• తాజా వార్తలు

ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు అసూయ క‌లిగించే ఐదు ఆండ్రాయిడ్ ఫీచ‌ర్లు

బాగా డ‌బ్బులు ఉన్న‌వాళ్లు ఎక్కువ‌గా వాళ్ల చేతుల్లో ఐ ఫోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఉండే ఫీచ‌ర్లు, దీని విలువ అలాంటిది. ప్రెస్టీజ్ ఇష్యుగా ఈ ఫోన్‌ను కొనుక్కుంటారు సెల‌బ్రెటీలు. ఇప్పుడు సెల‌బ్రెటీలు మాత్ర‌మే కాదు మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువత కూడా ఈఎంఐలు పెట్టి మ‌రీ యాపిల్ ఫోన్లు ద‌క్కించుకుంటున్నారు. ఆండ్రాయిడ్‌ల క‌న్నా ఎన్నో రెట్ల మెరుగైన ఫీచ‌ర్లు ఐ ఫోన్లో ఉంటాయ‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే ఐ ఫోన్‌కు  మించిన ఫీచ‌ర్లు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉన్నాయి. ఐ ఫోన్ యూజ‌ర్లు అసూయ ప‌డేలా చేసే ఆ ఫీచ‌ర్లేంటో తెలుసుకుందాం.

యాప్ డిఫాల్ట్స్‌
గూగుల్‌లో ఐఓఎస్ 11 విష్‌లిస్ట్ అని టైప్ చేస్తే డిఫాల్ట్ యాప్స్‌కు స్విచ్ అవ‌చ్చ‌నే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. యాపిల్ ఫోన్ల‌లో యాప్‌లు వాడేందుకు స‌వాక్ష‌ల ఇబ్బందులు ఉంటాయి. ఎన్నో అవాంత‌రాలు ఎదుర‌వుతుంటాయి. కానీ ఆండ్రాయిడ్ ఫ్రీబ‌ర్డ్ సుల‌భంగా ఇందులో ఏ యాప్ అయినా వాడుకోవ‌చ్చు. ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా వెళ్లొచ్చు. క్రోమ్‌, ఒపెరా ఎక్క‌డైనా వాడొచ్చు. 

అడ్వాన్స‌డ్ నోటిఫికేష‌న్ కంట్రోల్స్‌
ఐఫోన్‌లో నోటిఫికేష‌న్ సెంట‌ర్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఇంప్రూవ్ చేయాల‌ని యూజర్లు కోరుతూనే ఉన్నారు. మ‌ల్టీపుల్ నోటిఫికేష‌న్స్ చూడ‌డం దీనిలో క‌ష్ట‌మైన విష‌యం. అదే ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌లో సుల‌భంగా ఒకే యాప్‌కు సంబంధించిన మ‌ల్టీపుల్‌ నోటిఫికేన్ల‌ను ఒకేసారి చూసే అవ‌కాశం ఉంది. ఐఓఎస్‌లో నోటిఫికేష్ల‌ను డిస్మిస్ చేయాలంటే రెండు స్టెప్‌ల ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌కు ఆ బాధ లేదు.

ఆన్ డివైజ్ కాల్ రికార్డింగ్
కాల్ మాట్లాడుతున్న స‌మ‌యంలోనే రికార్డు చేసుకునే స‌దుపాయం ఆండ్రాయిడ్‌లో చాలా కాలంగా ఉంది. కానీ  యాపిల్ ఫోన్‌లో ఈ ఫీచ‌ర్ లేదు. ఒక కాల్‌ను రికార్డు చేయాలంటే కొన్ని లీగ‌ల్ నిబంధ‌న‌ల‌ను ఓకే  చేయాల్సి ఉంటుంది. ఇది నిరాశ క‌లిగించే అంశం. ఒక్కోసారి వేగంగా కాల్స్ రికార్డు చేయాల్సి రావొచ్చు. ఇలాంటి స్థితిలో మీరు నిబంధ‌న‌ల‌న పాటిస్తూ ముందుకెళ్లాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ విష‌యంలో ఆండ్రాయిడ్‌దే పైచేయి.

మ‌ల్టీ యూజ‌ర్ మోడ్‌
వినియోగ‌దారుల‌ను ఆండ్రాయిడ్ వైపు మ‌ళ్లించే మ‌రో ఫీచ‌ర్ మ‌ల్టీ యూజ‌ర్ మోడ్‌. యాపిల్ ఫోన్లోనే కాదు ఐ పాడ్‌లోనూ ఈ ఆప్ష‌న్ లేదు.  ఒక ఇంట్లో ఉన్న‌ప్పుడు నెట్ షేర్ చేసుకోవ‌డం లాంటి పనులు ఆండ్రాయిడ్‌లోనే సాధ్యం. గూగుల్ 5.0 ఆండ్రాయిడ్ లాలిపాప్ వెర్ష‌న్‌లోనే ఈ మ‌ల్టీ యూజ‌ర్ మోడ్‌ను రూపొందించింది.

మ‌ల్టీ విండో యాప్స్‌
మ‌ల్టీ యూజ‌ర్ మోడ్ మాదిరిగానే మ‌ల్టీ విండో యాప్స్ ఆప్ష‌న్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ల‌భ్యం అవుతుంది. అంటే ఒకేసారి మ‌నం రెండు మూడు యాప్‌ల‌ను ఓపెన్ చేసుకుని వాడుకోవ‌చ్చు. కానీ ఐఓఎస్‌ల‌లో ఇది సాధ్యం కాదు. ఒక స‌మ‌యంలో ఒకే యాప్‌ను మ‌నం ఉప‌యోగించొచ్చు. విండోస్‌ను స్ప్లిట్ చేసి వాడుకోవ‌డం అనే ఆప్ష‌న్లు ఉండవు.

జన రంజకమైన వార్తలు