• తాజా వార్తలు

ఆసియాలో తొలి వీఆర్ లాంజ్ మన దేశంలోనే ఉంది తెలుసా?


ప్రపంచాన్ని ఊహా ప్రపంచంలో నిలుపుతున్న వర్చువల్ రియాలిటీకి క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో వర్చువల్ రియాలిటీ లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఆసియాలో అలాంటి వర్చువల్ రియాలిటీ లాంజ్ ను తొలిసారి మన దేశంలోనే ఏర్పాటు చేశారు. హెచ్ పీ ఇండియా, పీవీఆర్ సినిమాస్ కలిసి నోయిడా ఈ తొలి వీఆర్ లాంజ్ ను నెలకొల్పారు.
నాలుగు డాక్స్
నోయిడాలోని పీవీఆర్ ఈసీఎక్స్ మాల్ ఆఫ్ ఇండియాలో దీన్ని ఏర్పాటు చేశారు. సినిమాలకు వచ్చేవారు ఇక్కడ ట్రయలర్లు, గేమ్స్ వంటి వీఆర్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడున్న నాలుగు వీఆర్ డాక్స్ లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. డ్రామా, యాక్షన్ స్పోర్ట్స్ వంటి ఇంటరాక్టివ్ కంటెంట్ వీఆర్ లో ఎంజాయ్ చేయొచ్చు.
ఆ రెండు సిటీల్లోనే ఆరు చోట్ల..
కాగా దేశవ్యాప్తంగా ఇలాంటివి నాలుగు వీఆర్ లాంజ్ లు ఏర్పాటు చేయాలని పీవీఆర్ సంస్థ టార్గెట్ పెట్టుకుంది. అందులో బెంగుళూరు, ఢిల్లీల్లోనే మూడేసి చొప్పున ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వీఆర్ డాక్స్ లో హెచ్ పీ ఒమెన్ డెస్క్ టాప్ లు ఉంటాయి. హెచ్ టీసీ హెడ్ సెట్లు , కంట్రోలర్లు ఉపయోగిస్తారు.

జన రంజకమైన వార్తలు