• తాజా వార్తలు

చైల్డ్ లేబర్ జీవితాలను మార్చనున్న టెక్ ప్రోగ్రాం పెన్సిల్

స్కిల్‌ ఇండియా ద్వారా నైపుణ్య వృద్ధికి శిక్షణ ఇచ్చేందుకు ఇరాన్‌, జర్మనీలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికశాఖ సదస్సులో ఉద్యోగ కల్పనకు భారత్‌ ప్రయత్నాలను తాను వివరించానని, దీంతో ఆయా దేశాలు ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ నెల 4 నుంచి 16 వరకు జరిగిన సదస్సు విశేషాలను శనివారం శ్రమశక్తిభవన్‌లో కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి ఎం.సతియావతితో కలిసి మీడియాతో తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు మూడేళ్లుగా భారత్‌ లెక్కలేనన్ని చర్యలు తీసుకుంటోంది. వాటి ఫలితంగా చాలావరకు మార్పు వచ్చింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 1.01 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించారు. కాగా దేశవ్యాప్తంగా బాలకార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రాలతో కలసి పనిచేసేందుకు వీలుగా కేంద్ర కార్మిక శాఖ కొత్త ఆన్లైన్ విధానం తీసుకొస్తోంది. దాని కోసం ‘పెన్సిల్‌’ పేరుతో సాంకేతిక వేదికను ఏర్పరుస్తున్నారు. ఇది ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభిస్తారు. దీనిద్వారా ఫిర్యాదుల ఫరిష్కారం, వాటిపై పర్యవేక్షణ సాధ్యమవుతుంది. బాలకార్మికులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లోకి వస్తాయి. ఇది బాలకార్మికుల స్థితిగతులు మార్చడానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు