• తాజా వార్తలు

వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే. సుల‌భంగా చాటింగ్ చేయ‌డానికి, ఈజీగా ఫోటోలు, వీడియోల‌ను  షేర్ చేయ‌డానికి వాట్స‌ప్‌ను మించిన యాప్ లేదు.  ఇన్ని మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి కాబ‌ట్టే ఎక్కువ‌మంది వాట్స‌ప్‌ను ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌గా వాట్స‌ప్ అడిక్ట్ అయిపోయారు.

రెస్పాండ్ కావాల్సిందే

మ‌నం వాట్స‌ప్‌కు ఎంత‌గా అల‌వాటు ప‌డిపోయామంటే మ‌నం ఏ ప‌ని చేస్తున్నా ఒక‌వైపు దృష్టి దాని మీదే ఉంటుంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన వెంట‌నే మ‌న చేయి ఆటోమెటిగ్గా  ఫోన్ ఎక్క‌డ ఉందా అని వెతుకుతుంది. మీరు ఏం చేస్తున్నా వెంట‌నే వాట్స‌ప్‌కు రెస్పాండ్ కావ‌డం మామూలు విష‌యం అయిపోతుంది. ఖాళీగా ఉన్న‌ప్పుడు ఓకే కానీ.. ప్ర‌యాణాల్లో ముఖ్యంగా బైక్‌ల మీద ఉన్న‌ప్పుడు కూడా మెసేజ్‌ల‌కు రెస్సాండ్ అయ్యేవాళ్లు ఎంద‌రో. మీరు మీటింగ్‌లో ఉన్న‌ప్పుడో  లేదో ఏమైనా ముఖ్య‌మైన ప‌ని ఉన్న‌ప్పుడు ఈ వాట్స‌ప్ మీ ఏకాగ్ర‌త‌ను తీవ్రంగా దెబ్బ తీస్తుంది.

బ్లూటిక్ మాయ‌

వాట్స‌ప్‌లో చాలా మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి.  వాట్స‌ప్ చాటింగ్ చేసుకునేట‌ప్పుడు ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తికి మెసేజ్ చేస్తే అది బ్లూటిక్‌గా మారితే అవ‌త‌లి వ్య‌క్తి ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న‌ట్లు లెక్క‌. క‌మ్యునికేష‌న్ కోసం ఈ బ్లూటిక్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక‌వేళ బ్లూటిక్ రాక‌పోతే క‌మ్యునికేష‌న్ లేన‌ట్లు అర్ధం. ఒక్కోసారి బ్లూటిక్ కార‌ణంగా మిస్ అండ‌ర్‌స్టాండింగ్‌లు వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో ఎంతో స‌మ‌యం వృథా అవుతుంది.

స్పామింగ్‌

చాలామంది మ‌న‌కు మెసేజ్‌లు పంపుతూనే ఉంటారు. ముఖ్యంగా గ్రూప్ మెసేజ్‌లు ఎప్పుడూ చికాకు పెడుతుంటాయి. బ్ల‌డ్ అవ‌స‌రం లేక‌పోయినా కొంత‌మంది కావాల‌నే మెసేజ్‌లు పంప‌డం, లేదా ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ మెసేజ్‌లు వ‌స్తుంటాయి. వీటిని చూసి ఎంతో డిస్ట‌ర్బ్ అవుతుంటాం. కానీ గ్రూప్‌లోంచి లెఫ్ట్ కాలేం. ఇవి మ‌న‌కు మాన‌సికంగా ఎంతో చికాకు క‌లిగిస్తుంటాయి.  మూఢ న‌మ్మ‌కాల‌ను ప్రేరేపించ‌డాన‌కి గ్రూప్ మెసేజ్‌లు చేయ‌డం ఈరోజుల్లో చాలా మామూలు విష‌యం అయిపోయింది.

అన‌వ‌స‌ర అడ్వ‌ర్టేజ్‌మెంట్‌

వాట్స‌ప్‌లో ఉన్న మ‌రో చెత్త గుణం ఇది. ఎవ‌రో ఏదో ప్రొడెక్ట్‌కు సంబంధించిన వివ‌రాల్ని గ్రూపుల్లో పోస్ట్ చేస్తుంటారు. మ‌నం తెలుసుకోకూడ‌దు అనే విష‌యాల‌ను గురించి కూడా డిస్క‌స్ చేస్తుంటారు.  ఇలాంటివి మీ స‌మ‌యాన్ని బాగా తినేస్తాయి. అంతేకాదు మెంట‌ల్‌గా డిస్ట‌ర్బ్ చేస్తాయి. ఇలాంటి వాటి చెత్త మెసేజ్‌లు ఆప‌డానికి వాట్స‌ప్‌లో డు నాట్ డిస్ట‌ర్బ్ ఫీచ‌ర్ లేక‌పోవ‌డ‌మే బాధ‌క‌ర అంశం.

 

 

జన రంజకమైన వార్తలు