• తాజా వార్తలు

ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఏం జ‌రుగుతోంది?  టాప్ 10 ట్రెండ్స్‌

ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌.  కార్బ‌న్ నుంచి శాంసంగ్ దాకా, షియోమి నుంచి యాపిల్ దాకా చిన్నా పెద్దా అన్ని కంపెనీల‌కు బంగారు బాతు. 125 కోట్ల జ‌నాభాలో ఫోన్ కొన‌గ‌లిగే కెపాసిటీ ఉన్న‌వాళ్లు ఎక్కువ‌గా ఉండ‌డం, అందులోనూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్ కోసం ఆరాట‌ప‌డే యూత్ ఎక్కువ‌గా ఉండ‌డంతో మ‌న మార్కెట్‌ను కంపెనీలు తెగ ప్రేమించేస్తున్నాయి.  రోజుకో మోడ‌ల్‌తో, పూట‌కో ఆఫ‌ర్‌తో వాళ్ల మ‌న‌సులు కొల్ల‌గొట్టేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి. తాజాగా మ‌న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి. 
1.  చైనీస్ మొబైల్‌ఫోన్ దిగ్గ‌జం షియోమి ఇండియ‌న్ మార్కెట్‌లో దూసుకెళుతోంది.  ఆర్థిక సంవ‌త్స‌రం మూడో క్వార్ట‌ర్‌లో ఏకంగా 120% గ్రోత్ రేట్‌తో ముందుకెళుతోంది. ఎంఐ స్టోర్స్ పెండ‌చం, ఆఫ్‌లైన్‌లో అమ్మ‌కాల‌తో ఇండియాలోని 50 సిటీస్‌లో షియోమి టాప్ సెల్ల‌ర్‌గా నిల‌బ‌డింది. 
2. మ‌రోవైపు ఓవ‌రాల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్‌లో శాంసంగ్ ఫ‌స్ట్ ప్లేస్  నిల‌బెట్టుకుంది. షియోమి కూడా 24% మార్కెట్ షేర్‌తో శాంసంగ్‌తో జాయింట్‌గా తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. 
3. ముంబ‌యి, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లాంటి టైర్ 1 సిటీస్‌.. ఓవ‌రాల్ మార్కెట్‌లో 29% షేర్ సాధించాయి. భోపాల్‌, గుర్‌గావ్‌, జైపూర్ లాంటి టైర్‌3 సిటీస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్‌గా నిలిచాయి. 
4. గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 నెక్స్ట్‌, జే7 మ్యాక్స్‌లాంటి మోడ‌ళ్లు 60% షేర్ కంట్రిబ్యూట్ చేయ‌డంతో శాంసంగ్.. ప్ర‌స్తుతానికి షియోమి కంటే వెన‌క‌బ‌డ‌లేదు. ఈ మోడ‌ళ్లు క్లిక్ కాక‌పోయి ఉంటే శాంసంగ్ రెండో ప్లేస్‌కు ప‌డిపోయేది. 
5. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ (30వేల కంటే ఎక్కువ ఖ‌రీదైన‌వి) కేట‌గిరిలో వ‌న్ ప్లస్ టాప్ పొజిష‌న్‌లో ఉంది. యాపిల్‌, శాంసంగ్ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
6. ఈ ఇయ‌ర్ మొద‌ట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేట‌గిరీలో టాప్‌లో ఉన్న శాంసంగ్ త‌ర్వాత యాపిల్‌కు ఆ స్థానాన్ని వ‌దులుకుంది. ఇప్పుడు వ‌న్‌ప్ల‌స్ రేస్‌లోకి రావ‌డంతో శాంసంగ్ తొలిసారిగా థ‌ర్డ్ ప్లేస్‌కు ప‌డిపోయింది.  అయితే ఈ ఇయ‌ర్ సేల్స్ పూర్త‌య్యేస‌రికి టాప్ పొజిష‌న్లోకి వ‌స్తానంటోంది. 
7.  ఇండియాలో 100 స్మార్ట్‌ఫోన్ కంపెనీలు త‌మ మోడ‌ల్స్‌ను అమ్ముతున్నాయి. అందుకే చైనా త‌ర్వాత సెకండ్ లార్జెస్ట్ మార్కెట్‌గా మ‌న దేశం నిలిచింది. యూఎస్‌ను థ‌ర్డ్ ప్లేస్‌కు నెట్టింది. 
8. ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ థ‌ర్డ్ క్వార్ట‌ర్‌లో ఇండియా  మొబైల్ ఫోన్ షిప్‌మెంట్ గ్లోబ‌ల్ వాల్యూమ్‌తో కంపేర్ చేస్తే 10%కు చేరింది. అంటే ప్ర‌పంచంలో అమ్ముడ‌య్యే ప్ర‌తి 10 స్మార్ట్‌ఫోన్ల‌లో ఒక‌టి ఇండియాలోనే కొంటున్నారు.
9. ఓవ‌రాల్ మొబైల్ ఫోన్ మార్కెట్ షేర్ ఇండియాలో 30% పెరిగింది. థర్డ్ క్వార్ట‌ర్‌లో 8 కోట్ల సెల్‌ఫోన్లు అమ్ముడ‌య్యాయి.
10. శాంసంగ్‌, షియోమి, యాపిల్‌,లెనోవో, వివో, ఒప్పోల మ‌ధ్యే మెయిన్ కాంపిటీష‌న్ న‌డుస్తోంది. మొత్తం మార్కెట్‌షేర్‌లో 72% వాటా వీటిదే 
 

జన రంజకమైన వార్తలు