• తాజా వార్తలు
  •  

స్మార్ట్‌ఫోన్ల అతిపెద్ద స‌మ‌స్యలు 2018లో ఫిక్స్ చేస్తారా?


స్మార్ట్‌ఫోన్ 2018లో ప్ర‌పంచాన్ని మార్చేస్తుందా? అంత అద్భుత‌మైన ఆవిష్క‌ర‌ణ‌లేమీ జ‌ర‌గ‌వ‌ని, అయితే  అర‌చేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌పైన డెవ‌ల‌ప‌ర్స్ దృష్టి పెడ‌తార‌ని  భావిస్తున్నారు. 
బీజిల్‌లెస్ డిస్‌ప్లే
 2017 చివ‌రిలో వ‌చ్చిన బీజిల్‌లెస్ డిస్‌ప్లే మీద  ఈ  ఏడాది బాగా ప్రయోగాలు జరిగే అవ‌కాశం కనిపిస్తోంది. ఫోన్ సైజ్ పెంచ‌కుండానే స్క్రీన్ సైజ్ పెంచ‌డానికి ఉన్న ఈ ఆప్ష‌న్ ప్ర‌స్తుతం శాంసంగ్‌,ఎల్‌జీ లాంటి పెద్ద కంపెనీలు అదీ  ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌మీదే ట్రైచేశాయి.  యాపిల్ రీసెంట్‌గా లాంచ్ చేసిన ఐఫోన్ 10లోనూ ఇలాంటి డిస్‌ప్లే వ‌చ్చింది.  బీజిల్‌లెస్ డిస్‌ప్లేతోపాటు ఫోన్ డిజైన్‌లో మార్పుల‌కు ప్ర‌య‌త్నించే అవ‌కాశాలున్నాయి.
బ‌యోమెట్రిక్స్‌
ఇప్ప‌టికే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ బాగా పాపుల‌ర‌యింది.10వేల రూపాయ‌ల్లోపు ఫోన్ల‌కు కూడా ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఐకాంటాక్ట్ సెన్స‌ర్‌, ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ సెన్స‌ర్ వంటివి ఐఫోన్ 10 వంటి హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి.  మిడ్ రేంజ్ ఫోన్ల‌కూ అందుబాటులోకి తెచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని టెక్ ఎక్స్‌ప‌ర్ట్‌లు భావిస్తున్నారు.దీంతోపాటు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాల‌జీని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌వుతాయి.
బ్యాట‌రీ లైఫ్‌, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌
ఇక స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న అతిపెద్ద స‌మ‌స్య బ్యాట‌రీ బ్యాకప్‌.బ్యాట‌రీ లైఫ్‌ను మ‌రింత పెంచేలా ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ గురించికూడా నిపుణులు చ‌ర్చిస్తున్నారు. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్ ఓరియో ఇంకా 90%ఫోన్ల‌కు అందుబాటులోకి రాలేదు.దీన్ని 2018లో అన్నింటికీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. లేటెస్ట్ చిప్‌సెట్ డెవ‌ల‌ప్‌మెంట్స్‌, డిజిట‌ల్ పేమెంట్ల కోసం స్మార్ట్‌ఫోన్ల‌లో మ‌రిన్నిఆప్ష‌న్స్ ఇవ‌న్నీ స్మార్ట్‌ఫోన్ త‌యారీదారుల మ‌దిలో ఉన్నాయ‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు.చూద్దాం 2018లో స్మార్ట్‌ఫోన్ ఇంకెంత డెవ‌ల‌ప్ అవుతుందో!

జన రంజకమైన వార్తలు