• తాజా వార్తలు
  •  

విదేశీ ఫోన్లు మ‌న ద‌గ్గ‌ర మాన్యుఫాక్చ‌ర్ చేస్తే అది దేశ్ కా ఫోన్ అవుతుందా? 

దేశ్ కా స్మార్ట్‌ఫోన్‌, భార‌త్ స్మార్ట్‌ఫోన్‌.. ఈ మ‌ధ్య సెల్‌ఫోన్ ప్ర‌మోష‌న్‌లో ఈ మాట‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అంటే ఇవి ప్యూర్‌లీ ఇండియ‌న్ మేడ్ అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే ఇవాళ యాపిల్ వ‌ర‌కు అన్ని పెద్ద కంపెనీల‌కు ఇండియాలో అసెంబ్లింగ్ ప్లాంట్లున్నాయి. ఇండియాలో త‌యారు చేస్తున్నాయి కాబ‌ట్టి అవి  దేశ్ కా ఫోన్లు అయిపోతాయా?  ఛాన్సే లేదు. 
కాంపోనెంట్స్ చైనా నుంచే..
ఇండియాలోనే మ‌న‌కు కావ‌ల్సిన‌వ‌న్నీ త‌యారు చేసుకోవాలంటూ ప్ర‌ధాని మోడీ మేకిన్ ఇండియా ఇనీషియేష‌న్ తీసుకొచ్చారు. అంత‌కు ముందు నాలుగైదేళ్ల ముందు నుంచే కార్బ‌న్‌, లావా, మైక్రోమ్యాక్స్‌, సెల్‌కాన్ లాంటి ఇండియ‌న్ సెల్‌ఫోన్ కంపెనీలు మ‌న‌దేశంలోనే మొబైల్స్ త‌యారు చేస్తున్నాయి. అలాగ‌ని వాటిని కూడా పూర్తిగా ఇండియ‌న్ ఫోన్ల‌ని చెప్ప‌లేమంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. ఎందుకంటే ఈ కంపెనీలు త‌యారుచేసే చాలా మోడ‌ల్  ఫోన్ల‌లో వాడే కాంపోనెంట్స్‌లో చాలావ‌ర‌కు చైనాలో మాన్యుఫాక్చ‌ర్ అవుతాయి. వాటిని ఇంపోర్ట్ చేసుకుని అసెంబుల్ చేసి ఈ కంపెనీలు అమ్ముతుంటాయి. టెక్నాల‌జీ మ‌న‌ది కావచ్చు. అసెంబ్లింగ్ మ‌న‌ది కావ‌చ్చు. కానీ కాంపోనెంట్లు ఇత‌ర దేశాల నుంచి తెచ్చుకున్న‌ప్పుడు అది ట్రూలీ ఇండియ‌న్ ఫోన్ ఎలా అవుతుంద‌న్న‌ది ఎక్స్‌ప‌ర్ట్‌ల క్వ‌శ్చ‌న్‌. 
యాపిల్ కూడా ప్లాంట్ 
ఎల‌క్ట్రానిక్ రంగంలో ప్ర‌పంచ దిగ్గ‌జం యాపిల్ కూడా ఇండియాలో మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ పెట్టింది. అంటే ఇండియా మీద ప్రేమ ఎక్కువైంద‌ని కాదు. ఇండియాలో యాపిల్ ఫోన్ యూజ్ చేసేవాళ్లు పెరిగారు. కావ‌ల్సిన కాంపోనెంట్స్ తెప్పించుకుని ఇండియాలోనే అసెంబ్లింగ్ చేసి అమ్ముకుంటే షిప్పింగ్ ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఎలాగూ  ఇండియాలో కంపెనీలు పెడ‌తామంటే మా రాష్ట్రంలో పెట్టండంటే మా రాష్ట్రంలో పెట్టండ‌ని గ‌వ‌ర్న‌మెంట్‌లు  బోల్డ‌న్ని రాయితీలు ప్ర‌క‌టిస్తున్నాయి. అందుకే కంపెనీలు ఇక్క‌డ అసెంబ్లింగ్ ప్లాంట్లు పెడ‌తాయే త‌ప్ప మ‌న కోసం మ‌న దేశంలో ఫోన్ త‌యారుచేసేంత ప్రేమ వాటికి లేదు. 
నిజంగా అంత సీనుందా?
మైక్రోమాక్స్ భార‌త్ పేరుతో పూర్తి ఇండియన్ మేడ్ స్మార్ట్‌ఫోన్ త‌యారుచేశామ‌ని చెబుతోంది. కానీ దానివంక చూసేది ఎంత మంది?  షియోమీ ఫ్లాష్ సేల్స్‌కు ఎగ‌బ‌డిన‌ట్లు మ‌న ఇండియ‌న్స్ లావా, సెల్‌కాన్ ఫోన్లు కొంటారా?  ఛాన్సే లేదు.  ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌, ఇంట‌రెస్టింగ్ ఫీచ‌ర్స్‌, ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు ఇండియ‌న్ బ్రాండ్స్ డెవ‌ల‌ప్ కాక‌పోవ‌డం, మ‌న‌వాళ్లకు పొరుగింటి పుల్ల‌కూర రుచి కావ‌డం ఇందుకు కార‌ణాలు. అందుకే దేశ్ కా ఫోన్లు, ఇండియా కా  స్మార్ట్ ఫోన్లు రావ‌డం క‌ష్టం. వ‌చ్చినా స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మంటున్నారు మార్కెట్ నిపుణులు. 

జన రంజకమైన వార్తలు