ఆండీ రూబిన్.. ఆండ్రాయిడ్ కో ఫౌండర్. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ల సృష్టికర్తల్లో ఒకరు. ఆయన ఇటీవల రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఓ యంగ్ కపుల్‌ను చూశారు. వాళ్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాక ఫుడ్‌ను, వాళ్లను సెల్ఫీలు తీసుకుని తర్వాత ఓ 10 నిముషాల సేపు వాటిని సోషల్ సైట్లలో అప్లోడ్ చేయడం వంటి పనుల్లో మునిగిపోయారట. వాళ్లు ఫస్ట్ డేట్‌కు బయటికివచ్చినా ఫోన్‌ను వదలలేకపోతున్నారని, ఇలా చాలా మంది స్మార్ట్‌ఫోన్‌కు ఎడిక్ట్ అయిపోయారని ఆండీ బాధపడ్డారు. ఈ ఎడిక్షన్ నుంచి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచంలో ఉన్న85% స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌నే వాడుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్ పెరిగిపోయిందని, ఐదు నిముషాలకోసారి ఫోన్ చూడకపోతే ఉండలేని పరిస్థితి కోట్లాది మంది యూజర్లలో ఉందని రూబాన్ చెప్పారు. ఇప్పుడు ఇంటర్నెట్తో వస్తున్న చాలా మనకు ఇంతకు ముందు లేవని, అయినా హ్యాపీగానే బతికేవాళ్లమని గుర్తు చేశారు. రూబిన్ తన సొంత కంపెనీతో ఎసెన్షియల్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్ తయారుచేశారు. ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా డివైజస్ తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వకుండానే పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీనే ఎసెన్షియల్ ఫోన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చని తద్వారా ఫోన్‌తో ఇంటరాక్షన్ తగ్గి మనుషులతో మాట్లాడడం పెంచవచ్చని రూబిన్ అంటున్నారు.
నా వంతుగా కొంత
ఎసెన్షియల్ ఫోన్లో వర్చువల్ వెర్షన్ రాబోతోంది. మీరు మీ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మెసేజ్‌లకు ఆన్సర్లివ్వడం, సోషల్ నెట్వర్క్ నోటిఫికేషన్స్ అడ్రస్ చేయడం వంటివి ఏఐ టెక్నాలజీతో చక్కబెట్టొచ్చు. వర్చువల్ వెర్షన్ తో ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి డిన్నర్ చేసేటప్పుడు కూడా ఫోన్ పట్టుకునేవారు దాన్ని పక్కనపెట్టి డిన్నర్‌ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అని రూబిన్ చెప్పారు. టాలెంటెడ్ ఎసెన్షియల్ టీమ్.. ఏఐ టెక్నాలజీని మరింతగా డెవలప్ చేస్తోందని, దీని ద్వారా మనం ఫోన్ ముట్టుకోకుండానే చాలా ఫనులు చేసుకోవచ్చన్నారు. ఫోన్ ఎడిక్షన్ తగ్గించడానికి తన వంతు ఇది చేస్తున్నానన్నారు. స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడేయడానికి టెక్నాలజీనే వాడుకోవడం ఉత్తమ మార్గమని, దీన్ని ఫ్యూచర్లోనూ కంటిన్యూ చేస్తామన్నారు.
ఇన్హోం డిజిటల్ అసిస్టెంట్
ఎసెన్షియల్ తర్వాత ప్రొడక్ట్స్ లో ఇన్ హోమ్ డిజిటల్ అసిస్టెంట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యాంబియంట్ ఓఎస్ ద్వారా రన్ అయ్యే ఈ డివైస్‌తో అలెక్సా, సిరీ లాంటి వాయిస్ అసిస్టెంట్ల ద్వారా పనులు చక్కబెట్టుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్ సాయంత్రం బయటికి వెళదాం అని మెసేజ్ పెడితే దానికి మీ సమాధానంగా ఆరు రెస్పాన్స్‌లను ఈ డిజిటల్ అసిస్టెంట్ సిద్ధం చేస్తుంది.దానిలో ఒకదాన్ని మీరు సెండ్ చేయొచ్చు. ఏం సమాధానం ఇవ్వాలా అని ఫోన్ పట్టుకుని ఆలోచించాల్సిన పనిలేదు. ఇలా కొన్నిసార్లు మీ ఆన్సర్స్ ట్రెండ్ చేశాక సిస్టం సొంతంగానే మెసేజ్‌కు ఆన్సర్ ఇచ్చేస్తుంది. వర్చువల్ వెర్షన్‌తో ఇలాంటివి సాధ్యమేనంటున్నారు రూబిన్.