• తాజా వార్తలు
  •  

టెక్నాలజీ మనకు హెడేక్ అవకూడదంటే అర్జంట్ గా పాటించాల్సిన 5 అలవాట్లు

2017లో సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. టెక్నాలజీకి సంబంధించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలనూ తీసుకున్నారు. ఐఫోన్ బీజిల్  నుంచి ఐకానిక్ టచ్ ఐడీని తొలగించేవరకు, బడా కంపెనీల అస్పష్టమైన నిర్ణయాలు ఇలా టెక్నాలజీ రంగంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇదంతా గతం...ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంద‌ర్భంగా నిత్య‌జీవితంలో అనివార్యంగా  మారిన టెక్నాల‌జీని అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వాడుకుంటూ.. మ‌న‌కు హెడేక్‌గా మార‌కుండా కాపాడుకోవ‌డానికి ఈ ఐదు తీర్మానాలు చేసుకుందాం.
1 . డెస్క్‌టాప్‌ బ్యాక‌ప్ టూల్
మీ కంప్యూటర్ బ్యాక‌ప్ తప్పనిసరిగా ఉండాలి.  ఇది ముఖ్యమైన ఫైల్స్‌ను మీ గూగుల్ డిస్క్ అకౌంట్‌కు అప్‌లోడ్ చేస్తుంది. లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఉంటే ఫోల్డర్లను సమకాలీకరించడానికి కచ్చితంగా సెలక్ట్ చేసుకోండి. ప్లస్ యాప్‌తోపాటు కంప్రెస్డ్ క్వాలిటీతో గూగుల్ ఫోటోలకు అన్‌లిమిటెడ్‌ పిక్చర్స్ బ్యాకప్‌ను అనుమతిస్తుంది. ఎక్స్ టర్నల్ డ్రైవ్ కు బదులుగా...మీ కంప్యూటర్ను క్లౌడ్ అకౌంట్ కు బ్యాకప్ చేయాలి. ఇలా చేసినట్లయితే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. స్టార్టర్స్ కోసం గూగుల్ డిస్క్ యాప్ లో ఎక్కడి నుంచైనా మీ ఫైల్ను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు డిస్క్ క్రాష్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
2. గూగుల్ ఫోటోస్‌
స్మార్ట్‌ఫోన్ యాప్స్‌లో చాలా ముఖ్య‌మైన‌ది గూగుల్  ఫొటోస్‌. ఇందులో ఫోటోలు ఈ-మెయిల్ సాయంతో సేవ్ చేయబడి ఉంటాయి. అంతేకాదు డిజిటల్ లైబ్రరీని డెవలప్ చేస్తాయి. పైసా ఖర్చు లేకుండా అపరిమిత సంఖ్యలో ఫోటోలను, వీడియోలను గూగుల్ అప్‌లోడ్ చేస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలో గూగుల్ ఫోటోలు అందుబాటులో ఉన్నాయి.
3. పాస్‌వ‌ర్డ్ మేనేజర్
సాధారణంగా కొంతమంది ప్రతి అకౌంట్‌కు ఒకే పాస్‌వ‌ర్డ్ వాడుతుంటారు. ఇలా చేస్తే హ్యాక‌ర్ల చేతికి మ‌నం తాళాలిచ్చిన‌ట్టే. దీనికి బ‌దులు మీ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌ల‌నుభద్రంగా ఉంచేందుకు పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఈ యాప్స్ బ్రౌజర్లతోపాటు ఇతర యాప్స్‌తోనూ ఈజీగా క‌లిసిపోతుంది. అయితే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటూ దీన్ని పూర్తిగా మార్చాలి. ప్రీమియం పాస్‌వ‌ర్డ్ మేనేజర్ సెలక్ట్ చేసుకోవడానికి ఫ్రీ, కాంపిటెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. వీటిలో లాస్ట్ పాస్ ఒకటి. ఇది చాలా ఫీచర్లను అందిస్తుంది. పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్‌ను ప్రారంభించడంతోపాటు గూగుల్, ట్విట్టర్, యాపిల్ వంటివి ప్రతిరోజు ఉపయోగించే అకౌంట్స్ కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేష‌న్‌ను కూడా ఎనేబుల్ చేసుకుంటే మ‌రింత సెక్యూరిటీ ఉంటుంది.
4.ఆన్‌లైన్‌లో జాగ్రత్తలు
ఇంటర్నెట్  ఉపయోగిస్తున్నప్పుడు ప్రైవసీని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. క్లౌడ్ సర్వీసును వినియోగిస్తున్నప్పుడు వ్యక్తిగత సమాచారం గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. అందుకే మీరు వెబ్ సైట్లను సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత సమాచారం గురించి జాగ్రత్తగా ఉండాలి.  ట్రాకర్స్‌ను పూర్తిగా బ్లాక్ చేయాలి. క్రిప్టో కరెన్సీ వంటివి ఆకస్మికంగా పెరగడం, ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో విజిటర్స్ కంప్యూటర్స్ ద్వారా మైనింగ్ కరెన్సీలను రహస్యంగా ప్రారంభిస్తున్నారు. అయితే మీరు  నో కాయిన్ అనే టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.  
5. స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా వాడండి
కొంత‌మంది రోజూ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్స్, ఫేస్‌బుక్ పోస్టింగో చూడనిదే నిద్రపోరు. ఇక వాట్స‌ప్ మెసేజ్ సౌండ్ రాగానే వెంట‌నే ఫోన్‌చేతిలోకి తీసుకుంటున్నా మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవుతున్న‌ట్లే.  ఇది రాన్రానూ మీ  జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. స్మార్ట్‌ఫోన్‌ను అవ‌స‌ర‌మైనంత వ‌రకే వినియోగించ‌డ‌మే దీనికి మందు.

జన రంజకమైన వార్తలు