• తాజా వార్తలు

    జియో ఫోన్ తో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్లకు దెబ్బే

    ఇండియన్ టెలిఫోన్ మార్కెట్లో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఫోన్ మిగతా ఫోన్ మాన్యుఫాక్యరర్స్ ను వణికిస్తోంది ముఖ్యంగా శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలకు గట్టి దెబ్బ తగలడం ఖాయమని ఈ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
    ఇది పేరుకు ఫీచర్ ఫోన్ అయినా అన్నీ స్మార్టు ఫీచర్లు ఉండడంతో పాటు, 4జీ వీవోఎల్టీఈ ఉండడం.. లెక్క ప్రకారం మూడేళ్లలో ఉచితంగా వస్తుండడంతో మిగతా ఫోన్ మేకర్స్ తామూ అదే బాటలో సాగక తప్పని పరిస్థితి. ముఖ్యంగా స్మార్టు ఫీచర్లు, 4జీ వీఓఎల్టీఈ ఉన్న ఫీచర్ ఫోన్లు తయారుచేయడం ఒక్కటే కాకుండా  బెటర్ ఆఫర్లు ఉండేలా టెలికాం కంపెనీలతో టై అప్ చేసుకుని వీలైనంత తక్కువ ధరకు ఫోన్ లభ్యమయ్యేలా చూడాలి. లేదంటే ఇండియాలో బేసిక్ రేంజిలో జియో తప్ప ఇంకే ఫోనూ అమ్ముడయ్యే పరిస్థితి లేదు. 
    నిజానికి ఇండియన్ ఫోన్ మేకర్లలో కొందరు ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్లు తయారీ ప్రయత్నాల్లో ఉన్నారు. అదేసమయంలో ప్రభుత్వం కనీసం జీపీఎస్ ఉండాలని చెప్తుంటే ఫీచర్ ఫోన్లలో అది సాధ్యం కాదని చెప్తున్నవారు కూడా ఉన్నారు. ఇలా అప్ డేషన్ కు అంగీకరించనివారు దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. 
    జియో ఫోన్ రాకతో టెలికాం, ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో రిలయన్స్ జియో... మిగతా సంస్తలు అన్న స్పష్టమైన విభజన ఏర్పడుతుంది. జియో తన ఫోన్లో తన టెలికాం సేవలు అందిస్తే మిగతా ఫోన్ల తయారీదారులు ఇతర టెలికాం సంస్తలతో జట్టు కట్టాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు