• తాజా వార్తలు

పేమెంటు బ్యాంకుల గురించి ఒక వినియోగదారుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవీ..

అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలన్న టార్గెట్ తో సులభ మార్గంగా పేమెంటు బ్యాంకుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇది కూడా రిజర్వు బ్యాంకు పరిధిలోనే పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, అల్పాదాయ వర్గాల వారు, గ్రామీణ ప్రజలకు పనికొచ్చేలా ఈ విధానం రూపొందించారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు దీన్ని వాడుకోవచ్చు.
చిన్నమొత్తాల్లో లావాదేవీలు చేసుకోవడం ఇందులో సులభం. ఈ పేమెంటు బ్యాంకుల్లో చెల్లింపులు చేసుకోవడంతో పాటు సేవింగ్స్ అవకాశాలూ ఉన్నాయి. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా ఇందులో నిర్వహించుకోవచ్చు. లోన్లు, క్రెడిట్ కార్డులు వంటివి మాత్రం ఉండవు.
లాభాలేంటి..?
* డిపాజిటర్ల సేవింగు ఖాతాలో ఉండే డబ్బుకు వడ్డీ ఇస్తారు.
* చెక్ బుక్, ఏటీఎం కార్డు తీసుకోవచ్చు
* రూ.లక్ష వరకు ట్రాంజాక్షన్లు చేసుకోవచ్చు.
* కొన్ని పేమెంటు బ్యాంకులు వినియోగదారులకు ఫ్రీ ఇన్స్సూరెన్సు కల్పిస్తున్నాయి.
* సాధారణ బ్యాంకుల్లో చేసుకున్నట్లే నగదు విత్ డ్రా, డిపాజిట్ చేసుకోవచ్చు.
బ్యాంకు అకౌంట్లతో లింకేజీ
* పేమెంటు బ్యాంకు ఖాతాలను సాధారణ బ్యాంకుల ఖాతాలతో లింకు చేసుకునే వీలు కూడా ఉంది. ఈ ఖాతాల మధ్య మనీ ట్రాంజాక్షన్లు జరుపుకోవచ్చు.
* అయితే పేమెంటు బ్యాంకుల లావాదేవీల విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
ఎయిర్ టెల్, పేటీఎం నుంచి...
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్, ఆన్ లైన్ కామర్స్ సంస్థ పేటీఎంలు కూడా పేమెంటు బ్యాంకులను ప్రారంభించాయి. ఇప్పటికే సుమారు 11 పేమెంటు బ్యాంకులు ఉండగా మరిన్ని సంస్థలు వీటి కోసం అనుమతులు కోరుతున్నాయి. అయితే... సాధారణ ఖాతాలను ఆన్ లైన్ లో నిర్వహించినప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో వీటి విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సైబర్ మోసాల వంటి బెడద ఇక్కడా ఉంది.





జన రంజకమైన వార్తలు