• తాజా వార్తలు
  •  

టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్‌లోని లొసుగుల సంగ‌తేంటి? 

సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్ అనేది కొత్త స్టాండ‌ర్ట్‌.  సాధార‌ణంగా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ ఉంటే చాలు. కానీ హ్యాక‌ర్లు వీటిని గెస్ చేసి అకౌంట్‌ను యాక్సెస్ చేసేస్తున్నారు.  అందుకే సెక్యూరిటీలో కొత్త లేయ‌ర్‌ను యాడ్ చేస్తూ వచ్చిందే టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్‌. దీనిలో యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌తోపాటు మ‌రో లేయ‌ర్ ఉంటుంది. అంటే  ఓటీపీ గానీ, లేదంటే మీ డివైస్‌తో ఫిజిక‌ల్ కాంటాక్ట్‌గానీ  ఇలా ఏదో ఒక అద‌న‌పు సెక్యూరిటీ సెట‌ప్ ఉంటుంది. ఇది ఉంటేనే మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయ‌గ‌ల‌రు.  సెక్యూరిటీ ప‌రంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తున్నా ఈ టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్లోనూ లొసుగులున్నాయి. 

ఇవీ ప్రాబ్ల‌మ్స్ 
1. టూ ఫాక్ట‌ర్ అథెంటిక‌ష‌న్లో లాగిన్‌ ప్రాసెస్ లేట్ అవుతుంది. మీరు లాగిన్ అయ్యాక లాగిన్ కోడ్ కోసం వెయిట్ చేయాలి. లేదంటే లాగిన్ కోడ్ తెలుసుకోవ‌డం కోసం అథెంటికేట‌ర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. 
2. ప్ర‌తి టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్ సిస్టం ఒకేలా ఉండ‌దు.  మీరు ర‌క‌ర‌కాల యాప్‌లు వాడుతుంటే ఒక్కోదానిలో ఈ సిస్టం ఒక్కోలా ఉంటుంది.  ఇందుకోసం అథెంటికేట‌ర్ యాప్స్ కూడా ర‌క‌ర‌కాల‌వి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  ఇందుకోసం ఐఫోన్‌లో Google app, Blizzard Authenticator, Microsoft Authenticator,  Steam appలు వాడుతున్నారు . ఇది ఫోన్ మెమ‌రీ మీద భారం వేస్తుంది.
3. పేటీఎం, ఇండియ‌న్ బ్యాంకులు, ప్లే స్టేష‌న్ వంటివి  టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్‌గా ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా ఓటీపీ పంపిస్తాయి. కానీ దీనికి ఆన్‌లైన్ క‌నెక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. మీ ఫోన్‌లో డేటా లేక‌పోయినా మీరు డేటా ఆఫ్ చేసినా ఈ ఓటీపీ రాదు. కాబట్టి  నెట్‌వ‌ర్క్ ప్రాబ్లం ఉన్న ఏరియాల్లోనో లేదంటే మీ ఫోన్‌లో నెట్ బ్యాలన్స్ లేక‌పోయినా ఇది వ‌ర్క‌వుట్ కాదు.  టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్ చేస్తాయి. 
4. టూ ఫాక్టర్ అథెంటికేష‌న్ సెట్ చేసుకోవ‌డంలోనూ ఇబ్బందులున్నాయి. ఒక్కోసారి ఆ టూ ఫాక్ట‌ర్ అథెంటిఫికేష‌న్ ఫెయిల‌యితే ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయ‌లేం. 
క్లియ‌ర్ చేస్తే చాలా మంచి ఆప్ష‌న్ 
ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్లో త‌ర‌చుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌తి అకౌంట్‌కు టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్ వాడుతున్న‌వారు దీనికోసం బోల్డ‌న్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డం కొంత గంద‌ర‌గోళ‌మే. అయితే ఈ ప్రాబ్ల‌మ్స్ అన్నీ క్లియ‌ర్ చేస్తే టూ ఫాక్ట‌ర్ అథెంటికేష‌న్ సేఫ్‌, సెక్యూర్డ్ మాత్ర‌మే కాదు ఈజీ కూడా.  

జన రంజకమైన వార్తలు