• తాజా వార్తలు
  •  

విశ్లేషణ - చౌక 4జీ ఫోన్ల దారెటు? 

టెలికం కంపెనీల‌న్నీ  4జీ నెట్‌వ‌ర్క్‌లోకి వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు యూజ‌ర్లకు దాన్ని అల‌వాటు  చేయాలి. అయితే 4జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్ల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుందని ఇంకా చాలా మంది 2జీ, 3జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్లే వాడుతున్నారు.  ఇలాంటి వాళ్లు మొత్తం 50 కోట్ల మంది ఉంటార‌ని అంచనా.  వాళ్లే టార్గెట్‌గా టెలికం కంపెనీలు ఇప్పుడు 4జీ హ్యాండ్‌సెట్ల‌ను తామే అమ్మే పని పెట్టుకున్నాయి. 
జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ అన్నీ అదే దారి
ఇప్ప‌టికే జియో స్మార్ట్ ఫీచ‌ర్ ఫోన్‌తో ఈ ప్లాన్‌లో ముందుంది.  1500 పెట్టి ఈ ఫోన్ కొంటే మూడేళ్లు వాడిన త‌ర్వాత ఫోన్ వెన‌క్కిస్తే 1500 రిఫండ్ ఇస్తామ‌ని, కాబ‌ట్టి ఈ ఫోన్ మీరు ఫ్రీగా పొందిన‌ట్లే అని యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంది. జియో ఫోన్ ల‌క్ష‌లాది ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. నెల‌కు 153 రూపాయ‌ల రెంట‌ల్‌తో ఈ ఫోన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, కొంత డేటా ఇస్తాయి.  ఎయిర్‌టెల్ కార్బ‌న్‌తో క‌లిసి 1500 రూపాయ‌ల‌కే 4జీ ఫోన్‌ను తీసుకొస్తోంది.  దీనికి మంత్లీ రెంట‌ల్ 169 రూపాయ‌లు. వొడాఫోన్ మ‌రో అడుగు ముందుకేసి మైక్రోమ్యాక్స్‌తో క‌లిసి 1000 రూపాయ‌ల్లోపు 4జీ ఫోన్ తేవ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఇవ‌న్నీ చూస్తే 4జీ ఫోన్ ఫీచ‌ర్ ఫోన్ కాస్ట్‌కే వ‌చ్చేస్తుందని అర్ధ‌మ‌వుతోంది. 
ఏంటి లాభం? 
దీనివ‌ల్ల టెల్కోలు త‌మ యూజ‌ర్ బేస్‌ను కాపాడుకోవ‌చ్చు. అంతే కాదు ధ‌ర త‌క్కువ కాబ‌ట్టి కొత్త క‌స్ట‌మ‌ర్లు కూడా ఈ 4జీ ఫోన్లు కొనుక్కుంటారు. వాళ్లంతా ఈ ఫోన్ వాడుకోవాలంటే మంత్లీ రెంట‌ల్ క‌ట్టాలి. ఫీచ‌ర్ ఫోన్లు వాడిన‌ప్పుడు 20, 30 రూపాయ‌ల రీఛార్జి చేయించుకునేవాళ్లు. అలా చేస్తే  ఏవ‌రేజ్ రెవెన్యూ ప‌ర్ యూజ‌ర్ (ARPU) నెల‌కు 90 నుంచి 100 రూపాయ‌ల వ‌ర‌కు ఉండేది.  ఇప్పుడు నెల‌కు 150,160 రూపాయ‌లు పెడితే నెలంతా ఫ్రీ కాల్స్ వాడుకోవ‌చ్చు. డేటా కూడా ఉంటుంది కాబ‌ట్టి దీనికి మొగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీల‌కు ఏవ‌రేజ్ రెవెన్యూ ప‌ర్ యూజ‌ర్ (ARPU) పెరుగుతుంది. త‌క్కువ రేట్‌లో డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా వ‌స్తున్నాయి కాబ‌ట్టి యూజ‌ర్ల‌కు కూడా మేలే. మొత్తంగా చూస్తే టెల్కోల భాగ‌స్వామ్యంతో వ‌చ్చే చౌక 4జీ ఫోన్లు టెలికం సెక్టార్‌లో ఆదాయాన్ని భారీగా పెంచ‌డం ఖాయం. 

జన రంజకమైన వార్తలు