• తాజా వార్తలు
  •  

సిమ్ తీసుకున్న కంపెనీ దగ్గ‌రే ఫోన్ కొనడంలో ఉన్న మంచీ చెడు

ఇండియాలో 10, 12 సంవ‌త్స‌రాల కిందట సీడీఎంఏ ఫోన్లే ఉండేవి. రిల‌య‌న్స్‌, టాటా డొకోమోలు సొంత హ్యాండ్‌సెట్ల‌నే యూజ‌ర్ల‌కిచ్చేవి. ఫోన్ ఖ‌రీదు ముందు క‌ట్టి త‌ర్వాత నెల‌నెలా మొబైల్ బిల్ క‌ట్టాలి.  ఇప్పుడా  ఆ శ‌కం ఇండియాలో పూర్తిగా ముగిసిపోయింది.  జీఎస్ఎం నెట్‌వ‌ర్క్‌తో  ప్ర‌తి ఒక్క‌రూ న‌చ్చిన ఫోన్ కొనుక్కుని త‌మ‌కు త‌గిన ఆఫ‌ర్లు ఇచ్చే సిమ్ వేసుకుని వాడుకుంటున్నారు.  అమెరికా లాంటి ఫారి్న్ కంట్రీస్‌లో మాత్రం ఇప్ప‌టికే కారియ‌ర్ కంపెనీయే ఫోన్ కూడా అమ్ముతుంది. ఐఫోన్ లాంటి ఖ‌రీదైన ఫోన్ల‌ను త‌క్కువ డౌన్ పేమెంట్‌కే ఇస్తుంది. త‌ర్వాత సెల్ బిల్లుతోపాటు మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల్లో వ‌సూలు చేసుకుంటాయి. కానీ  మ‌న ద‌గ్గ‌ర ఎంత ఖ‌రీదైన ఫోన్ అయినా విడిగానే కొనుక్కుంటున్నాం.  అవ‌స‌ర‌మైతే ఫోన్‌ను ఈఎంఐ ప‌ద్ధ‌తిలో  తీసుకుంటున్నాం .
అక్క‌డ ఎందుకు వ‌ర్క‌వుట్ అవుతుంది? 
ఉదాహ‌ర‌ణ‌కు అమెరికాలో టీ మొబైల్ అనే మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీ ఐఫోన్ 7 ప్ల‌స్ 32 జీబీ మోడ‌ల్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు ఇస్తుంది. 46 డాల‌ర్లు (2,991 రూపాయ‌లు) డౌన్ పేమెంట్‌.  త‌ర్వాత 27 డాల‌ర్లు (1756 రూపాయ‌లు) చొప్పున 24 నెల‌ల‌పాటు క‌ట్టాలి. అంటే మొత్తం 694 డాల‌ర్లు (45,141 రూపాయ‌లు). కానీ అమెరిక‌న్స్ దీన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే టీ మొబైల్ నెట్‌వర్క్‌లో ఒక్కో క‌స్ట‌మ‌ర్ నెల‌కు యావ‌రేజ్‌న 70 డాల‌ర్ల ఫోన్ బిల్లు క‌డ‌తారు. అంటే హ్యాండ్‌సెట్ కాస్ట్ కంటే ఫోన్ బిల్లు 2.6 టైమ్స్ ఎక్కువ‌.  
ఇండియాలో ఎందుకు కాదు? 
జియో వ‌చ్చిన త‌ర్వాత ఇండియ‌న్ మొబైల్ ఇండ‌స్ట్రీలో ప్రైస్‌వార్ జ‌రుగుతోంది. నెల‌కు మ్యాగ్జిమం 300 ఖ‌ర్చుపెడితే రోజుకు 1జీబీ డేటా, నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌చ్చేస్తున్నాయి. ఇంత‌కంటే త‌క్కువకు ఇస్తున్న కంపెనీలు ఉన్నాయి. ఇలాంట‌ప్పుడు డివైస్‌కు ప్ర‌తి నెలా అమెరిక‌న్ల‌లా రెండు, మూడువేలు ఖ‌ర్చు పెట్ట‌డానికి ఇండియ‌న్స్ ఇష్ట‌ప‌డ‌రు.  అదీకాక ఐదు నుంచి 10 వేల రూపాయ‌ల ఖ‌రీదైన స్మార్ట్‌ఫోన్లే ఇండియాలో ఎక్కువ‌గా సేల్ అవుతాయి.  మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీలే సెల్ అమ్మాలంటే ఈ స్థాయి ఫోన్ల‌తో వ‌ర్క‌వుట్ కాదు.  ఎందుకంటే అది రెండేళ్లు ప‌ని చేయాలి. 
జియో ఫోన్‌తో  మ‌ళ్లీ వ‌స్తుందా? 
స్మార్ట్ ఫీచ‌ర్ ఫోన్ అంటూ 1500 రూపాయ‌ల‌కు జియో కొత్త గా ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో జియో సిమ్ త‌ప్ప వేరేది వాడ‌లేం. అయితే ఈ ఫోన్ యూజ‌ర్లు ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో లేదు. ఫీచ‌ర్  ఫోన్ వాడుతున్న‌వారు మాత్ర‌మే దీన్ని యాక్సెప్ట్ చేయ‌గ‌లుగుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న‌వారు సెకండ్ ఫోన్‌గా కూడా దీన్ని వాడ‌డం లేదు. ఇది హిట్ట‌యితే మ‌రిన్ని ఫోన్లు తీసుకొద్దామ‌నుకున్న జియో.. ఈ ఫోన్ మీద యూజ‌ర్లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో వెన‌క‌డుగు వేసింది. ఎయిర్‌టెల్ ఇలాంటివి లాంచ్ చేస్తున్నా యూజ‌ర్లను ఒప్పించ‌గ‌లదో లేదో చూడాలి. మొత్తంగా చూస్తే ఇండియ‌న్ మార్కెట్‌లో ఈ క్యారియ‌ర్ +  మొబైల్ స్కీం వ‌ర్క‌వుట్ అవ‌డం క‌ష్టమే.   

జన రంజకమైన వార్తలు