• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - కార్ కావాలా.. వెండింగ్ మిష‌న్‌తో కొనేయండి

కార్ కొనాలంటే షోరూంకి వెళ్ల‌డం.. అక్క‌డ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ప్ర‌తి కారు గురించి చెప్ప‌డం, అవ‌న్నీ విన్నాక న‌చ్చిన కారు తీసుకుని టెస్ట్ రైడ్‌కు వెళ్ల‌డం.. న‌చ్చితే ఆ కారు బుక్ చేసుకోవ‌డం ఇదంతా ఒక రోజు ప‌ని. బుక్ చేసుకున్న కారు మీ చేతికి వ‌చ్చేస‌రికి మూడు, నాలుగు రోజులైనా ప‌డుతుంది. చైనాలో అయితే ఇదంతా క్ష‌ణాల్లో ప‌ని. కారు ట్ర‌య‌ల్ వేయాల‌న్నా, దాన్ని కొనేసుకోవాల‌న్నా కూడా వెండింగ్ మిష‌న్ ద‌గ్గ‌ర‌కెళితే చాలు.. నిముషాల్లో ప‌ని అయిపోతుంది.
ఫోర్డ్‌, అలీబాబాల కలిసి చైనీస్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ మార్కెట్‌లో జాయింట్ వెంచ‌ర్ స్టార్ట్ చేశాయి. 2018 జ‌న‌వ‌రి నుంచి షాంగై, నాన్జింగ్ సిటీస్‌లో రెండు ఫుల్లీ ఆటోమేటిక్ కార్ వెండింగ్  మిష‌న్లు అందుబాటులోకి తెస్తున్నామ‌ని అనౌన్స్ చేశాయి.  మీరు కారు ట్ర‌య‌ల్ వేయాల‌న్నా, దాన్ని కొనేసుకోవాల‌న్నా కూడా ఈ మిష‌న్ దగ్గ‌ర‌కెళితే చాలు. ఆన్‌లైన్‌లోనే ప్రొసీజ‌ర్ మొత్తం న‌డుస్తుంది. 
ఇదీ ప్రొసీజ‌ర్ 
* Taobao యాప్ స్మార్ట్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. రోడ్డు మీద వెళుతున్న‌దో, పార్కింగ్ చేసి ఉన్న‌దో  న‌చ్చిన కారు ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాలి.
*  డిటెయిల్స్ యాడ్ చేసి ఓ సెల్ఫీ తీసుకోవాలి.
* ఇప్పుడు వెండింగ్ మిష‌న్లు అందుబాటులో ఉండే టీమాల్ ఆటో ఫెసిలిటీ సెంట‌ర్‌కువెళ్లాలి.  అక్క‌డ ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ ద్వారా ఐడెంటిటీ చెక్ చేసుకుని లోప‌లికి ప‌ర్మిట్ చేస్తారు.  
*  అక్క‌డ మూడంత‌స్తుల పెద్ద వెండింగ్ మిష‌న్ ఉంటుంది. ప‌ర్స‌న్ సెలెక్ట్ చేసుకున్న కారు ఆటోమేటిగ్గా బ‌య‌టికి వ‌స్తుంది. 
*  ఈ కారును తీసుకెళ్లి మూడు రోజులు టెస్ట్ డ్రైవ్ చేసి న‌చ్చితే ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఆ కారుకు అమౌంట్ పే చేసేయొచ్చు.
* న‌చ్చక‌పోతే ఆ కారు ఇచ్చేసి మ‌రో కారు ట్ర‌య‌ల్ కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవ‌డ‌మే .  ఈ ప్రాసెస్‌లో ఎక్క‌డా స్టాఫ్ ఉండ‌రు. అంతా ఫుల్లీ ఆటోమేటెడ్‌. 
సూప‌ర్ మెంబ‌ర్ల‌కే ఛాన్స్ 
అలీబాబా జిమా క్రెడిట్ స్కోరింగ్ సిస్టం ద్వారా ఐడెంటిఫై చేసి సూప‌ర్ మెంబ‌ర్ షిష్ ఇస్తారు. వాళ్ల‌కు మాత్ర‌మే ఈ స‌ర్వీసు అందుబాటులో ఉంటుంది. ఒక వెహిక‌ల్‌ను ఒక్క‌సారే టెస్ట్ డ్రైవ్ చేయాలి. అలా రెండు నెల‌ల్లో ఐదు మోడల్స్ వ‌ర‌కు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు.  యూఎస్‌లో ఇప్ప‌టికే ఇలాంటి కార్ వెండింగ్ మిష‌న్లున్నాయి. అయితే అన్నీ ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా అమ్మే అలీబాబా ఫిజిక‌ల్‌గా ఇలాంటి స్టోర్ పెట్ట‌డం ఇదే ఫ‌స్ట్‌టైమ్‌. 
 

జన రంజకమైన వార్తలు