• తాజా వార్తలు
  •  

వ‌న్‌ప్ల‌స్ ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ అంట‌.. కార‌ణాలు ఆశ్చ‌ర్య‌క‌రం

వ‌న్‌ప్ల‌స్ ఇండియ‌న్ మార్కెట్లోకి వ‌చ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాప్ బ్రాండ్ల‌తో స‌మానంగా ఆద‌ర‌ణ సంపాదించుకుంది. ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ వ‌న్‌ప్ల‌స్సేన‌ని ఇటీవ‌ల ఓ స‌ర్వే చెప్పింది.  యాపిల్‌, శాంసంగ్‌, ఎల్జీ లాంటి కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో ఉండే ఫీచ‌ర్ల‌ను అందులో సగం ధ‌ర‌కే ఇవ్వ‌డం వ‌న్ ప్ల‌స్ స్పెషాలిటీ. అందుకే వ‌న్ ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ, లేటెస్ట్‌గా వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 5 ఈ మూడు మోడ‌ల్స్ ఫోన్ల‌తోనే ఇండియాలోని టాప్ మొబైల్ బ్రాండ్స్‌లో ఒక‌టిగా ఎదిగింది.  రీసెంట్‌గా సైబ‌ర్‌మీడియా రీసెర్చ్ అనే సంస్థ చేసిన స‌ర్వేలో వ‌న్ ప్ల‌స్ ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ అని తేల్చింది. దీనికి కార‌ణాలేమిటో అని చూస్తే చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. 

యాపిల్ కంటే ఎక్కువ రేటింగ్  
ఎల‌క్ట్రానిక్స్ కంపెనీల్లో లెజెండ్ అయిన యాపిల్  ఐఫోన్ల‌కు కూడా ఇండియాలో 100% కస్ట‌మ‌ర్ శాటిస్‌ఫేక్ష‌న్ రేట్ లేదు. కానీ వ‌న్‌ప్ల‌స్ దాన్ని ద‌క్కించుకుంది.  
హెల్దీ మైండ్ షేర్  
ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఏదైనా ప్రొడ‌క్ట్ న‌చ్చితే దాని గురించి బాగా షేర్ చేసుకుంటారు.   మార్కెట్ షేర్‌ను బ‌ట్టి చూస్తే ఈ విష‌యంలో యాపిల్‌, శాంసంగ్‌లకు ఎక్కువ షేర్ ఉండాలి. కానీ వ‌న్‌ప్ల‌స్ ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో హెల్దీ మైండ్ షేర్‌ను సాధించింది.  
స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ప్రీమియం ఫోన్స్‌
 ప్రీమియం ఫోన్ల గురించి స‌ర్వేలో ప్ర‌శ్నించిన‌ప్పుడు ఎక్కువ మంది వ‌న్‌ప్ల‌స్ గురించే చెప్పారు. దీనికి కార‌ణం శాంసంగ్‌, ఎల్జీ, హెచ్‌టీసీ, యాపిల్ లాంటి బ్రాండ్ల‌తో కంపేర్ చేస్తే అందులో స‌గం ధ‌ర‌కే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల‌ను వ‌న్‌ప్ల‌స్ అందించ‌డ‌మే ఇందుకు కార‌ణం.  
హై రీసేల్ వాల్యూ
వ‌న్‌ప్ల‌స్ పెర్‌ఫార్మెన్స్‌, యూజ‌ర్ల‌లో ఉన్న పాజిటివ్‌నెస్, స‌ర్వీస్ బాగుండ‌డం వంటి  వాటితో ఈ బ్రాండ్ రీసేల్ వాల్యూలో కూడా టాప్‌లోనే ఉంద‌ని స‌ర్వే చెప్పింది. కాబ‌ట్టి ఇది మోస్ట్ రిక‌మండెడ్ మొబైల్ బ్రాండ్‌గా నిలిచింది.  
స‌క్సెస్‌కు కార‌ణాలేంటి?  
క్వాలిటీ: ఈ విష‌యంలో క‌స్ట‌మ‌ర్లు 100% శాటిస్‌ఫేక్ష‌న్ ప్ర‌క‌టంచారు. 
స‌ర్వీస్‌, స‌ర్వీస్ త‌ర్వాత స‌పోర్ట్‌:  స‌ర్వీస్‌, స్పేర్‌పార్ట్ ల‌విష‌యంలో 96% శాటిస్‌ఫేక్ష‌న్ రేట్ ఉంది.  
ప్రాబ్లం రిజ‌ల్యూష‌న్‌: ఏదైనా ప్రాబ్లం వ‌స్తే క్లియ‌ర్ చేయ‌డం బాగుంద‌ని 90% మంది క‌స్ట‌మ‌ర్లు చెప్పారు  దీనికితోడు పెర్ఫార్మెన్స్‌, త‌క్కువ ధ‌ర‌కే ప్రీమియం ఫోన్ ఇవ్వ‌డం వ‌న్‌ప్ల‌స్‌ను మోస్ట్ ట్ర‌స్టెడ్ బ్రాండ్‌గా నిల‌బెట్టాయ‌ని స‌ర్వే వివ‌రించింది.  

జన రంజకమైన వార్తలు