• తాజా వార్తలు
  •  

ఇక ఫోన్ల సైజులు 5.5 నుంచి 6కు మారిపోనున్నాయా?

ఒక‌ప్పుడు ఫోన్ సైజుల గురించి ప‌ట్టేంపే లేదు. అది మంచి ఫోన్ అయితే చాలు అనుకునేవాళ్లు. కానీ స్మార్ట్‌ఫోన్ విప్ల‌వం వ‌చ్చాక‌..  సినిమాలు, క్రికెట్ ఒక‌టేమి అన్నీ ఈ ఫోన్లోనే చూడ‌డం మొద‌లు పెట్టాక‌.. ఫోన్ల సైజు కూడా పెద్ద మ్యాట‌ర్ అయిపోయింది. మీ ఫోన్ సైజు ఎంత పెద్ద‌గా ఉంటే ఆ ఫోన్ గొప్ప‌... అది అంత ఖ‌రీదైంది... అనే లెక్క‌లు మొద‌ల‌య్యాయి. చాలా మంది 5.5 అంగుళాల ఫోన్ కంటే ఇంకా పెద్ద ఫోన్ల గురించి ఆలోచిస్తున్నారిపుడు. కొన్ని ఫోన్లు 6 అంగుళాల సైజుతో వ‌స్తూ వినియోగ‌దారుల‌ను ఆకర్షిస్తున్నాయి.  

సైజు మారిపోతుందా...
వినియోగ‌దారులు 5.5 అంగుళాల కంటే ఎక్కువ సైజు డిస్‌ప్లే కోసం చూస్తుండ‌డంతో రాబోయే ఫోన్ల‌లో ఇక‌పై 5.5 అంగుళాల నుంచి 6 అంగుళాల సైజు డిస్‌ప్లే ఉన్న ఫోన్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండా వీలైనంత పెద్ద సైజు స్క్రీన్ల‌తో ఫోన్ల‌ను తీసుకు రావ‌డానికి ఫోన్ల త‌యారీ కంపెనీలు ప్ర‌యత్నిస్తున్నాయి. అయితే మిగిలిన ఫీచ‌ర్లను కాస్త త‌గ్గించి డిస్‌ప్లే మీద దృష్టి సారిస్తే మార్కెట్లో దూసుకెళ్ల‌చ్చ‌నేది కంపెనీల వ్యూహం. ఒక‌టి రెండేళ్ల క్రితం 5 అంగుళాల ఫోన్ల‌దే రాజ్యం. ఆ త‌ర్వాత ఆ సైజు 5.5కు పెరిగింది. కానీ వీటి హ‌వా ఎక్కువ‌కాలం న‌డిచేట్టు లేదు. 6 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఫోన్లు త్వ‌ర‌లోనే 5.5 అంగుళాల ఫోన్ల‌ను రీప్లేస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

పెద్ద కంపెనీల‌న్నీ..
యాపిల్‌, శాంసంగ్‌, నోకియా ఇలా పెద్ద కంపెనీల‌న్నీడిస్‌ప్లే మీదే దృష్టి సారించాయి. వీలైంత‌న పెద్ద స్క్రీన్ ఉంటేనే ఈ రోజుల్లో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించొచ్చ‌ని ఆ కంపెనీలు భావిస్తున్నాయి.  2017లో వ‌చ్చిన చాలా ఫీచ‌ర్ ఫోన్లు ఎడ్జ్ టు ఎడ్జ్ లుక్‌తో ఉన్న‌వే. అంటే త‌క్కువ బాడీ షేప్ ఉండి.. పెద్ద స్క్రీన్ ఉండ‌డ‌మే వీటి ప్ర‌త్యేక‌త‌. వీటి త‌ర‌హాలోనే బాడీని కూడా పెంచి.. స్క్రీన్ సైజును అలాగే ఉంచాల‌ని ఫోన్ మాన్యుఫాక్చ‌ర్స్ భావిస్తున్నారు.  యాపిల్ తాజా విడుద‌ల ఐ ఫోన్ ఎక్స్ 5.8 అంగుళాల ప్యాన‌ల్‌తో వ‌చ్చింది.  ఐ ఫోన్ 8 ప్ల‌స్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది.  ఐతే స్క్రీన్‌ను 6 అంగుళాల‌కు పెంచేందుకు త‌మ‌కేమి అభ్యంత‌రం లేద‌ని త్వ‌ర‌లోనే ఆ స్ట‌యిల్ ఫోన్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని యాపిల్ తెలిపింది. యాపిల్‌తో మిగిలిన కంపెనీలు కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు