• తాజా వార్తలు

సెల్‌ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా? అయితే ఈ ఆర్టిక‌ల్ మీకోస‌మే..

మొబైల్ ఫోన్ లేకుండా క్ష‌ణం కూడా ఉండలేకపోతున్నారా? రాత్రి నిద్రపోతున్నామొబైల్ పక్కన ఉండాల్సిందేనా? అయితే మీకు ఒక భయంకరమైన వ్యాధి రావడం గ్యారంటీ అని హెచ్చరిస్తుంది CDPH. అంతలా భయపెడుతున్న ఆ వ్యాధి ఏంటో తెలుసుకోండి. సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారాక ఫోన్ చేతిలో లేకపోతే జ‌నానికి క్ష‌ణం కూడా తోచ‌డం లేదు. వ‌య‌సు, స్టేట‌స్‌, ఎడ్యుకేష‌న్‌, ప్రొఫెష‌న్‌తో సంబంధం లేదు.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ సెల్ ఫోన్ అత్యంత అవ‌స‌ర‌మైన వ‌స్తువు. అయితే దీంతో అంత గాఢ‌మైన ప్రేమ పెంచుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం అంటున్నారు శాస్త్రవేత్త‌లు.  మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్ర‌భావాల బారిన‌ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఎన్నో అధ్య‌య‌నాలు తేల్చిచెప్పాయి.  అంతేకాదు మొబైల్ దగ్గరగా పెట్టుకుని నిద్రపోతే క్యాన్సర్  వ‌చ్చేప్ర‌మాదం కూడా ఉంద‌ని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. 
కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (CDPH) మొబైల్ ఫోన్ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత రేడియేషన్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది. సెల్ ఫోన్ అతిగా వాడాకాన్ని నివారించాలని తెలిపింది.
శ‌రీరానికి దూరంగా ఉంచండి
సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం చేటు చేస్తుంద‌ని ప్రజల్లో ఇప్పటికీ అవగాహన రాలేదు. సెల్ ఫోన్ వల్ల కలిగే హాని గురించి పూర్తిగా తెలియదు. దీంతో ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పబ్లిక్ హెల్త్ ప్రొఫెష‌నల్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని CDPH డైరెక్టర్ డాక్టర్ కరెన్ స్మిత్ తెలిపారు. 2009లో శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కొన్ని హెచ్చరికలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. గతేడాది బర్కిలీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోయెల్ .. మొబైల్ ఫోన్‌ను అతిగా వాడితే క‌ణితులు(ట్యూమర్స్) వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.  సెల్ ఫోన్‌ను సాధ్యమైనంత వరకు మీ శరీరానికి దూరంగా ఉంచడం మంచిదన్నారు. ఫోన్ ప‌క్క‌న పెట్టుకుని నిద్ర‌పోతే భయంకరమైన వ్యాధులు వ‌స్తాయ‌ని  హెచ్చరించారు.
సీడీపీహెచ్ ఏం సిఫార్సు చేసింది?
* సాధ్య‌మైనంత వ‌ర‌కు ఫోన్ జేబులో పెట్టుకోకుండా ఉండ‌డానికి ప్ర‌య‌త్నించండి
 * చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఎక్కువ సమయం మాట్లాడొద్దు.
*  నిద్ర‌పోయేట‌ప్పుడు ఫోన్‌ను  శరీరానికి ద‌గ్గ‌ర‌లో పెట్టుకోవ‌ద్దు. సాధ్య‌మైనంత దూరంగా పెట్టండి.
* పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే రైళ్లు, బ‌స్సుల్లో వెళుతున్న‌ప్పుడు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఫోన్ వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది.  ఎందుకంటే ప్రయాణం చేస్తున్న‌ప్పుడు ఎక్కువ క‌ద‌లిక‌లుంటాయి. కాబ‌ట్టి సిగ్న‌ల్స్ కోసం ఫోన్ ఎక్కువ ఎనర్జీని రిలీజ్‌చేస్తుంది. ఇది మ‌న‌కు చాలా ప్ర‌మాద‌క‌రం.

జన రంజకమైన వార్తలు