• తాజా వార్తలు
  •  

ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయిందిప్పుడు. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి ఫోన్ మ‌న చేతిలో ఉండాల్సిందే. అయితే ఫోన్ వాడ‌కంలో మ‌నం చాలా త‌ప్పులు చేస్తున్నాం.  ఇలా ఫోన్ వాడ‌కంలో మ‌నం త‌రుచుగా చేసే మిస్టేక్స్ ఏమిటో చూద్దాం...

స్విచింగ్ బిట్వీన్ యాప్స్‌
స్మార్ట్‌ఫోన్ అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చేది మ‌ల్టీ టాస్కింగ్‌. కానీ యాప్స్ వాడ‌కం విష‌యంలోనే మ‌నం కొన్ని త‌ప్ప‌లు చేస్తాం. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో యాప్‌ల కోసం స్విచింగ్ యాప్స్ అనే ఆప్ష‌న్ వ‌చ్చింది. ఆండ్రాయిడ్ నౌగ‌ట్ లాంటి వెర్ష‌న్ల‌లో రీసెంట్ బ‌ట‌న్ మీద డ‌బుల్ ట్యాప్ చేస్తే చాలు. ఐఓఎస్‌లో త్రిడి ట‌చ్ కోసం లెఫ్ట్ ఎడ్జ్ మీద స్వైప్ చేయాలి

వోటీపీల‌ను కాపీ చేయ‌డం 
వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌. ఇప్పుడు ఏ ట్రాన్సాక్ష‌న్ చేయాల‌న్నా మ‌న‌కెంతో అవ‌స‌రం. ఒక్కోసారి మ‌నం నేరుగా ఈ కోడ్ ఎంట‌ర్ అయిపోయేలా యాక్సిస్ ఇచ్చేస్తాం. కానీ ఇది ఒక్కోసారి చాలా ఇబ్బంది క‌లిగిస్తుంది. మ‌న‌కు అవ‌స‌రం లేక‌పోయినా వోటీపీ నేరుగా యాక్సెప్ట అయిపోతుంది. మీరు ట్రూకాల‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉంటే మెసేజింగ్ ఫీచ‌ర్‌ను అనేబుల్ చేయాలి. 

క‌స్ట‌మ్ క్విక్ సెట్టింగ్స్‌
ఏదైనా ప‌ని కోసం యాప్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? అస‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. క్విక్ సెట్టింగ్స్ ప్యాన‌ల్‌లో మీకు క‌స్ట‌మ్స్ టైటిల్స్ యాడ్ చేసుకుంటే చాలు. మీకు కావాల్సిన యాప్ గురించి యాడ్ ఏ న్యూ టాస్క్‌ను పిన్ చేసుకుంటే స‌రిపోతుంది. క్విక్ సెట్టింగ్స్ పేజ్‌ని ఎడిట్ చేయ‌డానికి ప్యాన‌ల్ పుల్ డౌన్ చేసి పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. 

రాత్రి వేళ బ్రౌజ్ చేయ‌డం
ఫోన్‌ను క‌చ్చితంగా అంద‌రూ రాత్రివేళే ఎక్కువ బ్రౌజ్ చేస్తారు. ఇది మీ కంటి చూపు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఒక‌వేళ త‌ప్ప‌ని స‌రిగా బ్రౌజ్ చేయాల్సి వ‌స్తే ఐ ప్రొటెక్ష‌న్ ఆప్ష‌న్ అనేబుల్ చేసుకోవాలి. లేక‌పోతే నైట్ మోడ్‌లో పెట్టుకోవాలి. ఇది బ్లూ లైట్ ఇంపాక్ట్ ఇవ్వ‌డం వ‌ల్ల మీ స్లిప్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

స్క్రీన్ షాట్లు షేర్ చేయ‌డం
స్క్రీన్ షాట్లు షేర్ చేయ‌డం కూడా చాలా మందికి తెలియ‌దు. అయితే మీ గ్యాల‌రీలోనే స్క్రీన్ షాట్ల కోసం ఒక ఫోల్డ‌ర్ ఉంటుంది. గూగుల్ దీని కోసం ఒక క్విక్ బ‌ట‌న్‌ను ఎరేంజ్ చేసింది. హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి షేర్ స్క్రీన్ షాట్ అనే ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయ‌డం ద్వారా కూడా మీరు ఈ ఆప్ష‌న్ ఉప‌యోగించుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు