• తాజా వార్తలు
  •  

మాన్యుఫాక్చ‌ర్‌ని బ‌ట్టి  ఆండ్రాయిడ్‌లో వ్య‌త్యాసాలు ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా?

ఆండ్రాయిడ్ ఫోన్‌...డిజిట‌ల్ యుగంలో ఇదో పెద్ద సంచనం. దీంతో మ‌న లైఫ్ స్ట‌యిలే మారిపోయింది. ఆండ్రాయిడ్‌లో ఎన్నో ర‌కాలు..ఎన్నెన్నో వ్య‌త్యాసాలు.  బ్యాట‌రీ మొద‌లుకొని కెమెరా వ‌ర‌కు. ప్రాసెస‌ర్ నుంచి డిస్‌ప్లే  వ‌ర‌కు పొంత‌నే ఉండ‌ట్లేదు ఒక్కో ఫోన్‌కు.  కొన్ని ఫోన్లు మాత్రం  ఒక మోడ‌ల్‌ను మొయిన్‌టెన్ చేస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం ప్ర‌తిసారీ  ఓ కొత్త రూపుతో ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి.  అయితే దీనికంత‌టికి కార‌ణం మాన్యుఫాక్చ‌ర్లే. మాన్యుఫాక్చ‌ర్ల‌ను బ‌ట్టి  ఆండ్రాయిడ్‌లో వ్య‌త్యాసాలు వ‌స్తున్నాయి.  మ‌రి ఆ వ్య‌త్యాసాలెంటో చూద్దామా..

ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ సైకిల్‌
ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ సైకిల్ అనేది ప్ర‌తి ఆండ్రాయిడ్ ఫోన్‌కి ఉంటుంది.  అంటే ప్ర‌తి  ఆండ్రాయిడ్ లో ఏ వెర్ష‌న్ సాఫ్ట్‌వేర్ వాడాలి. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఏది ఉప‌యోగించాలి.  ఏ ప్రాసెస‌ర్ వాడాలి.. త‌దితర విష‌యాల‌పై ఆండ్రాయిడ్ మాన్యుఫాక్చ‌రింగ్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు లినుక్స్ బెస్డ్‌గా త‌యార‌య్యే  ఓఎస్‌ల‌లో లినుక్స్ కెర్నెల్ వెర్ష‌న్‌ను ఉప‌యోగిస్తారు. అయితే లినుక్స్  ఓఎస్ వాడిన ఈ రెండు ఫోన్లూ ఒకేలా ఉండ‌వు. దీనికి కార‌ణం వేరే డిస్ట్ర్టిబ్యూష‌న్స్‌లో  జీఎన్‌యూ యుటిలిటీస్ ఒకేలా ఉండవు. దీంతో  ఫెర్మార్‌మెన్స్‌లో చాలా తేడా ఉంటుంది. ఆండ్రాయి డ్‌, విండోస్ ఈ రెండూ దాదాపు ఒకే ర‌క‌మైన హైరార్కీ ఉన్న సాఫ్ట్‌వేర్‌, ఓఎస్‌, ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఉప‌యోగిస్తాయి. కానీ జీఎన్‌యూలో ఉన్న తేడాల వ‌ల్ల ఫెర్మార్‌మెన్స్‌లో  పొంత‌న ఉండ‌దు.

గూగుల్  ఏవోఎస్‌పీ
ఆండ్రాయిడ్‌ని మెయిన్‌టెన్ చేయ‌డానికి గూగుల్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏవోఎస్‌పీ)ని ఏర్పాటు చేసింది. అంటే ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో  ఏవోఎస్‌పీ స‌హ‌క‌రిస్తుంది. ఆండ్రాయిడ్‌లో మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ పూర్త‌య్యే వ‌ర‌కు ఇది మానిట‌రింగ్ చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఉండాల్సిన అప్లికేషన్లు ఏమిటి? ఇన్‌బిల్ట్‌గా ఇమేజ్‌లు ఏమిటి? ..డిస్‌ప్లే వీడియోలు ఎలా ఉండాలి ఇవ‌న్నీ కూడా ఏవోఎస్‌పీలో ఒక ప‌ద్ధ‌తిలో ప్ర‌కారం జ‌రిగిపోతాయి. అయితే బ‌య‌ట మాన్యుఫాక్చ‌ర్లు ఎలా వ‌ర్క్ చేస్తున్నారు. తాము కోరుకున్న‌డిజైన్ ఇస్తున్నారా? త‌మ‌కు త‌గ్గ‌ట్టుగా యాప్‌ల‌ను రూపొందిస్తున్నారా?.. ఇలాంటి విష‌యాల‌పై ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ఓఎస్‌ను బ‌ట్టి ఎంత ర్యామ్ సెట్ చేయాలి. రోమ్ ఎంత ఉండాలి అనేవి కూడా దీనిలో  భాగ‌మే.

 మాన్యుఫాక్చ‌ర్లు ఏం చేస్తారంటే..
కొత్త డివైజ్‌ను మాన్యుఫాక్చర్లు  చేయాల‌నుకుంటే ఏవోఎస్‌పీ ప్రాజెక్ట్ నుంచి సోర్స్ కోడ్‌ను కాపీ చేసుకుంటారు. ఆ డివైజ్‌లో ప్ర‌త్యేక‌మైన హార్డ్‌వేర్ రన్ కావాలంటే అవ‌స‌ర‌మైన డ్రైవ్‌ల‌ను కూడా యాడ్ చేసుకుంటారు. అందుకే శాంసంగ్ లాంటి కంపెనీలు ముందుగానే త‌మ డివైజ్‌ల‌లో  అవ‌స‌ర‌మైన డ్రైవ‌ర్ల‌ను ఏర్పాటు  చేసుకుంటున్నాయి. ఒక్కోసారి  ఈ హార్డ్‌వేర్‌కు అద‌న‌పు సాఫ్ట్‌వేర్ అవ‌స‌రం అవుతుంది. ఇదే కాక  మాన్యుఫాక్చ‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఏవోఎస్‌పీ ఫీచ‌ర్ల‌లో కొన్ని మార్పులు  కూడా చేసుకుంటారు. అయితే  తాము ఎంత ఖ‌ర్చుతో ఆండ్రాయిడ్ ఫోన్‌ను త‌యారు చేస్తున్నామ‌న్న అంశం మీద ఇది ఆధార‌ప‌డి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు