• తాజా వార్తలు

యాపిల్‌ ఫేస్ ఐడీ లాంఛ్‌.. త్వ‌ర‌లో మ‌నం స‌మాజంలో చూడ‌నున్న 3 కీల‌క మార్పులివే...

యాపిల్ ఫోన్‌... కొత్త కొత్త మార్పులు తీసుకు రావ‌డంలో టెక్నాల‌జీని కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో ముందంజ‌లో ఉంటుంది. ఇటీవ‌లే ఐఫోన్‌లో కొత్త వెర్ష‌న్ విడుద‌ల చేసిన ఆ సంస్థ‌.. మ‌రిన్ని కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకు రావ‌డానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే యాపిల్ ఒక కొత్త టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. అదే ఫేస్ ఐడీ లాంఛ్‌.  ఐ ఫోన్లో ఇది కొత్త‌గా వ‌చ్చిన ఫీచ‌ర్‌. ఈ కొత్త ఫీచ‌ర్‌తో స‌మాజంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దామా... 

గాడ్జెట్ సెఫ్టీపై ఆందోళ‌న‌
ఇటీవ‌ల యాపిల్ తెచ్చిన ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రూ డెప్త్ అనే ఫేస్ ఐడీ లాంఛ్ సిస్ట‌మ్‌ను ప‌రిచ‌యం చేసింది.  అంటే ఒకేసారి ఒక వ్య‌క్తి ముఖంపై 30 వేల ఇన్‌విజుబుల్ లైట్ డాట్స్ ప‌డ‌తాయి. దీని ద్వారా ఆ వ్య‌క్తిని గుర్తు ప‌డుతుంది ఈ ఫోన్‌. అప్ప‌డు మాత్ర‌మే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.  అయితే  దీని వ‌ల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. గ‌తంలో ఇలాంటి ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ ఆప్ష‌న్ల‌ను బ్రేక్ చేసి సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.  దీనిలో ఉన్న ఈ లొసుగు వ‌ల్లే మ‌న గాడ్జెట్లు ఎంత వ‌ర‌కు సేఫ్ అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. 

నేరాలు తగ్గుతాయి
ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ వ‌ల్ల నేరాల సంఖ్య బాగా త‌గ్గుతుంది.  ఎవ‌రైనా క్రిమిన‌ల్స్ ముఖానికి క‌ర్చీఫ్ క‌ట్టుకున్నా, గ్లాస్‌లు పెట్ట‌కున్నా, మాస్క్ వేసుకున్నా, గ‌డ్డం ఉన్నా.. క్యాప్ ధ‌రించినా  కూడా ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ ద్వారా మ‌నం గుర్తించొచ్చు.  ఫోన్ ఓన‌ర్ ఎవర‌నేది ఈ ఫీచ‌ర్ కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే గుర్తిస్తుంది. భార‌త్‌లో ఇప్పుడు ఆధార్‌ను కూడా దీంతో అనుసంధానం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉంది యాపిల్‌.

న‌ష్టం కూడా ఉందా!
అయితే ముఖాన్ని గుర్తు ప‌డితే చాలు ఫోన్ అన్‌లాక్ కావ‌డం అనే కాన్సెప్ట్‌తో మంచితో పాటు చెడు కూడా ఉంది. అంటే హ్యాక‌ర్లు నిరంత‌రం మ‌న యాక్టివిటీస్ మీద క‌న్నేసి ఉంచుతారు. వారు మ‌న ముఖ క‌వ‌ళిక‌ల‌ను బ‌ట్టి కొన్ని యాప్ త‌యారు చేయ‌గ‌లిగితే చాలు ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డం సుల‌భం. అంతేకాదు వారిని గుర్తించ‌కుండా డేటాను  కూడ ఎరేజ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొలిటిక‌ల్, రిలీజియ‌స్ కార‌ణాల దృష్ట్యా ఇది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు అంటున్నారు.

జన రంజకమైన వార్తలు