• తాజా వార్తలు
  •  

కేబుల్ ఆపరేట‌ర్లు క‌నుమ‌రుగు కానున్నారా?

ఒక‌ప్పుడు దూర‌ద‌ర్శ‌న్ మాత్ర‌మే మ‌న‌కు తెలిసిన ఛాన‌ల్‌. ఆ త‌ర్వాత టీవీల్లో ఛానెల్స్ విప్ల‌వం పెరిగాక అస‌లు ఎన్ని ఛాన‌ల్స్ ఉన్నాయి.. ఎన్ని మ‌నం చూస్తున్నామో మ‌న‌కే తెలియ‌దు. అంతెందుకు తెలుగులో ఉన్న మొత్తం ఛాన‌ల్స్ సంఖ్య కూడా మ‌న‌కు తెలియ‌దు అంత‌లా పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఛాన‌ల్స్‌! దీనికి కార‌ణం కేబుల్ టీవీల విప్ల‌వ‌మే. ఇంటింటికి టీవీ.. ఇంటింటికి కేబుల్‌తో ఒక వెలుగు వెలిగిపోయింది ఇండియా.  కేబుల్ ఆప‌రేట‌ర్లు గొప్ప‌గా బాగుప‌డ్డారు. ఛానెల్స్ ఎన్ని ఇచ్చినా రేటు మాత్రం ఫిక్స్‌.  కానీ డీటీహెచ్ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది. టాటా స్కై, డిష్ టీవీల‌ను పెట్టించుకుని చాలామంది కేబుల్స్‌ను వ‌దిలేశారు. ఇప్పుడు డీటీహెచ్‌ల‌కు కూడా ముప్పు వాటిలిన‌ట్లే క‌నిపిస్తోంది. వేగంగా విస్త‌రిస్తున్న‌ టెక్నాల‌జీయే దీనికి కార‌ణం. 

డీటీహెచ్ న‌డుస్తున్నా...
చాలామంది ఇప్పుడు కేబుల్ నుంచి డీటీహెచ్‌కు షిప్ట్ అయిపోయారు. ప‌ట్ట‌ణాలు మాత్ర‌మే కాదు ప‌ల్లెల్లోనూ డీటీహెచ్ సేవ‌లు విస్త‌రించాయి. టాటా స్కైతో పాటు రిల‌య‌న్స్ బిగ్ టీవీ, వీడియో కాన్ టీ2హెచ్‌, డిష్ టీవీ లాంటి సంస్థ‌లు దాదాపు అన్ని చోట్ల‌కు పాకేశాయి. దీంతో కేబుల్ ఆప‌రేట‌ర్లు పెద్ద దెబ్బ ప‌డిపోయింది. వీళ్లు సెట‌ప్ బాక్స్‌లు ఇస్తూ డిజిట‌ల్ ప్ర‌సారాలంటూ కొత్త ప‌ల్లవి అందుకోవ‌డంతో జ‌నం కూడా త‌మ‌కు హెచ్‌డీ ఛాన‌ల్స్ కావాల‌నే మోజులో ప‌డ్డారు. ఇదే డీటీహెచ్ ఆప‌రేట‌ర్ల పాలిట వ‌రంగా మారింది. ఒక్కో ఛానెల్‌కు ఒక్కో రేటు వ‌సూలు చేస్తూ వినియోగ‌దారుల ఖ‌ర్చుల‌ను బాగా పెంచేశారు. అంటే ఒక‌ప్పుడు కేబుల్ టీవీకి రూ.100 నుంచి 150 మాత్ర‌మే చెల్లించే జ‌నాలు... ఇప్పుడు హెచ్‌డీ ప్ర‌సారాల మాయ‌ప‌డి  రూ.250 దాకా కిక్కురుమ‌న‌కుండా క‌ట్టేస్తున్నారు. 

వ్య‌తిరేక‌త అందుకేనా!
ఒక‌వైపు కేబుల్ బ‌డ్జెట్ పెరిగిపోవ‌డం, త‌మ‌కు న‌చ్చిన కావాల్సిన అన్ని ఛాన‌ల్స్ రాక‌పోవ‌డంతో వినియోగ‌దారుల‌కు ఒకింత అసంతృప్తిగానే ఉంది.  ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన  ఇంట‌ర్నెట్ అవైల‌బిలిటీ డీటీహెచ్‌కు త‌లనొప్పిగా మారింది.  రోజుకు 1జీబీ మొబైల్ ఇంట‌ర్నెట్ ఉంటే చాలు మ‌న‌కు న‌చ్చిన ప్రోగ్రామ్‌ను చూసుకోవ‌చ్చు. ఈ విష‌యంలో జియో వినియోగ‌దారుల‌కు పెద్ద మేలు చేసింది. దీంతో చాలామంది ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్లు కూడా తీసేసి, డీటీహెచ్‌లో ఛాన‌ల్స్ యాడ్ చేసుకోవ‌డం మానేసి నేరుగా ఇంట‌ర్నెట్లోనే టీవీలు చూసేస్తున్నారు. ఇది డీటీహెచ్‌కు పెద్ద దెబ్బ‌గా మారింది.  హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోని లైవ్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ లాంటి ఓవ‌ర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్‌ రావ‌డం వ‌ల్ల డీటీహెచ్‌కు మ‌రింత న‌ష్టం వాటిల్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వీడియోలు చూసే అవ‌కాశం ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. ఇది మున్ముంద మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి అదే జ‌రిగిదే  డీటీహెచ్ భ‌విష్య‌త్ ఏమిటనేది ప్ర‌శ్నార్థ‌కం!

జన రంజకమైన వార్తలు