• తాజా వార్తలు
  •  

షియోమి వారంటీ విష‌యంలో ప్లే చేస్తున్న అతి చీప్‌ట్రిక్ ..మీకు తెలుసా?

మీరు షియోమి ప్రొడ‌క్ట్ కొన్నారా?  బాక్స్‌లో నుంచి  గ‌బ‌గ‌బా తీసి ప్రొడ‌క్ట్‌ను వాడుకుంటూ ఆ బాక్స్‌ను ప‌క్క‌న ప‌డేస్తున్నారా?  జాగ్ర‌త్త ఒక‌వేళ ఆ బాక్స్ పోతే మీకు వారంటీ రాదు.  ఇదేం చోద్య‌మంటారా?  క‌స్ట‌మ‌ర్ల‌కు వారంటీ ఎగ్గొట్ట‌డానికి షియోమి ప్లే చేస్తున్న అత్యంత చీప్ ట్రిక్ ఇది.
 

బాక్స్‌, మాన్యువల్ లేక‌పోతే అంతే   
 మొబైల్ సేల్స్‌లో శాంసంగ్‌లాంటి అంత‌ర్జాతీయ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జంతో పోటీప‌డి షియోమి.. ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరింది. కానీ స‌ర్వీస్ విష‌యంలో మాత్రం చాలా నాసిర‌కంగా ఉంది. షియోమి స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళితే అక్క‌డ బారులు తీరిన క‌స్ట‌మ‌ర్ల‌ను చూసి షియోమి ప్రొడ‌క్ట్స్ ఇలా ఉన్నాయా అనిపించ‌క మాన‌దు. స‌ర్లే అని స‌ర్దుకుని వారంటీ కోసం మీ ప్రొడ‌క్ట్‌ను స‌ర్వీస్ సెంట‌ర్ వాళ్ల ముందు పెడితే వాళ్లు మీ ప్రొడ‌క్ట్ బాక్స్ ఏద‌ని అడుగుతారు. అది చూపిస్తే స‌ర్వీస్ చేసేస్తార‌నుకుంటున్నారా?  ప్రొడ‌క్ట్ మాన్యువ‌ల్ (ప్రొడ‌క్ట్‌ను గురించి వివరిస్తూ కంపెనీలు ఇచ్చే చిన్న పాంప్లేట్ లాంటిది) ఉందా అడుగుతారు. చాలా స‌ర్వీస్ సెంట‌ర్ల‌లో అది లేద‌న్నా కూడా వారంటీ క‌వ‌ర్ కాద‌ని చెప్పేస్తున్నారని యూజ‌ర్లు కంప్ల‌యంట్ చేస్తున్నారు. 
 

బిల్లు ఉంటే చాల‌దా?
సాధార‌ణంగా ఏదైనా ప్రొడ‌క్ట్ కొన్న‌ప్పుడు వారంటీ కార్డ్ లేదా ఒరిజిన‌ల్ బిల్లు చూపిస్తే ఫ్రీ స‌ర్వీస్ చేస్తారు. ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు ఇలా వేటిక‌యినా అదే ప‌ద్ధ‌తి.  సెల్‌ఫోన్లు కూడా అలాగే చేస్తారు. కానీ షియోమి మాత్రం బిల్లు చూపిస్తే చాల‌దంటోంది. ప్రొడ‌క్ట్ కొన్న‌బాక్స్‌, అందులో ఉండే ప్రొడ‌క్ట్ మాన్యువ‌ల్ కూడా కావాలంటోంది. ఇదేం త‌ల‌తిక్క రూలు, ఒక‌వేళ బాక్స్ పోతే వారంటీ ఇవ్వ‌రా అంటే ఇవ్వ‌మ‌ని చెప్పేస్తున్నారు. త‌మ కంపెనీ వారంటీ రూల్స్‌లో అవ‌న్నీ ఉన్నాయ‌ని ద‌బాయిస్తున్నారు.  దీనిపై కంపెనీకి కంప్ల‌యింట్ చేసినా ప్రాప‌ర్ రెస్పాన్స్ రాలేద‌ని చాలామంది యూజ‌ర్లు చెబుతున్నారు. మీరు షియోమి ఫోన్‌, ఇంకేదైనా ప్రొడ‌క్ట్ కొంటే దాన్ని ఎలా ఉంచినా బాక్స్‌, మాన్యువ‌ల్ లాంటివి మాత్రంజాగ్ర‌త్త పెట్టుకోండి అని ప‌లువురు యూజ‌ర్లు ట్విట్ట‌ర్లోసెటైర్లు కూడా పెడుతున్నారు. సేల్స్‌లో టాప్‌కు వెళ్లినంత మాత్రాన స‌రిపోద‌ని, స‌ర్వీస్ విష‌యంలో శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీల‌తో పోటీప‌డాలే త‌ప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్ద‌ని చాలా మంది క‌స్ట‌మ‌ర్లు షియోమికి స‌జెస్ట్ చేస్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు