• తాజా వార్తలు
  •  

మ‌న స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన ఎనిమిది గాడ్జెట్స్ మీకు తెలుసా?

స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక మ‌న‌కు దాని తోడిదే లోకం అయింది. ఎక్క‌డికి వెళ్లినా ఏం చేసినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. చాలామంది వాష్ రూమ్‌లో కూడా ఫోన్‌ను వ‌ద‌ల‌రు. మ‌న‌తో అంత‌గా మ‌మేక‌మైపోయిందీ స్మార్ట్‌ఫోన్‌. అయితే ఇది మ‌న‌కు ఎంత వర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో తెలియ‌దు కానీ స్మార్ట్‌ఫోన్ రావ‌డం వ‌ల్ల కొన్ని అత్యంత ఉప‌యోప‌డే గాడ్జెట్లు కిల్ అయిపోయాయి. ఒక‌ప్పుడు  మ‌న డైలీ లైఫ్‌లో భాగంగా ఉండే ఆ గాడ్జెట్లు ఇప్పుడు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌రి ఆ గాడ్జెట్లేమిటో తెలుసుకుందామా!

ఎంపీ 3 ప్లేయ‌ర్‌
ఒక‌ప్పుడు ఏ ఇంట్లో చూసినా టేప్ రికార్డ‌ర్ నుంచి పాట‌లు విన‌బ‌డేవి. ఇక హోట‌ళ్ల‌కు వెళితే చెప్ప‌క్క‌ర్లేదు.  కాల క్ర‌మేణా టేప్ రికార్డ‌ర్ల స్థానంలో ఎంపీ 3 ప్లేయ‌ర్లు వ‌చ్చాయి.  మ్యూజిక్‌ను ఆస్వాదించ‌డానికి గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డ్డాయి. అయితే స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక ఎంపీ 3 ప్లేయ‌ర్ల గురించే జ‌నం మ‌రిచిపోయారు.  కార‌ణం స్మార్టోఫోన్ల‌లో మ్యూజిక్ ఆప్ష‌న్ ఉండ‌డమే. 

జీపీఎస్ నావిగేష‌న్‌
 జీపీఎస్ నావిగేష‌న్‌.. ఒక‌ప్పుడు మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ్డ టెక్నాల‌జీ ఇది. మ‌నం ఎక్క‌డికైనా వెళితే డైరెక్ష‌న్స్ తెలుసుకోవ‌డానికి ఈ సిస్ట‌మ్ బాగా ఉప‌యోగ‌ప‌డేది. అందుకే  కార్ల‌లో ఎక్కువ‌శాతం దీన్ని ఉప‌యోగించేవాళ్లు. అయితే స్మార్ట్‌ఫోన్ల‌లో జీపీఎస్ విధానం వ‌చ్చేయ‌డంతో   ప్ర‌త్యేకించి ఈ సాఫ్ట్‌వేర్ గురించి మ‌నం ఆలోచించే అవ‌కాశం లేకుండాపోయింది. 

డిజిట‌ల్ కెమెరా
ఒక‌ప్పుడు డిజిట‌ల్ కెమెరా చేతిలో ఉంటే ఏంతో గొప్ప‌. రీళ్ల కెమెరాలు కాక ఇలా ఎన్ని ఫొటోలు అయినా తీసుకోగ‌లిగే కెమెరా రావ‌డం అప్ప‌ట్లో ఒక వింత‌. కానీ ఇప్పుడు డిజిట‌ల్ కెమెరాల‌కు బాగా గిరాకీ త‌గ్గిపోయింది. ఫ్రొఫెష‌నల్స్ ఎవ‌రూ దీని గురించి ప‌ట్టించుకోవ‌ట్లేదు. కార‌ణం స్మార్ట్‌ఫోన్ల‌లో కెమెరా ఆప్ష‌న్లు రావ‌డ‌మే. ఎంతో నాణ్య‌మైన కెమెరాలు ఫోన్ల‌లో వాడుతుండ‌డంతో జ‌నం కెమెరా గురించి మ‌రిచిపోయారు.

రేడియా..
రేడియా అనేది ఒక‌ప్ప‌టి మాట‌. వార్త‌లు, క‌థానిక‌లు, నాట‌కాలు, సినిమాలు, క్రికెట్ కామెంట‌రీ ఇలా అన్ని దీని ద్వారానే వినేవాళ్లం. కానీ ఎఫ్ఎం వ‌చ్చాక రేడియాకు అర్థం మారిపోయింది. కేవ‌లం సినిమా పాట‌ల కోసం, ఆర్‌జే అరుపుల కోసం మాత్ర‌మేన‌న్న భ్ర‌మ కొత్త త‌రంలో క‌లిగింది. దీనికి తోడు స్మార్ట్‌పోన్ల‌లో రేడియోలు వ‌చ్చేయ‌డంతో సాధార‌ణ రేడియోలు ఎప్పుడో క‌నుమ‌రుగైపోయాయి.

వాయిస్ రికార్డ‌ర్‌
స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన మ‌రో అద్భుత గాడ్జెట్ ఇది. వాయిస్ రికార్డ‌ర్ ఒక‌ప్పుడు ఎంతో స్ట‌యిలీస్‌. ఇది వాడితే గొప్ప‌. జ‌ర్న‌లిస్టులు, డిటెక్టివ్ ఏజెన్సీలు, పోలీసులు లాంటి వాళ్ల ద‌గ్గ‌ర మాత్ర‌మే  ఇది ఉండేది. ఇప్పుడు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్లో దీన్ని మ‌నం చూడొచ్చు. 

అలారం క్లాక్‌
మ‌నం చ‌దువుకునే రోజుల్లో ఉద‌యం లేవాలంటే అలారం పెట్టుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అలారం ప్ర‌త్యేకించి కొనుక్కోవ‌క్క‌ర్లేదు. మ‌న స్మార్ట్‌ఫోన్‌లోనే అలారం ఉంటుంది. దాన్ని సెట్ చేసి పెట్టుకుంటే చాలు. అందుకే ఎవ‌రూ అలారం జోలికి వెళ్ల‌ట్లేదు.

రిస్ట్ వాచ్‌
స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన మ‌రో అత్యంత అవ‌స‌మైన వ‌స్తువు రిస్ట్ వాచ్‌. ఒక‌ప్పుడు రిస్ట్‌వాచ్ పెట్ట‌కుంటే ఎంతో గొప్ప‌.. గౌర‌వం. కానీ ఇప్పుడు రిస్ట్ వాచ్ స్ట‌యిల్ కోసం పెట్ట‌కుంటున్నారు త‌ప్ప స‌మ‌యం చూసుకోవ‌డానికి కాదు. దీనికి కార‌ణం స్మార్ట్‌ఫోన్ అన్నింట్లో టైమ్ ఉంటుంది. అంతేకాదు మీ యాక్టివిటీస్‌ను కూడా సేవ్ చేసుకోవ‌చ్చు. 

కాలిక్యులేట‌ర్‌
మ‌నం చదువుకునే రోజుల్లో లేదా ఉద్యోగం చేసేట‌ప్పుడు కాలిక్యులేట‌ర్ మ‌స్ట్‌గా వాడేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.  ఫోన్‌లోనే కాలిక్యులేట‌ర్ వ‌చ్చేసింది. ఏమైనా లెక్క‌లు చేయాలంటే వెంట‌నే ఫోన్ తీసి ట‌క్ ట‌క్ అని నొక్కేస్తున్నారు. 

జన రంజకమైన వార్తలు