• తాజా వార్తలు
  •  

ఈరోజుకీ స్మార్ట్‌ఫోన్ల‌పై ఉన్న కొన్ని పాపుల‌ర్ అపోహ‌లు

స్మార్ట్‌ఫోన్ వాడాలంటే చాలామందికి ఎన్నో సందేహాలు. అస‌లు ఈ ఫోన్ వాడ‌డం సుర‌క్షిత‌మేనా? ఇలాంటి ఫోన్లు వాడ‌డం వ‌ల్ల ఆర్థికంగా ఏమైనా న‌ష్టం ఉంటుందా? మ‌న స‌మాచారం అంద‌రికి తెలిసిపోతుందా? ఎలాంటి ఎన్నో సందేహాలు కొంత‌మందిని వెంటాడుతూ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ వాడ‌కం ఎన్నో రెట్లు పెరిగినా.. రోజుకో ఫోన్ మార్కెట్‌ను ప‌ల‌క‌రిస్తున్నా..స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ఇప్ప‌టికే ఎన్నో సందేహాలు. మ‌రి అలాంటి కొన్ని సందేహాలు, అపోహ‌లు ఏంటో చూద్దామా...

మంచి ఫెర్మార్‌మెన్స్ కోసం పెద్ద ర్యామ్‌
ర్యామ్ ఎక్కువ‌గా ఉంటే చాలా ఆ ఫోన్ చాలా గొప్ప‌ది.. అద్భుతంగా ప‌ని చేస్తుంది..ఇలా  చాలా మందిలోఉండే అభిప్రాయం. కానీ ఇది నిజంగా త‌ప్పే. స్మార్ట్‌ఫోన్  ఫెర్మార్‌మెన్స్‌కి ర్యామ్ సైజుకి ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ప‌నితీరు వెనుక ఎన్నో మ‌రెన్నో కార‌ణాలు ఉంటాయి.  4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ కూడా 2జీబీ ర్యామ్ ఉన్న‌ఫోన్‌లా ప‌ని చేయ‌క‌పోవ‌చ్చు.  ప్రాసెస‌ర్‌, ఓఎస్ లాంటి కార‌కాల‌పైనే మ‌న ఫోన్ ప‌నితీరు ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది చాలామందికి తెలియ‌ని విష‌యం.

మంచి ఫొటో కావాలంటే.. మంచి పిక్సల్ కెమెరా ఉండాలి
ఫోన్‌లు కొనేముందు అంద‌రూ అడిగే ప్ర‌శ్న‌ల్లో ఇదొక‌టి.  కెమెరా ఎన్ని మెగా పిక్స‌ల్ అని? ..కానీ నిజానికి మెగా పిక్స‌ల్‌కి క్వాలిటీకి  ఎలాంటి సంబంధం లేదు. 2 మెగా పిక్స‌ల్ ఉన్న‌కెమెరా కూడా 5 మెగాపిక్స‌ల్ క్వాలిటీ ఇవ్వొచ్చు.  24 మెగా పిక్స‌ల్ కెమెరా కూడా15 మెగా పిక్స‌ల్ క్వాలిటీ ఇవ్వ‌క‌పోవ‌చ్చు. ఇదంతా ఆ కెమెరా త‌యారీలో వాడే టెక్నాల‌జీని బట్టే ఆధార‌ప‌డి ఉంటుంది.

రాత్రంతా ఛార్జింగ్ పెడితే ఫోన్‌కు ప్ర‌మాదం
చాలామందిలో ఉండే అభిప్రాయం ఇది. రాత్రంతా ఛార్జింగ్ పెడితే ఛార్జ‌ర్‌తో పాటు ఫోన్ డ్యామేజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని చాలామంది అనుకుంటారు. అయితే  ఇది ఒక‌ప్ప‌టికాలం కాదు. హైటెక్ యుగం. ఇప్పుడొచ్చే బ్యాట‌రీలు కూడా ఎంతో అడ్వాన్స‌డ్‌. అవి ఎంత ప‌వ‌ర్ తీసుకోవాలో అంతే తీసుకుంటాయి. 100 శాతం ఛార్జింగ్ అయిన తర్వాత వాటికి పవర్ ఆగిపోతుంది. 

అప్‌డేట్స్ చేసుకోవ‌చ్చా లేదా!
మ‌న‌కు స్మార్ట్‌ఫోన్ ఉంటే అప్‌డేట్స్ వ‌స్తూనే ఉంటాయి. యాప్ అప్‌డేట్స్ చేసుకోమ‌ని. కానీ చాలామంది ఇది చేస్తే డివైజ్ స్లో అయిపోతుంద‌ని అనుకుంటారు...ఇదో త‌ప్పుడు అభిప్రాయం. అప్‌డేట్స్ చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న డివైజ్ ఫెర్మార్‌మెన్స్ పెరుగుతుందే త‌ప్ప‌..త‌గ్గ‌దు. ఐతే  అప్‌డేట్ చేసేముందు డివైజ్‌లో చాలినంత మెమ‌రీ ఉందా లేదా చూసుకోవాలి.

4కె రిజ‌ల్యూష‌న్ బెస్ట్‌
చాలామంది అడిగే ప్ర‌శ్న మీ ఫోన్లో  హెచ్‌డీ క్వాలిటీ ఉందా?. రిజ‌ల్యూష‌న్ ఎంత అని? అయితే రిజ‌ల్యూష‌న్ విష‌యంలో మీరు మ‌రీ  ఎక్కువ‌గా టెన్ష‌న్ ప‌డ‌కూడ‌దు. మీ బ‌డ్జెట్‌కు త‌గ్గ రిజ‌ల్యూష‌న్ చూసుకోవాలి. 4కె రిజ‌ల్యూష‌న్ ఉంటే ఆ ఫోన్‌ను కళ్లు మూసుకుని  కొనేయ‌చ్చు. 2కె ఉన్నా కూడా డిస్‌ప్లే గొప్ప‌గానే ఉంటుంది.

ప‌వ‌ర్ బ్యాంక్స్ మీ డివైజ్‌ను పాడు చేస్తాయి
ఛార్జింగ్ అయిపోతే వాడే ప‌వ‌ర్ బ్యాంక్స్ మీ ఫోన్‌ను పాడు  చేస్తాయ‌నే  అపోహ‌లు ఉంటాయి. నిజానికి ఇది త‌ప్పు.  ప‌వ‌ర్ బ్యాంక్స్‌ను స‌రిగ్గా వాడుకుంటే  మ‌నం లాభం పొందొచ్చు.  మంచి క్వాలిటీ, రేటింగ్ ఉన్న ప‌వ‌ర్‌బ్యాంక్స్‌ను ఎంచుకొని వాడాలి. అవ‌స‌రం అయినప్పుడు మాత్ర‌మే వాడాలి. ఒక‌సారి ఛార్జింగ్ చేసిన త‌ర్వాత రెండు, మూడుసార్లు మ‌నం ఫుల్ బ్యాట‌రీ ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు.

యాప్స్ డిలీట్ చేస్తే  స్పీడ్ పెరుగుతుంది!
 చాలామందిలో ఉండే ఆలోచ‌న ఇది. నిజానికి చాలామందిలో అపోహ ఇది. యాప్స్ డిలీట్  చేస్తే డివైజ్ ఫెర్మార్‌మెన్స్ పెరుగుతుంద‌ని అంతా అనుకుంటారు. కానీ ఇది క‌రెక్ట్ కాదు. యాప్స్ డివైజ్ ఫెర్మార్‌మెన్స్ కోసం చాలా అవ‌స‌రం.  అస‌లు ఫోన్ స‌రిగా ప‌ని చేస్తుందో లేదో చూడాలంటే క‌చ్చితంగా కొన్ని యాప్స్ వాడాల్సి ఉంటుంది. అయితే అన‌వ‌స‌ర‌మైన యాప్‌ల‌ను తీసేయడంలో  త‌ప్పు లేదు  కానీ అవ‌స‌ర‌మైన యాప్‌లు వాడ‌క‌పోవ‌డం త‌ప్పే.

జన రంజకమైన వార్తలు