• తాజా వార్తలు

మ‌న కారులో యూఎస్‌బీ ఛార్జ‌ర్ డెడ్ స్లోగా ఎందుకు ప‌ని చేస్తుందో తెలుసా?

మ‌నం కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న ఫోన్ బ్యాట‌రీ గురించి కూడా ఆలోచించుకోవాలి. చాలామంది కారులో యూఎస్‌బీ ఛార్జర్ ఉంది క‌దా అనే నిర్ల‌క్ష్యంగా ఉంటారు. కానీ చాలా సంద‌ర్భాల్లో యూఎస్‌బీ ఛార్జ‌ర్ స‌రిగా ప‌ని చేయ‌దు. మ‌నం గంట‌లు కొద్దీ ఛార్జింగ్ పెట్టినా మ‌న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఫోన్ ఛార్జింగ్ కాదు. ఇలా ఎందుకు జ‌రుగుతుంది?.. గంట‌లు కొద్దీ ఛార్జింగ్ పెట్టినా ఎందుకు ఫోన్ బ్యాట‌రీ ఫుల్ కావ‌ట్లేదు..  మ‌న కారులోని యూఎస్‌బీ ఛార్జ‌ర్ డెడ్ స్లోగా అయిపోవ‌డానికి కార‌ణం ఏమిటి? 

ప‌వ‌ర్ త‌క్కువ‌
మ‌న కార్ల‌లో ప్రొవైడ్ చేసే యూఎస్‌బీ పోర్ట్‌ల‌లో ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉంటుంది. మ‌నం ఎంత‌సేపు ఛార్జింగ్ పెట్టినా బ్యాట‌రీ నిండ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణం. బ్యాట‌రీ పూర్తిగా అయిపోయిన సంద‌ర్భంలో ఏదో ఒక కాల్  చేసుకోవ‌డానికి స‌రిప‌డా ఎన‌ర్జీని మాత్ర‌మే ఈ యూఎస్‌బీ పోర్టులు అందించ‌గ‌ల‌వు. గ‌తంలో కార్ల త‌యారీ కంపెనీలు ఎక్కువ ప‌వ‌ర్ ఉన్న యూఎస్‌బీ పోర్ట్‌ల‌ను ఫిక్స్ చేసేవి. కానీ రాను రాను వీటి సామ‌ర్థ్యం బాగా త‌గ్గిపోయింది. 2.4 యాంప్స్ సామ‌ర్థ్యం ఉన్న యూఎస్‌బీ పోర్ట్‌ల‌తో ప్ర‌స్తుతం కార్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఎంపీ 3 ప్లేయ‌ర్‌తో పాటు ఫోన్ ఛార్జింగ్ చేయ‌డం లాంటివి ఒకేసారి చేయ‌డం వ‌ల్ల కూడా యూఎస్‌బీ పోర్ట్‌ల సామ‌ర్థ్యం స‌రిపోవ‌ట్లేదు.

స్పెసిషికేష‌న్‌కు త‌గ్గ‌ట్టే..
ఇప్పుడు వ‌స్తున్న కార్ల‌లో ఎక్కువ శాతం స్పెసిషికేష‌న్‌కు త‌గ్గ‌ట్లే త‌యార‌వుతున్నాయి. 2.5 యాంప్స్ సామ‌ర్థ్యం క‌న్నా ఎక్కువ ఉండ‌కూడ‌ద‌నే నిబంధ‌ల‌తో యూఎస్‌బీ పోర్టుల‌ను త‌యారు చేస్తున్నాయి. కానీ వాస్త‌వానికి వ‌చ్చే స‌రికి ఇది ఎందుకూ స‌రిపోవ‌ట్లేదు. మ‌ద్జా కారు ఈ విష‌యంలో ఎక్కువ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఆ కంపెనీ త‌యారు చేస్తున్న కార్ల‌లో దాదాపు అన్నింట్లో యూఎస్‌బీ పోర్ట్ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.  కొన్ని కార్ల‌లో మ‌రీ త‌క్కువ‌గా 2.0 యాంప్స్‌తో త‌యారు చేయ‌డ‌మే దీనికి కార‌ణం.  మ‌రి కొన్ని కార్ల‌లో 1.5 యాంప్స్‌తో యూఎస్‌బీ పోర్టుల త‌యారు అవుతున్నాయి. అయితే వీటికి నిర్ధిష్ట సామ‌ర్థ్యం లేక‌పోతే యూజ‌ర్ల‌కు ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌నే విమ‌ర్శ‌లు ఎదురువ‌తున్నాయి. 

జన రంజకమైన వార్తలు