా ఉండాలంటే నాలుగు అంశాల గురించి ప్ర‌ధానంగా తెలుసుకోవాలి. అవేంటో తెలిస్తే మీ స్మార్ట్‌ఫోన్ అడిక్ష‌న్ వ‌దిలినట్లే. 

 1.  ఎండ్‌లెస్ స్క్రోలింగ్  
ఫేస్‌బుక్ లో ఒక్క‌సారి ఎంట‌రైతే మీరు యాప్ లో నుంచి బ‌య‌టికి రావాలే త‌ప్ప దానికి ఏదైనా ఎండ్ ఉందా? ఏదో సినిమా వెబ్‌సైట్ లేదా న్యూస్ సైట్‌.. ఇలా ఏదైనా స‌రే మీరు స్క్రోల్ చేస్తుంటే ఒక‌దాని నుంచి మ‌రో పోస్ట్ లేదా ఆర్టిక‌ల్ అలా అంతులేకుండా వ‌స్తుంటాయి. యూజ‌ర్‌ను త‌మ యాప్ లేదా సైట్ వ‌ద‌ల‌కుండా చేసే ఈ ఫీచ‌రే ఎండ్‌లెస్ స్క్రోలింగ్‌. ఇప్పుడు అన్ని యాప్‌లు, సైట్ల‌లోనూ ఇది కామ‌న్.  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈకామ‌ర్స్‌సైట్‌లో కూడా ఇదే జ‌రుగుతోంది.  కాబ‌ట్టి ఇలా మ‌నం స్క్రోల్ చేస్తూనే ఉండి గంట‌ల కొద్దీ టైం వేస్ట్ చేసుకోవ‌డంతోపాటు అడిక్ట్ అయిపోతుంటాం. 

2. పుష్ నోటిఫికేష‌న్స్  
యాప్స్‌, సైట్ల నుంచి వ‌చ్చే పుష్ నోటిఫికేష‌న్స్‌. ఫ‌లానా సైట్‌లో ఫ‌లానా విష‌యం ఉంది చ‌దవండి.. అమెజాన్‌లో ఈ ఆఫ‌ర్ ఉంది కొనుక్కోండి.. ఫేస్‌బుక్‌లో Updates from Friends ఇవ‌న్నీపుష్ నోటిఫికేష‌న్లే. మ‌నం యాప్స్‌, సైట్ల‌లోకి వెళ్ల‌క‌పోయినా మ‌న‌ల్ని ప‌ట్టుబట్టి అందులోకి లాగేలా మ‌న‌కు ఇంట్ర‌స్ట్ క‌లిగించ‌డం పుష్ నోటిఫికేష‌న్స్ ప‌ని. ఆండ్రాయిడ్‌లో దీనికి కొన్ని ఫిల్ట‌ర్స్ వ‌చ్చినా ఐవోఎస్ లో మాత్రం ఇంకా అంత డెవ‌ల‌ప్ కాలేదు.  

3. ఆల్గ‌రిథ‌మ్ డ్రివైన్ ఫీడ్స్ 
ఓ కంటెంట్ ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ యాప్స్‌లో మీకు ఒక‌సారి క‌నిపించ‌గానే మీరు దాన్ని ఓపెన్ చేసి చ‌దివితే అలాంటిదే మ‌రో పోస్ట్ మీకు దాని వెన‌కే వ‌స్తుంది. ఇలా మీరు చ‌ద‌వ‌గానే త‌ర్వాత నుంచి మీకు అలాంటి పోస్ట్‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తుంటాయి. వెబ్‌సైట్ల‌లో కూడా అంతే. మీరు క్రికెట్ గురించో, సినిమా గురించో సెర్చ్ చేసి ఉంటే త‌ర్వాత మీకు అలాంటి పోస్ట్‌లు త‌ర‌చూ వ‌స్తుంటాయి. ఇదంతా ఆల్గ‌రిథ‌మ్ డ్రివెన్ ఫీడ్స్ ప్ర‌భావం. యాప్స్‌, సైట్స్ మీకు ఏది ఇంట్ర‌స్టో, మీరు ఏది ఎక్కువ‌గా చూస్తారో వాటికి సంబంధించినవే మీకు అందుబాటులో ఉంచుతాయి. కాబట్టి మీరు ఆ యాప్ లేదా సైట్‌లో ఎక్కువ సేపు ఉంటారు.  
4. ఆటో ప్లే, ఆటో డౌన్‌లోడ్ 
చాలా సైట్స్‌, సోష‌ల్ మీడియా యాప్స్‌లో వీడియోలు ఆటోమేటిగ్గా ప్లే అవ‌డం, డౌన్లోడ్ అవ‌డం జ‌రిగిపోతుంటాయి. ఆటో ప్లే, ఆటో డౌన్‌లోడ్ ఆప్ష‌న్స్‌ను మీరు డిసేబుల్ చేయ‌నంత‌వ‌ర‌కు మీకు ఇంట్ర‌స్ట్ ఉన్న వీడియోల‌ను చూపిస్తూనే ఉంటాయి. దీంతో మీరు వాటిని ఒక్కొక్క‌టి చూస్తూ గంట‌ల కొద్దీ గ‌డిపేస్తుంటారు. మూవీస్‌, క్రికెట్‌, సెక్స్ ఇలా ఏర‌క‌మైన వీడియో కంటెంట్ అయినా మిమ్మ‌ల్ని ఎక్కువ‌సేపు సైట్ లేదా యాప్ చూడ‌నివ్వ‌డ‌మే టార్గెట్‌గా ఈ ఆటో ప్లే, ఆటో డౌన్‌లోడ్ ప‌ని చేస్తుంటాయి.
ఇవ‌న్నీ మిమ్మ‌ల్ని ఎక్కువ‌సేపు యాప్ లేదా సైట్‌లో నిలిపి ఉండ‌చ‌మే టార్గెట్‌గా వ‌చ్చిన ఆప్ష‌న్స్‌. త‌ద్వారా వాటికి ఇన్‌క‌మ్ వ‌స్తుంది. కానీ ఈ నాలుగే మిమ్మ‌ల్ని స్మార్ట్‌ఫోన్‌కు ఎడిక్ట్ చేస్తాయి. బీకేర్‌ఫుల్?  

జన రంజకమైన వార్తలు