• తాజా వార్తలు
  •  

విండోస్ 10 ఓఎస్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి ఈ రోజే లాస్ట్ ఛాన్స్‌!

విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్... ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే ఓఎస్‌ల‌లో ఇదొక‌టి. అయితే ఇప్పుడు విండోస్‌లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ విండోస్ 6, 7 వాడుతున్న‌వాళ్లే ఎక్కువ‌మంది ఉన్నారు. కానీ విండోస్‌లో ఇప్పుడు 10 వెర్ష‌న్ న‌డుస్తోంది. రేపో మాపో ఇది కూడా అప్‌గ్రేడ్ కావొచ్చు. కావాలంటే మ‌నం విండోస్ 10కు మ‌న ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. అయితే దీనికి కూడా స‌మ‌యం మించిపోతోంది. మీరు ఉచితంగా విండోస్ 10 వెర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి మ‌రో అవ‌కాశ‌మే మిగిలుంది. డిసెంబ‌ర్ 31, అంటే నేడే ఇందుకు చివ‌రి అవ‌కాశం. 12 గంట‌ల‌లోపే వెంట‌నే అప్‌గ్రేడ్ చేసుకోండి మ‌రి. 

ఏం చేయాలంటే..
ప్ర‌స్తుతం ఉన్న విండోస్ వెర్ష‌న్‌ను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే చాలా సుల‌భం. విండోస్ ఓపెన్ చేసి వెబ్ పేజీలో  అప్‌గ్రేడ్ నౌ అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే చాలు. అంద‌రికి విండోస్ 10 ఎక్స్‌పీరియ‌న్స్ చేయించ‌డం కోసం ఆ సంస్థ డిసెంబ‌ర్ 31, 2017 వ‌ర‌కు ఉచితంగా ఈ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌ని.. మీరు అసిస్టివ్ టెక్నాల‌జీస్ ఉప‌యోగిస్తుంటే ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే విండోస్ 10 వెర్ష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 7 ఎంట‌ర్‌ప్రైజ్‌, విండోస్ 8. 8.1, విండోస్ ఆర్‌టీ 8.1 ఓఎస్ ఉన్న వాటిలో మాత్రం అప్‌గ్రేడేష‌న్ కుద‌ర‌దు.  

విండోస్ 10లో ఏమున్నాయంటే..
ఎస్ఓసీ క‌న్నా 1 జిగాహెట్జ్ వేగం ఎక్కువ‌
32 బిట్ డివైజ‌స్‌కు 1 జీబీ ర్యామ్, 64 బిట్‌కు 20 జీబీ ర్యామ్‌
16 జీబీ హార్డ్ డిస్క్ స్పేస్‌
డైరెక్ట్ ఎక్స్ 9, డ‌బ్ల్యూడీడీఎం 1.0 డ్రైవ‌ర్ 

జన రంజకమైన వార్తలు